కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/01 పేజీ 7
  • భూదిగంతముల వరకు—సాక్ష్యమివ్వడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • భూదిగంతముల వరకు—సాక్ష్యమివ్వడం
  • మన రాజ్య పరిచర్య—2001
  • ఇలాంటి మరితర సమాచారం
  • విజయవంతులైన విద్యార్థుల నుండి విజయవంతులైన మిషనరీలుగా
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • పట్టభద్రులౌతున్న దేవుని వాక్య విద్యార్థులు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • గిలియడ్‌ పట్టభద్రులు—“నిజమైన మిషనరీలు!”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • గిలియడ్‌ స్కూలు “భూదిగంతముల వరకు” మిషనరీలను పంపిస్తోంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2001
km 12/01 పేజీ 7

భూదిగంతముల వరకు—సాక్ష్యమివ్వడం

భూదిగంతముల వరకు అనే వీడియోను మళ్ళీ మళ్ళీ చూడాలని ఎవరు ఇష్టపడుతుండవచ్చు? మిషనరీ కావాలని లక్ష్యమున్నవాళ్ళే. వాళ్ళే ఎందుకు? వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌తో సుపరిచితులవ్వడం కోసం. “భూదిగంతముల” వరకు సాక్ష్యమిచ్చే పనిని వ్యాపింపజేసేందుకు స్థాపించబడిన ఈ విశిష్టమైన స్కూలు 50వ వార్షికోత్సవానికి గుర్తుగా ఈ వీడియో రూపొందించబడింది. (కీర్త. 22:27) దీన్ని చూడడం వలన, సువార్త ప్రకటించడం అనే చాలా ప్రాముఖ్యమైన పనిపట్ల మంచి అవగాహన పెరగడమేగాక మీ పరిచర్యను పెంపొందించుకునేలా పురిగొలుపుతుంది. వీటి గురించి ఆలోచించండి: (1) 1940ల ఆరంభంలో, యెహోవా సంస్థకు అతి ప్రాముఖ్యమైన చింతగా ఉన్న విషయం ఏమిటి? (అపొ. 1:8) (2) 1942లో, నెరవేరడం ప్రారంభమైన ఆశ్చర్యకరమైన బైబిలు ప్రవచనం ఏది, అప్పటి లోక దృక్కోణం కంటే మన దృక్కోణంలో ఎలాంటి వ్యత్యాసం ఉంది? (ప్రక. 17:8; w89 4/15 14వ పేజీ, 12వ పేరా) (3) రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత శాంతి కాలమని ఊహించిన ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఎలాంటి ప్రణాళికలు చేపట్టబడ్డాయి? (jv 522వ పేజీ, 1-2 పేరాలు) (4) మొదటి తరగతి గిలియడ్‌ స్కూలు విద్యార్థుల్లోని ఏ లక్షణాలకు మీరు ముగ్ధులయ్యారు? (5) గిలియడ్‌లోని మొదటి 50 సంవత్సరాల్లో, ఎంతమంది విద్యార్థులు పట్టభద్రులయ్యారు, వాళ్ళు ఎన్ని దేశాలకు పంపించబడ్డారు? (6) వాస్తవానికి విద్యార్థులు బైబిల్లోంచి ఎంతవరకు విద్యను ఆర్జిస్తారు? (7) సామర్థ్యం గల ఒక మిషనరీగా, దేవుని వాక్య బోధకునిగా తయారవ్వాలంటే ఏమి అవసరం? (8) మిషనరీ జీవితం ఎలా ఉంటుంది, ఎలాంటి సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది? (9) తమ జీవన శైలి గురించి మిషనరీలు ఎలా భావిస్తారు, తమ స్వయం త్యాగ విధానం వలన ఎలాంటి ప్రత్యేక ఆనందాలను పొందుతారు? (10) ఇప్పటివరకు పనిచేసిన వేలాది మిషనరీలు ఏమి సాధించారు? ఉదాహరణలు ఇవ్వండి. (11) ప్రకటించడం కోసం “భూదిగంతముల” వరకు వెళ్ళిన సహోదర సహోదరీల గురించి మీకెటువంటి అభిప్రాయం ఉంది? (12) మిషనరీల మాదిరి మిమ్మల్ని ఏమి చేసేందుకు పురిగొలుపుతోంది, ఎందుకు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి