పత్రికల గురించి ఏమని చెప్పాలి?
తేజరిల్లు! అక్టో.-డిసెం.
“గత వెయ్యి సంవత్సరాల్లోని ఏ ఆవిష్కరణ మీ జీవితంలో అత్యధిక ప్రభావాన్ని చూపించింది? [జవాబు చెప్పనివ్వండి.] చాలామంది విద్యుచ్ఛక్తి, టెలిఫోన్లు, లేక కంప్యూటర్లు అని అనుకుంటారు, కానీ కొందరు నిపుణులు బహుశా ఈ మిషనని నమ్ముతారు. [17వ పేజీలోని చిత్రాన్ని చూపించండి.] ఇది మొట్టమొదటి ముద్రణా యంత్రం నమూనా, ఇది లోకాన్ని మార్చేసిందనడంలో సందేహం లేదు. దీన్ని కనుగొన్న యోహాన్నెస్ గుటెన్‌బర్గ్ గురించి చదివి మీరు తప్పకుండా ఆనందిస్తారని నేను నమ్ముతున్నాను.”
కావలికోట డిసెం.15
“ఈ సమయంలో చాలామంది యేసు క్రీస్తును నమ్మినా నమ్మకున్నా ఆయన గురించి ఆలోచిస్తుంటారు. ఆయన నిజమైన వ్యక్తి కాదని కొందరంటారు. మీ అభిప్రాయమేమిటి? [జవాబిచ్చిన తర్వాత, మత్తయి 16:15, 16 చదవండి.] ఆయన మిమ్మల్ని నేడూ, భవిష్యత్తులో ఎలా ప్రభావితం చేస్తాడో తెలుసుకోవడానికి ‘నిజమైన యేసు’ అనే ఈ ఆర్టికల్‌ను చదివి మీరు తప్పకుండా ఆనందిస్తారని నా నమ్మకం.”
తేజరిల్లు! అక్టో.-డిసెం.
“చింతలన్నీ మీకు మంచివి కావా? కావనే మీకనిపించవచ్చు, కానీ తేజరిల్లు! యొక్క ఈ సంచికలోని ఒక ఆర్టికల్, ‘తెలివిగా చింతించడం’ గురించి చర్చిస్తూ, కొన్ని సందర్భాల్లో చింతించడం నిజంగా ఎలా సహాయపడుతుందో తెలిపే కొన్ని ఆచరణాత్మకమైన సలహాలను ఇస్తుంది. దీన్ని మీరు చదువుతారా?”
కావలికోట జన.1
“కొంతమంది సుఖంగా బ్రతుకుతున్నట్లు అనిపిస్తుంటే మరికొందరు బ్రతుకుతెరువు కోసం తీవ్రమైన కష్టాలను ఎదుర్కొనడం చూసి మీకెప్పుడైనా ఆశ్చర్యం అనిపించిందా? దాని గురించి బైబిలు కూడా చెబుతోంది. [యోబు 34:19 చదవండి.] వర్గ భేదాలు లేకుండా చేయాలని దేవుడు ఎలా ఉద్దేశిస్తున్నాడో ఈ పత్రికలో వివరించబడింది.”