సేవా కూటాల పట్టిక
డిసెంబరు 10తో ప్రారంభమయ్యే వారం
పాట 28 (224)
13 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. డిసెంబరు 24, వారపు సేవా కూటమిలో జరిగే చర్చకు సిద్ధపడేందుకు భూదిగంతముల వరకు అనే వీడియోను చూడమని అందరినీ ప్రోత్సహించండి. 8వ పేజీలోని సలహాలను ఉపయోగిస్తూ, (1) అక్టోబరు-డిసెంబరు తేజరిల్లు!ను, (2) డిసెంబరు 15 కావలికోటను ఎలా అందించాలో ప్రదర్శించండి.
12 నిమి: పెద్దలకు ఇవ్వాల్సిన ఘనతను వారికి ఇవ్వండి. ఇద్దరు లేక ముగ్గురు పరిచర్య సేవకులు జూన్ 1, 1999, కావలికోటలోని 18-19 పేజీలను చర్చిస్తారు. పెద్దలు నిర్వహించాల్సిన అనేక కర్తవ్యాల గురించి అంటే ఉద్యోగము, కుటుంబ బాధ్యతలతోపాటు దైవపరిపాలనా నియామకాల గురించి వాళ్ళు వ్యాఖ్యానిస్తారు. వారి నిర్దేశాన్ని అనుసరిస్తూ, వారి బరువును తేలికపరిచేందుకు, అందరూ వారిని ప్రోత్సహించగల మార్గాలను పరిశీలించండి. చాలా విలువైన సేవ చేస్తున్న పెద్దలు ‘మిక్కిలి ఘనతకు’ అర్హులని సేవకులు అంగీకరిస్తారు.—1 థెస్స. 5:12, 13.
20 నిమి: “యెహోవా ప్రేమపట్ల కృతజ్ఞతను చూపడంవల్ల కలిగే ఆశీర్వాదాలు—రెండవ భాగం.”a 2-6 పేరాలను చర్చించేటప్పుడు, ఇటీవల జరిగిన విపత్తు యొక్క పరిణామాల వలన కృంగిపోయిన లేక భయపడిపోయన వారికి ఓదార్పును, నిరీక్షణనిచ్చే మాటలతో సాక్ష్యమిచ్చిన అనుభవాలను చెప్పమని సంఘాన్ని అడగండి. వాటిలో ఒకటి లేక రెండు అభినయించి చూపేందుకు ముందుగానే ఏర్పాటు చేయండి.
పాట 29 (222) ముగింపు ప్రార్థన.
డిసెంబరు 17తో ప్రారంభమయ్యే వారం
పాట 22 (130)
8 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు. డిసెంబరు 25న, జనవరి 1న ప్రత్యేక క్షేత్ర సేవా ఏర్పాట్ల గురించి సంక్షిప్తంగా తెలియజేయండి.
20 నిమి: “దేవుని వాక్యాన్ని సరిగ్గా ఉపయోగించండి”b 4వ పేరా ఆధారంగా ఆచరణాత్మకమైన ఒక ప్రదర్శనను అందించండి. ఇటీవలి ప్రపంచ పరిస్థితుల వలన కృంగిపోయినవారిని ప్రోత్సహించేందుకు లేక ఓదార్పునిచ్చేందుకు స్థానికంగా ఉపయోగించిన ఒక ప్రభావవంతమైన ప్రదర్శనను కూడా అందించండి. క్లుప్తంగా ఒక అనుభవాన్ని చెప్పవచ్చు. బైబిలునుపయోగించి ఇచ్చే సాక్ష్యం ఎందుకు ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందో వ్యాఖ్యానించమని ప్రేక్షకులను అడగండి.
17 నిమి: “నేను ఏ బైబిలు అనువాదాన్ని ఉపయోగించాలి?” ప్రసంగము, ప్రేక్షకులతో చర్చ. స్థానిక క్షేత్రంలో మాట్లాడే భాషల్లోని మొత్తం బైబిలును ఉపయోగించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పండి.
పాట 9 (37) ముగింపు ప్రార్థన.
డిసెంబరు 24తో ప్రారంభమయ్యే వారం
పాట 29 (222)
10 నిమి: స్థానిక ప్రకటనలు. జనవరి నెలలో ప్రతిపాదించే సాహిత్యాల గురించి, సంఘంలో స్టాకున్న పుస్తకాల గురించి తెలియజేయండి. 8వ పేజీలోని సలహాలనుపయోగించి, ఒకటి అక్టోబరు-డిసెంబరు తేజరిల్లు!తో, మరొకటి జనవరి 1 కావలికోటతో రెండు పత్రిక అందింపులను ప్రదర్శించండి. వాటిలో ఒకదాన్ని యౌవనుల చేత ఇప్పించండి.
10 నిమి: “2002వ సంవత్సరపు దైవపరిపాలనా పరిచర్య పాఠశాల.” పాఠశాల పైవిచారణకర్త ఇచ్చే ప్రసంగం. తమ తమ నియామకాలను నిర్వహించేందుకు కష్టపడి పనిచేయమని అందరినీ ప్రోత్సహించండి.
25 నిమి: “భూదిగంతముల వరకు సాక్ష్యమివ్వడం.” ప్రేక్షకులతో చర్చ. స్థానికంగానైనా లేక ఎక్కువ అవసరమున్న చోటైనా ఇతరులకు సువార్త ప్రకటించడానికి ఇంకా ఏమి చేయగలరో గంభీరంగా ఆలోచించమని అందరినీ ప్రోత్సహించండి. జూలై 2001 మన రాజ్య పరిచర్యలోని 8వ పేజీని సూచించండి. ఫిబ్రవరిలో మనం నోవహు—ఆయన దేవునితో నడిచాడు వీడియోను పునఃసమీక్షిస్తాం.
