పత్రికల గురించి ఏమని చెప్పాలి?
తేజరిల్లు! జన.-మార్చి
“మనం దౌర్జన్యపూరిత కాలంలో జీవిస్తున్నామని మీరు ఒప్పుకుంటారని నేను అనుకుంటున్నాను. [జవాబిచ్చిన తర్వాత, 2 తిమోతి 3:3 చదవండి.] ‘ఉగ్రత’తో కూడిన చర్యలు కుటుంబ జీవితాల్లో కూడా తరచుగా జరుగుతున్నాయి. ‘హింసలనుభవిస్తున్న స్త్రీలకు సహాయం’ అనే ఈ ఆర్టికల్ నిరీక్షణనిచ్చే ఒక సందేశాన్ని అందిస్తుంది. ఈ సందేశాన్ని పంచుకోవడానికి మీకు తెలిసిన వారెవరైనా ఉండవచ్చు.”
కావలికోట జన. 15
“అనేకులు తమ ఆరాధనలో ప్రతిమలను ఉపయోగిస్తారు. కానీ వాటికి రక్షించే శక్తులున్నాయని మీరనుకుంటున్నారా? [జవాబు చెప్పనివ్వండి.] సత్య దేవుడు మన కోసం ఏమి చేస్తాడో దయచేసి గమనించండి. [ప్రకటన 21:3, 4 చదవండి.] నిజమైన దేవుడు మాత్రమే అలా చేయగలడు. ఆ నిజమైన దేవుడు ఎవరో, ఆయనను నమ్ముకోవడం ద్వారా మనం ఎలాంటి ప్రయోజనం పొందుతామో ఈ పత్రిక చూపిస్తుంది.”
తేజరిల్లు! జన.-మార్చి
“ప్రపంచంలో నేడు భయంకరమైన సంఘటనలు అనేకం జరుగుతున్నాయి, ‘ఇలా జరగడానికి దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు?’ అని కొందరు అడుగుతారు, మీరేమనుకుంటున్నారు? [జవాబిచ్చిన తర్వాత, యిర్మీయా 12:1 చదవండి.] ఒక కారణం వల్ల దేవుడు దుష్టత్వాన్ని సహిస్తున్నాడు, కానీ ఇంకా ఎక్కువ కాలం సహించడు. ఎందుకనేది 16వ పేజీలోనున్న ఈ ఆర్టికల్ మీకు తెలియజేస్తుంది.”
కావలికోట ఫిబ్ర. 1
“పర్యావరణ కాలుష్యం గురించి చాలామంది చింతిస్తున్నారు. కానీ మీరెప్పుడైనా మనస్సు కలుషితమవడం గురించి ఆలోచించారా? [జవాబు చెప్పనివ్వండి.] బైబిలు భౌతికంగాను, ఆధ్యాత్మికంగాను శుభ్రంగా ఉండాల్సిన ప్రాధాన్యత గురించి నొక్కి చెబుతోంది. [2 కొరింథీయులు 7:1 చదవండి.] ఈ సమాచారం నిశ్చయంగా మీకు సహాయకరంగానూ, ఆచరణాత్మకంగానూ ఉంటుంది.”