పత్రికల గురించి ఏమని చెప్పాలి?
తేజరిల్లు! అక్టో.-డిసెం.
“యూదులు అరబ్బులు, హిందు ముస్లిమ్‌లు, నల్లవాళ్ళు తెల్లవాళ్ళు, క్యాథలిక్కులు పెంతెకొస్తులు అందరూ కలిసి శాంతియుతంగా జీవించడాన్ని మీరు ఊహించగలరా? అది అసంభవం అని మీరు అనుకుంటుండవచ్చు, కానీ అలాంటి పక్షపాతము, ద్వేషములను అధిగమించడానికి ప్రజలు ఎలా సహాయము పొందుతున్నారో చదవడం మీకు ఆనందాన్నిస్తుంది.”
కావలికోట నవం.15
“‘యేసు మన కోసం మరణించాడు’ అనే మాటలను మనం విన్నాం. [యోహాను 3:16ను ఉదాహరించండి.] ఒకరి మరణం మనల్నెలా రక్షిస్తుందని మీకెప్పుడైనా ఆశ్చర్యం కలిగిందా? [జవాబు చెప్పనివ్వండి.] బైబిలు చాలా సాధారణమైన జవాబిస్తుంది, ‘యేసు రక్షించును—కానీ ఎలా?’ అనే ఈ ఆర్టికల్ దాని గురించి స్పష్టంగా వివరిస్తుంది.”
తేజరిల్లు! అక్టో.-డిసెం.
“అనేక మతాల్లోని ప్రజలు ఈ విశ్వసృష్టి వెనక ఒక గొప్ప శక్తిమంతుడు ఉన్నాడని నమ్ముతారు. మీరు కూడా నమ్ముతారా? [జవాబు చెప్పనివ్వండి.] ఆయనెవరో తెలుసుకోగలమా అని మీరు ఆలోచించి ఉండవచ్చు. ఒక అమెరికన్ ఇండియన్ స్త్రీకి బైబిల్లోని ఈ లేఖనాన్ని చూపించినప్పడు ఆమె దేవుని పేరును ఎలా తెలుసుకుందో ఈ ఆర్టికల్ చూపిస్తుంది. [కీర్తన 83:18 చదవండి.] అలా తెలుసుకోవడం ఆమె జీవితాన్ని ఎలా మార్చి వేసిందో చదవడానికి మీకు చాలా ఆసక్తిని కలిగిస్తుండవచ్చు.”
కావలికోట డిసెం.1
“సంవత్సరంలోని ఈ సమయంలో చాలామంది కానుకలివ్వడం, పరోపకార కార్యాలను చేయడంలో నిమగ్నులై ఉంటారు. అది మనకు యేసు చెప్పిన బంగారు సూత్రం గుర్తుకు తెస్తుంది. [మత్తయి 7:12 చదవండి.] సంవత్సరమంతా ఈ బంగారు సూత్రం ప్రకారం జీవించడం సాధ్యమవుతుందని మీరనుకుంటున్నారా? [జవాబు చెప్పనివ్వండి.] ఈ పత్రిక, ‘బంగారు సూత్రం—ఇప్పటికీ సాధ్యమేనా?’ అనే విషయంపై ఆలోచింపజేసే సమాచారాన్ని మీకు అందిస్తుంది.”