కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 1/02 పేజీ 2
  • సేవా కూటాల పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2002
  • ఉపశీర్షికలు
  • జనవరి 14తో ప్రారంభమయ్యే వారం
  • జనవరి 21తో ప్రారంభమయ్యే వారం
  • జనవరి 28తో ప్రారంభమయ్యే వారం
  • ఫిబ్రవరి 4తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2002
km 1/02 పేజీ 2

సేవా కూటాల పట్టిక

జనవరి 14తో ప్రారంభమయ్యే వారం

పాట 16 (143)

15 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. “క్రొత్త ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమము” గురించి చర్చించండి. ప్రత్యేక సమావేశ దినపు తేదీని ప్రకటించి, పూర్తి కార్యక్రమానికి హాజరుకమ్మని అందరికీ నొక్కి చెప్పండి. ఆసక్తిగల కొత్తవారిని, బైబిలు విద్యార్థులను ఆహ్వానించమని ప్రచారకులను ప్రోత్సహించండి.

20 నిమి: ప్రేమపూర్వక ఏర్పాట్లనుండి ప్రయోజనం పొందడం. బ్రాంచి కార్యాలయం డిసెంబరు 1, 2001 తేదీన పంపిన సంక్షిప్త వివరణ ఆధారంగా యోగ్యుడైన పెద్ద ఇచ్చే ప్రసంగం. సరిపడేన్ని అడ్వాన్స్‌ మెడికల్‌ డైరెక్టివ్‌/రిలీజ్‌ కార్డులను సంఘం స్టాకులో ఉంచుకోవాలి. బాప్తిస్మం పొందిన ప్రచారకులు ఈ రాత్రి కూటం తర్వాత వాటిని పొందవచ్చు, కానీ వాటిని ఈ రాత్రే పూరించకూడదు. తర్వాతి సంఘ పుస్తక అధ్యయనం రోజున, సంతకం చేయడం, ధ్రువపరచడం, తారీఖు వ్రాయడం వంటివి జరగాలి, అవసరమైనట్లైతే పుస్తక అధ్యయన నిర్వాహకుడు సహాయం చేస్తాడు. సాక్షులుగా సంతకం చేసేవారు ఆ వ్యక్తి సంతకం చేయడాన్ని స్వయంగా చూడాలి. బాప్తిస్మం పొందని ప్రచారకులు, ఈ కార్డులోని పరిభాషను ఉపయోగించుకుని, తమ పరిస్థితులకూ, నిశ్చయాలకు తగినట్లుగా తమ కోసం తమ పిల్లల కోసం తమ సొంత డైరెక్టివ్‌లను వ్రాసుకోవచ్చు. బైబిలు శిక్షిత మనస్సాక్షి ఆధారంగా, వైద్యపర నిర్ణయాలను ముందుగానే తీసుకోవడం ఎంత జ్ఞానవంతమైనదో నొక్కి చెప్పండి. (సామె. 14:15; 27:12) మీరు చికిత్స విషయంలో మందుల విషయంలో వేటిని అంగీకరించగలరో ముందుగానే స్పష్టంగా, వైద్య సిబ్బందితో చర్చించడం చాలా ముఖ్యం. సరైన నిర్ణయాలు తీసుకోవడానికి శ్రద్ధతో కూడిన వ్యక్తిగత అధ్యయనం అవసరమవుతుంది. జూన్‌ 15, 2000, అక్టోబరు 15, 2000 కావలికోట సంచికల్లోని “పాఠకుల ప్రశ్నలు”లోనుండి తగిన పేరాలను చదవండి. పెద్దలు సహాయం చేయడానికి ఇష్టపడతారు, కానీ ఇతరుల కోసం నిర్ణయాలు తీసుకోలేరు. తమ నిర్ణయాలను తెలిపే ఆ కార్డులను ఎలా పూరించాలో, సొంత కార్డులను ఎలా వ్రాసుకోవాలో వివరించండి.

10 నిమి: “పత్రికల గురించి ఏమని చెప్పాలి?” జనవరి-మార్చి తేజరిల్లు!ను జనవరి 15 కావలికోటను ఎలా అందించాలో చూపే ప్రదర్శనలు. పత్రిక దినముకు మద్దతునిమ్మని ప్రచారకులందరిని ప్రోత్సహించండి.

పాట 1 (13), ముగింపు ప్రార్థన.

జనవరి 21తో ప్రారంభమయ్యే వారం

పాట 8 (53)

10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్‌ రిపోర్టు.

13 నిమి: మీరు ప్రతిదినము లేఖనములను పరిశీలిస్తున్నారా? తమ ప్రతిదిన లేఖన చర్చనుండి ప్రయోజనాలను అధికం చేసుకోవడానికి ఒక కుటుంబం జరిపే చర్చ. వారు డిసెంబరు 15, 1996, కావలికోట, 18వ పేజీలోని 13-14 పేరాలను చర్చిస్తారు. ఇటీవలే చర్చించిన రెండు లేక మూడు దిన వచనాలను క్లుప్తంగా పునఃసమీక్షించి, వాటిలోని సమాచారం ప్రత్యేకంగా ఏ విధంగా ప్రయోజనకరంగా ఉందో వివరించండి. ఈ ఏర్పాటు, కుటుంబ సభ్యులను ఆధ్యాత్మికంగా చురుగ్గా ఉంచేందుకు రూపొందించిన క్రమమైన కుటుంబ బైబిలు అధ్యయన కార్యక్రమంలో ఒక భాగంగా ఉండాలని నొక్కి చెప్పండి.

