యెహోవా ప్రేమపట్ల కృతజ్ఞతను చూపడంవల్ల కలిగే ఆశీర్వాదాలు —రెండవ భాగం.
1 పోయిన నెలలో ఈ విషయంపై చర్చించిన మొదటి భాగంలో, యెహోవా ప్రేమపట్ల మన కృతజ్ఞతను పరిచర్య ద్వారా చూపించడానికి నాలుగు ముఖ్యమైన మార్గాలను మేము తెలియజేశాము. (1 యోహా. 4:9-11) అలా చేయడానికి మరో అయిదు మార్గాలను ఇక్కడ ఇస్తున్నాము. ఆధ్యాత్మిక విషయాల్లో ఇతరులకు సహాయపడడంలో పూర్తిగా నిమగ్నమైనప్పుడు మనం ఆశీర్వదించబడతాము.
2 అనియత సాక్ష్యం: నీతికోసం ఆకలి దప్పులు కలిగివున్న ప్రజలను కనుగొనేందుకూ, వారికి సహాయపడే సాహిత్యాలను ఇచ్చేందుకూ ఇది సమర్థవంతమైన మార్గం. ‘సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొంటూ,’ అన్ని సందర్భాల్లోను, మనం కలుసుకునే వారందరికీ సాక్ష్యమివ్వడం మంచిది. (ఎఫె. 5:15, 16) ఈ విధంగా సాక్ష్యమివ్వాలంటే ధైర్యం కూడగట్టుకోవాల్సి రావచ్చు, కాని మనం దేవుని ప్రేమను, ప్రజల అవసరాలను గ్రహిస్తే, ప్రతి సందర్భంలోను సాక్ష్యమిస్తాము.—2 తిమో. 1:7, 8.
3 టాక్సీలో తోటి ప్రయాణికుడితో సంభాషణ ప్రారంభించినందుకు ఒక పూర్తికాల పరిచారకుడు ఎంతో ఆశీర్వదించబడ్డాడు. ఆ వ్యక్తి ఆసక్తి చూపించాడు. పునర్దర్శనాలు జరిగాయి, బైబిలు అధ్యయనం ప్రారంభమైంది. ఆ వ్యక్తి సత్యంలోకి వచ్చి సంఘ పెద్ద అయ్యేంతగా అభివృద్ధి చెందాడు!
4 ఉత్తరాల ద్వారా సాక్ష్యం: శారీరక అశక్తత వల్లనో లేక వాతావరణం అనుకూలంగాలేని కారణంగానో మనం ఇంటింటి సేవకు వెళ్ళలేకపోవచ్చు. కానీ మనకు తెలిసినవారిలో, తమ ప్రియమైనవారిని మరణమందు కోల్పోయినవారెవరైనా ఉంటే వారికి లేక మన క్షేత్రంలో తాళం వేసివున్న ఇంటివారికి ఉత్తరాల ద్వారా సంక్షిప్తంగా సాక్ష్యమివ్వవచ్చు. ఆకట్టుకునే బైబిలు ఆధారిత సందేశమూ, ఏమైనా ప్రశ్నలుంటే వాటి గురించి ఆలోచింపజేసే సందేశమూగల సమయోచితమైన ఒక కరపత్రాన్ని ఆ ఉత్తరంతోపాటు పంపించవచ్చు. తిరిగి జవాబు వ్రాయడానికి మీ అడ్రస్గానీ, మీ రాజ్య మందిరము అడ్రస్గానీ ఇవ్వండి; దయచేసి బ్రాంచి కార్యాలయానిది మాత్రం ఇవ్వకండి.
5 టెలిఫోన్ సాక్ష్యం: ఇంటింటి పరిచర్యలో కలవనివారిని చేరుకోవడానికి ఇది చాలా మంచి విధానం. మనం మంచి విచక్షణతో, దయతో, నేర్పుగా, నైపుణ్యంగా మాట్లాడితే మంచి ఫలితాలను పొందవచ్చు. ఫిబ్రవరి 2001 మన రాజ్య పరిచర్య, 5-6 పేజీల్లో, మంచి ఫలితాలు ఎలా పొందాలో తెలిపే ఆచరణాత్మకమైన సలహాలున్నాయి.
6 ఒక సహోదరి టెలిఫోను సాక్ష్యమిస్తున్నప్పుడు, ఒక స్త్రీని మీరు మీ భవిష్యత్తు మరియు మీ కుటుంబ భవిష్యత్తు గురించి ఎప్పుడైనా గంభీరంగా ఆలోచించారా అని అడిగింది. అందుకు ఆ స్త్రీ తను ఒకప్పుడు ఆలోచిస్తుండేదని జవాబిచ్చింది. కాని ఇప్పుడు, నిరాశ మూలంగా ఇతరులతో కలవకుండా ఇంట్లోనే ఏకాంతంగా ఉంటోందని ఆమె మాటల ద్వారా తెలిసింది. ఆ సహోదరి ఆ స్త్రీపట్లచూపించిన యథార్థ శ్రద్ధకు ఆమె కదిలిపోయింది, దగ్గర్లో ఉన్న ఒక మార్కెట్లో కలవడానికి ఒప్పుకుంది. తత్ఫలితంగా ఆ స్త్రీ వెంటనే బైబిలు అధ్యయనానికి అంగీకరించింది!
7 క్రొత్త వాళ్ళను ఆహ్వానించడం: మనం మన పొరుగువారిని ప్రేమిస్తే, కూటాలకు ఎవరైనా క్రొత్త వ్యక్తి వచ్చినప్పుడు గమనించగలిగేలా అప్రమత్తతతో ఉంటాము. ఆ క్రొత్త వ్యక్తి తనకు బాగా పరిచయమున్న స్థలంలోనే ఉన్నట్లు భావించేలాచేస్తాము. (రోమా. 15:7) తన ఆధ్యాత్మిక క్షేమంపట్ల యథార్థమైన శ్రద్ధగల వారిమధ్యే ఉన్నానని ఆయన గ్రహించేలా చేయండి. మనం చూపించే యథార్థమైన శ్రద్ధ, మనం ప్రతిపాదించే వ్యక్తిగత బైబిలు అధ్యయనం ఆయన మన సహాయాన్ని స్వీకరించేందుకు పురికొల్పవచ్చు.
8 మన మంచి ప్రవర్తన: మన మంచి ప్రవర్తన ద్వారా, మనం సత్యాన్ని వెల్లడిచేస్తాం. (తీతు 2:9,10) ఈ లోకంలోని ప్రజలు యెహోవాసాక్షులుగా మనల్ని ప్రశంసించినప్పుడు, వారు మన దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. (1 పేతు. 2:12) ఇతరులు జీవమార్గంలో నడవడం ప్రారంభించడానికి ఇదికూడా సహాయపడుతుంది.
9 యెహోవా యొక్క గొప్ప ప్రేమపట్ల కృతజ్ఞతను చూపేందుకు మీరు ఈ అయిదు మార్గాలను పునఃసమీక్షించి ఎందుకు ఆచరించకూడదు? (1 యోహా. 4:16) మీరు అలా చేస్తుండగా గొప్పగా ఆశీర్వదించబడతారు.