దైవిక బోధచే ఐక్యమవ్వడం —నిజమైన సహోదర ఐక్యత యొక్క పరిశీలన
సంఘ కూటాలకు హాజరు కావడం ఇంకా ప్రారంభించని ఒక స్త్రీతో నిర్వహించబడిన బైబిలు అధ్యయనానికి ఒక సర్క్యూట్ పైవిచారణకర్త హాజరయ్యాడు. ఆయన ఆమెను దైవిక బోధచే ఐక్యమవ్వడం వీడియో చూడడానికి ఆహ్వానించాడు. ఆ వారం ఆమె కూటానికి హాజరయ్యింది, అలా హాజరైనందుకు తనకు చాలా సంతోషంగా ఉందని ఆమె చెబుతుంది. ఈ వీడియో ఎందుకు అంత వేగంగా చక్కని ఫలితాలను పొందగలిగింది? హింసలు, ద్వేషము నిండిన ఈ లోకంలో స్పష్టంగా కనబడుతున్న మన అపూర్వమైన సహోదర ఐక్యతను చూసి ఆమె ముగ్ధురాలైంది.—యోహా. 13:35.
యెహోవాసాక్షులు భూవ్యాప్తంగా అనుభవిస్తున్న శాంతి, ప్రేమలను చూడడానికి గ్రహించడానికి ఈ వీడియోను చూడండి. తర్వాత ఈ ప్రశ్నల గురించి ధ్యానించండి:
(1) “దైవిక బోధ” అనే పేరు 1993-94లో జరిగిన సమావేశాలకు ఎందుకు సరైనది?—మీకా 4:2.
(2) కొన్ని కుటుంబాలపై బైబిలు సత్యం ఎలాంటి ప్రభావం చూపించింది? మీపై ఎలాంటి ప్రభావం చూపించింది?
(3) యెహోవా చేత బోధించబడడం ఎందుకంత ప్రాముఖ్యం?—కీర్త. 143:10.
(4) పెద్ద అంతర్జాతీయ సమావేశాలను ఏర్పాటు చేయడానికి ఎలాంటి సవాళ్ళను అధిగమించాల్సి వస్తుంది?
(5) మీరు హాజరైన క్రైస్తవ సమావేశాల్లో కీర్తన 133:1, మత్తయి 5:3 నిజమని ఎలా రుజువయ్యాయి?
(6) దైవిక బోధ యొక్క శక్తివంతమైన ప్రభావాలకు బహిరంగ రుజువు ఏమిటి?—ప్రక. 7:9.
(7) చరిత్రలో నిజ క్రైస్తవులు అత్యధిక సంఖ్యలో బాప్తిస్మం తీసుకున్న సమయం ఏది?
(8) మీకా, పేతురు, యేసుల ఏ మాటలు యెహోవాసాక్షుల మధ్య నెరవేరుతున్నాయి?
(9) సంతోషభరితమైన, ఐక్యతగల మానవ కుటుంబం అనేది కేవలం ఒక పగటి కల కాదని మీకు నమ్మకం కలిగించినదేమిటి?
(10) మీరు ఈ వీడియోను ఎవరికి చూపించబోతున్నారు, ఎందుకు?
ఒక సహోదరి ఈ వీడియో చూసిన తర్వాత, చక్కని మాటల్లో క్లుప్తంగా ఇలా చెప్పింది: “ప్రపంచవ్యాప్తంగా అనేకమంది క్రైస్తవ సహోదర సహోదరీలు ఈ క్షణంలోనూ యథార్థంగా యెహోవా సేవ చేస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవడానికి ఈ వీడియో నాకు బాగా సహాయం చేసింది . . . మన సహోదర ఐక్యత ఎంత అమూల్యమైనదో కదా!”—ఎఫె. 4:1.