22 నిమి: “రాజ్యాన్ని ఎల్లప్పుడూ మొదటి స్థానంలో ఉంచండి.”a సెప్టెంబరు 1, 1998, కావలికోట, 19-21 పేజీల్లోనున్న ముఖ్యాంశాలకు సంబంధించి కొన్ని ప్రశ్నలను చేర్చండి.

పాట 4 (43), ముగింపు ప్రార్థన.

జనవరి 28తో ప్రారంభమయ్యే వారం

పాట 9 (37)

10 నిమి: స్థానిక ప్రకటనలు. జనవరి క్షేత్రసేవ రిపోర్టులను ఇమ్మని ప్రచారకులకు గుర్తుచేయండి. ఈ పేజీలోని సూచనలను ఉపయోగించి, జనవరి-మార్చి తేజరిల్లు!ను ఉపయోగిస్తూ ఒకటి, ఫిబ్రవరి 1, కావలికోటను ఉపయోగిస్తూ మరొకటి, రెండు పత్రిక అందింపులను క్లుప్తంగా ప్రదర్శించండి. ఫిబ్రవరి నెల సాహిత్య ప్రతిపాదనల గురించి చెబుతూ, సంఘంలో స్టాకున్న పుస్తకాల గురించి స్పష్టంగా తెలియజేయండి.

10 నిమి: “క్రొత్త ప్రాంతీయ సమావేశ కార్యక్రమము.” ప్రసంగం. ప్రాంతీయ సమావేశపు తేదీని ప్రకటించండి. బైబిలు విద్యార్థులను ఆహ్వానించడానికి అందరూ ప్రత్యేక ప్రయత్నాలు చేయాలి. మరుసటి సమావేశంలో యెహోవాకు తమ సమర్పణను సూచించడం గురించి గంభీరంగా ఆలోచించమని బాప్తిస్మం పొందని ప్రచారకులను ప్రోత్సహించండి. రెండు రోజులూ పూర్తి కార్యక్రమానికి హాజరుకమ్మని అందరినీ ప్రోత్సహించండి.

25 నిమి: “తల్లిదండ్రుల్లారా​—మీ పిల్లలకు బాల్యము నుండే శిక్షణనివ్వండి.”b ఏప్రిల్‌ 15, 1998, కావలికోట, 32వ పేజీ గురించిన వ్యాఖ్యానాలను చేర్చండి. తమ పిల్లలకు బాల్యము నుండే ఆధ్యాత్మిక శిక్షణనివ్వడం వలన పొందిన మంచి ఫలితాల గురించి తెలియజేయమని తల్లిదండ్రులను అడగండి.

పాట 1 (13), ముగింపు ప్రార్థన.

ఫిబ్రవరి 4తో ప్రారంభమయ్యే వారం

పాట 26 (212)

8 నిమి: స్థానిక ప్రకటనలు.

17 నిమి: “వారెట్లు విందురు?”c లేఖనాలు ఎలా వర్తిస్తాయో ప్రేక్షకులను వ్యాఖ్యానించమనండి. ఆగస్టు 15, 1998, కావలికోట, 20వ పేజీలోని 17-18 పేరాల ప్రశ్నలను చేర్చండి.

20 నిమి: “క్షేత్రసేవకు సూచించబడిన అందింపులు.” సేవా పైవిచారణకర్త ప్రేక్షకులతో జరిపే చర్చ. ఈ లోపలి పేజీల్లో సూచించబడిన అందింపుల్లో గతంలో మన రాజ్య పరిచర్య చికల్లో వచ్చినవాటితోపాటు కొన్ని క్రొత్తవి ఉన్నాయి. మున్ముందు ఇవ్వబడే ఇతర అందింపుల్లో, స్థానిక క్షేత్రంలో ఫలవంతమైనవాటిని వ్రాసుకోవడానికి ఆ పేజీల్లో కనిపిస్తున్న ఖాళీలను ఉపయోగించుకోవచ్చు. ప్రేక్షకులకు ఏ అందింపులంటే ఇష్టమో, ఎందుకు ఇష్టమో తెలియజేయమనండి. ఫిబ్రవరి సాహిత్య ప్రతిపాదనలను ఉపయోగించేందుకు ఒకటి లేక రెండు ప్రదర్శనలను ఇవ్వండి. ఈ లోపలి పేజీలను భద్రపరచుకొమ్మని, పరిచర్యకు సిద్ధమవుతున్నప్పుడు తరచూ దీన్ని చూసుకొమ్మని ప్రచారకులందరిని ప్రోత్సహించండి.

పాట 28 (224), ముగింపు ప్రార్థన.

[అధస్సూచీలు]

a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి