2001 సంవత్సరపు దైవపరిపాలనా పరిచర్య పాఠశాల
1 దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో సాధ్యమైనంత పూర్తిగా మనమంతా ఎందుకు పాల్గొనాలో తెలియజేసే లేఖనాధారిత కారణాలు తగినన్ని ఉన్నాయి.—సామె. 15:23; మత్త. 28:19, 20; అపొ. 15:32; 1 తిమో. 4:11-13; 2 తిమో. 2:2; 1 పేతు. 3:15, 16.
2 వారపు బైబిలు పఠన కార్యక్రమం, పాఠశాలలో ఎంతోకాలం నుంచి ఒక భాగమై ఉంది. బైబిల్లో ఇంచుమించుగా రోజుకు ఒక పేజీ చదివితే సరిపోతుంది. ఈ సంవత్సరం మొదలుకొని, ప్రతీ వ్రాత పూర్వక పునఃసమీక్ష వారంలో కూడా బైబిలు పఠనం ఏర్పాటు చేయబడింది. గత మూడు సంవత్సరాల కోసం షెడ్యూల్ చేసిన “చదవవలసిన బైబిలు భాగం అదనపు పట్టిక” పూర్తయిపోయింది. ఒకవేళ మీరు ఈ పట్టికలో షెడ్యూల్ చేయబడిన భాగంకన్నా ఎక్కువ చదవాలని అనుకుంటున్నట్లయితే మీరే స్వయంగా ఒక బైబిలు పఠన పట్టికను వేసుకోవచ్చు.
3 దేవుని వాక్య “బహిరంగ పఠనం” చేసేందుకు సహోదరులకు అసైన్మెంట్ నెం. 2 శిక్షణనిస్తుంది. (1 తిమో. 4:13) మీకు చదివే నియామకం ఇవ్వబడినప్పుడు సిద్ధపడే సమయంలో పదే పదే బిగ్గరగా చదువుతూ అభ్యాసం చేయండి. మీ ఉచ్చారణను, స్వరభేదాన్ని, మంచి పఠనానికి కావలసిన ఇతర అంశాలను వృద్ధిపరచుకోవడానికి పాఠశాల నిర్దేశక పుస్తకంలో ఇవ్వబడిన వేర్వేరు సలహాలను మీరు ఉపయోగించవచ్చు.
4 అసైన్మెంట్ నెం. 3, అలాగే నెం. 4లు, వివిధ బ్రోషూర్లపైనా, మహాగొప్ప మనిషి పుస్తకంపైనా ఆధారపడివుంటాయి. నియమిత సమాచారం మీకివ్వబడిన సమయంకన్నా ఎక్కువే తీసుకుంటుంటే మీ సంఘ ప్రాంతానికి ఏది మరింత ఆచరణయోగ్యమైనదిగా ఉంటుందో దాన్నే నియమిత సమాచారంలో నుంచి ఎంపిక చేసుకోండి. మీ ప్రాంతానికి సరిపడే ఏ రకమైన సెట్టింగ్నైనా ఉపయోగించవచ్చు.
5 పాఠశాలలో మీకివ్వబడిన అసైన్మెంట్లన్నింటినీ నిర్వర్తించడానికి మీకు సాధ్యమైనంత మేరకు పూర్తిగా కృషి చేయండి. చక్కగా సిద్ధపడడానికి సమయాన్ని తీసుకోండి, హృదయంలో నుంచి మాట్లాడండి. మీరు సంఘానికి ఒక ప్రోత్సాహకరమైన మూలకంగా ఉంటారు. 2001 సంవత్సరంలో దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో హృదయపూర్వకంగా పాల్గొనడం ద్వారా మీరు వ్యక్తిగతంగా ప్రయోజనం పొందుతారు.