2002వ సంవత్సరపు దైవపరిపాలనా పరిచర్య పాఠశాల
1 చాలామంది వాక్శక్తిని తేలిగ్గా తీసుకుంటారు. కాని ఆ వాక్శక్తి యెహోవా ఇచ్చిన బహుమతి. దానిని మనం ఇతరులతో మాట్లాడడానికి, మన ఆలోచనలను, భావాలను వ్యక్తం చేయడానికి ఉపయోగించవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా, దానితో మనం దేవుణ్ణి స్తుతించవచ్చు.—కీర్త. 22:22; 1 కొరిం. 1:4-7.
2 యెహోవా నామమును ప్రకటించడానికి, దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో స్త్రీలు, పురుషులు, పిల్లలు శిక్షణ పొందుతున్నారు. (కీర్త. 148:12, 13) 2002వ సంవత్సరపు పాఠశాల పట్టికలో బైబిలు విషయాలు విస్తృతంగా ఉన్నాయి, వాటినుండి మనం వ్యక్తిగతంగా ప్రయోజనం పొందడమే కాకుండా వాటిని మన పరిచర్యలో కూడా ఉపయోగించవచ్చు. పాఠశాలకు సిద్ధపడుతూ దాంట్లో పాల్గొనడం ద్వారా, మనం మన పరిజ్ఞానాన్నీ, దేవుని వాక్య బోధకులుగా మంచి నైపుణ్యాలనూ పెంపొందించుకోవచ్చు.—కీర్త. 45:1.
3 ప్రతిదినం బైబిలు చదవండి: బైబిలును మనకు అందుబాటులో ఉంచుకుంటే, సమయం దొరికినప్పుడల్లా చదువుకోవచ్చు. మనలో చాలామంది దినంలో కొద్ది సమయమైనా ఖాళీగా ఉంటాము, ఆ సమయాన్ని ఇలా ఉపయోగించుకోవచ్చు. పాఠశాల పట్టికలో చదవవలసిన బైబిలు భాగపు పట్టికను అనుసరించడానికి ప్రతిరోజు ఒక పేజీ చదివితే సరిపోతుంది, అలా చేయడం ఎంత ప్రయోజనకరమో కదా!—కీర్త. 1:1-3.
4 యెహోవాను స్తుతించేలా మన శ్రోతల హృదయాలను పురికొల్పేందుకు, బైబిలు చదివే సామర్థ్యం మనకు బాగా సహాయపడుతుంది. పాఠశాలలో అసైన్మెంట్ నం. 2ను నిర్వహించే విద్యార్థులు నియమిత భాగాన్ని బిగ్గరగా చదవడాన్ని పదే పదే అభ్యాసం చేయాలి. దానికి పాఠశాల పైవిచారణకర్త ప్రశంసించి, చదవడంలో ఇంకా మెరుగుపడడానికి అవసరమైన సలహాలను ఇస్తాడు.
5 ఆచరణాత్మకంగా అన్వయించండి: అసైన్మెంట్ నం. 3 నా బైబిలు కథల పుస్తకంపైనా, అసైన్మెంట్ నం. 4 మహాగొప్ప మనిషి పుస్తకంపైనా ఆధారపడివుంటాయి. క్రొత్తవారు మొత్తం బైబిలుతోను, యేసుక్రీస్తు జీవితంతోను సుపరిచితులయ్యేందుకు సహాయపడే ఈ నియమిత సమాచారం చాలా అమూల్యమైనదిగా ఉంటుంది. అంతేగాక, వీలైతే విద్యార్థులు మన ప్రకటనా పనిలో సూత్రాలను ఎలా ఉపయోగించాలో తెలిపే ఆచరణాత్మకమైన సెట్టింగును ఎంపిక చేసుకోవాలి. పాఠశాల పైవిచారణకర్త ప్రత్యేకంగా వాళ్ళెలా బోధిస్తున్నారు, లేఖనాలను ఎలా అన్వయిస్తున్నారనే దానిపై శ్రద్ధ వహిస్తాడు.
6 దేవుడు బహుమతిగా ఇచ్చిన వాక్శక్తి సువార్త ప్రకటించడానికి, మన గొప్ప దేవుడైన యెహోవాను స్తుతించడానికి వినియోగిస్తూ కొనసాగుతుండడానికి మనందరికీ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల సహాయపడునుగాక!—కీర్త. 34:1; ఎఫె. 6:19.