పాట 13 (124) ముగింపు ప్రార్థన.
డిసెంబరు 31తో ప్రారంభమయ్యే వారం
పాట 2 (15)
10 నిమి: స్థానిక ప్రకటనలు. డిసెంబరు క్షేత్రసేవా రిపోర్టులను ఇమ్మని ప్రచారకులకు గుర్తుచేయండి. క్రొత్త సంవత్సరంలో మీ సంఘం కూటాల సమయాన్ని మారిస్తే, కొత్త సమయాలకు అనుగుణంగా క్రమం తప్పక రమ్మని ప్రతి ఒక్కరినీ ప్రేమపూర్వకంగా ప్రోత్సహించండి. ఆసక్తిగల వారందరికి, క్రియాత్మకంగా లేని వారెవరైనా ఉంటే వారికి కూడా మార్పుల గురించి తెలిసేలా నిర్ధారించుకోండి.
35 నిమి: “‘దేవుని వాక్యాన్ని బోధించేవారు’ జిల్లా సమావేశంలో మీరు నేర్చుకున్నవాటిని ఆచరిస్తున్నారా?” ప్రేక్షకులతో జరిపే ఈ సమావేశ కార్యక్రమం యొక్క చర్చను కావలికోట అధ్యయన నిర్వాహకుడు నిర్వహించాలి. ఒక్క నిమిషం పరిచయ మాటల తర్వాత, ఒక్కోరోజు కార్యక్రమానికి 10-12 నిమిషాలు కేటాయించండి. ప్రతి ఉపశీర్షిక క్రింద ఉన్న ముఖ్యాంశాలను క్లుప్తంగా చర్చించి, ప్రేక్షకులు తాము (1) సమావేశంలో పొందిన సూచనలను అనుసరించేందుకు ఏ విధంగా ప్రయత్నించారు, (2) అలా అనుసరించడం ద్వారా ఎలా ప్రయోజనం పొందారు, (3) ఇంకా ఏమి చేయాలని భావిస్తున్నారు అనే వాటిపై వ్యాఖ్యానించమని అడగండి. ఆహ్లాదకరమైన చర్చను ప్రోత్సహించేందుకు ఆలోచింపజేసే ప్రశ్నలను ఉపయోగించండి. తాము నేర్చుకున్నవాటిని ఆచరణలో పెట్టాల్సిన అవసరముందని అందరూ గ్రహించేలా సహాయపడండి.
పాట 18 (162) ముగింపు ప్రార్థన.
జనవరి 7తో ప్రారంభమయ్యే వారం
పాట 8 (53)
10 నిమి: స్థానిక ప్రకటనలు.
20 నిమి: మీ జీవితాన్ని అమూల్యమైనదిగా చేసుకోండి. కుటుంబ సభ్యులు ఆగస్టు 15, 1998, కావలికోట, 8-9 పేజీలు చర్చిస్తారు. తన కుటుంబం అసంతృప్తి కలిగించే మార్గాన్ని కాకుండా అందరికీ ఆనందాన్నిచ్చే మార్గాన్ని చేపట్టాలని తండ్రి కోరుకుంటాడు. అవగాహన యొక్క ప్రాముఖ్యతపై, ప్రముఖ స్థానంలో పెట్టాల్సిన యోగ్యమైన విషయాలపై, యెహోవాను నమ్మడంపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా సంతోషం తథ్యం అని చెబుతున్న ఆ ఆర్టికల్లోని లేఖనాధారిత ఉద్బోధను వాళ్ళు పునఃసమీక్షిస్తారు. కుటుంబసమేతంగా చేసుకోవాల్సిన ఆచరణాత్మక సర్దుబాట్ల గురించి వాళ్ళు క్లుప్తంగా చర్చిస్తారు.
15 నిమి: మన రాజ్య మందిరంపై శ్రద్ధ వహించండి. పెద్ద ఇచ్చే ప్రసంగం. రాజ్య మందిరం యొక్క స్థితి గురించి పేర్కొనండి. అది అన్ని సమయాల్లోనూ శుభ్రంగా, చక్కగా, ఆకర్షణీయంగా ఉందా? సీట్లు, సౌండు సిస్టమ్, వెంటిలేషన్ సదుపాయాల్లాంటివన్నీ కూటాలను సౌకర్యవంతంగా ఆనందింపచేసేవిగా ఉన్నాయా? టాయ్‌లెట్లు బాగున్నాయా? బిల్డింగు లోపలి గోడలు, వెలుపలి గోడలు సరిగ్గా ఉన్నాయా? చుట్టుపక్కల పరిసరాల విషయమేమిటి? రాజ్య మందిరాన్ని క్రమబద్ధంగా శుభ్రం చేసేందుకు తయారుచేసిన పట్టిక పాటించబడుతోందా? ఎక్కువ శ్రద్ధ చూపించాల్సినవి లేక మెరుగుపరచాల్సినవి ఏమైనా ఉంటే పేర్కొనండి. జ్ఞాపకార్థానికి ముందుగా పూర్తిగా శుభ్రం చేయడానికి ఎటువంటి యోచనలు చేయబడుతున్నాయి? దానికంటే ముందుగా రిపేర్లు చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా? సంఘం ఎలా సహకరించగలదో తెలియజేయండి. మనం ఆరాధించే స్థలం, యెహోవా ఇల్లు అనీ అందుకు తగిన అందానికి, దర్జాకు ప్రతీకగా అది ఉండేలా నిర్ధారించుకోవాల్సిన అవసరముందని నొక్కి చెప్పండి.—కీర్త. 84:1.
పాట 3 (32) ముగింపు ప్రార్థన.
[అధస్సూచీలు]
a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.