కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 9/01 పేజీ 3
  • ప్రశ్నా భాగం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రశ్నా భాగం
  • మన రాజ్య పరిచర్య—2001
  • ఇలాంటి మరితర సమాచారం
  • క్షేత్రసేవా కూటాలు, వాటికున్న ఉద్దేశాన్ని అవి నెరవేరుస్తాయి
    మన రాజ్య పరిచర్య—2015
  • క్షేత్రసేవా కూటాల నుండి పూర్తి ప్రయోజనం పొందండి
    మన రాజ్య పరిచర్య—2006
  • క్షేత్రసేవా కూటాలు
    మన రాజ్య పరిచర్య—2009
  • క్షేత్రసేవా కూటాల్లో ఇక మీదట దినవచనం పరిశీలించకూడదు
    మన రాజ్య పరిచర్య—2011
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2001
km 9/01 పేజీ 3

ప్రశ్నా భాగం

▪ క్షేత్రసేవ కోసమైన కూటాల్లో ఎలాంటి అంశాన్ని చర్చించాలి?

కూటమి తర్వాత చేయబోయే పరచర్యపై, మనసు కేంద్రీకరించడానికి సహాయపడాలన్నదే క్షేత్రసేవ కోసమైన కూటమి యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి, నిర్వాహకుడు మంచిగా సిద్ధపడి, ప్రోత్సహించే విధంగా, నిర్దిష్టంగా, ఆచరణాత్మకంగా ఉన్న విషయాలను అందించడానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ దినవచనం నేరుగా ప్రకటనా పనికి సంబంధించినదైతే, అది చదివి క్లుప్తంగా చర్చించవచ్చు. అయినా, ఆ రోజు పరిచర్యను కొనసాగించడానికి, సాక్ష్యపు పనిలో వెళ్తున్న వారందరినీ చక్కగా సిద్ధం చేయడానికి సహాయపడగలిగేలా, కూటమి ముఖ్యంగా చేయబోయే పరిచర్య పైనే కేంద్రీకరించాలి.—2 తిమో. 4:5.

ప్రస్తుతం అందించే సాహిత్యాలేవో, అవి ఎలా అందించాలో అందరూ తెలుసుకునేలా, మన రాజ్య పరిచర్య నుండి స్థానికంగా వర్తించే పాయింట్లను చర్చించవచ్చు. పత్రికలందించే రోజున, “పత్రికల గురించి ఏమని చెప్పాలి?” నుండి ఒక అందింపును ప్రదర్శించండి. ఇతర రోజుల్లో, బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను పుస్తకంలోనున్న క్షేత్రసేవకు ఉపయోగపడే పరిచయ మాటలనుండి ఒకటి లేక రెండింటిని స్థానిక క్షేత్రానికి తగిన వాటిని నొక్కి చెప్పండి. పరిచర్యలో బైబిలు ఎలా ఉపయోగించాలో, సంభాషణను ఆటంకపరిచే వారితో ఎలా వ్యవహరించాలో, బైబిలు అధ్యయనాన్ని ఎలా ప్రతిపాదించాలో లేక ఆసక్తిగల వారితో చర్చలను ఎలా కొనసాగించాలో తెలియజేసే ఒక పద్ధతిని గురించి చర్చించండి లేదా ప్రదర్శించండి.

సేవ కోసమైన కూటములు 10 నుండి 15 నిమిషాలకంటే మించకూడదు. ఆ సమయంలోనే గ్రూపులు చేయడము, క్షేత్రాన్ని నియమించడం, ప్రార్థించడం పూర్తి చేయాలి. అక్కడినుండి విడిపోయేముందే హాజరైనవారందరికీ, తాము పని చేయడానికి ఎవరితో, ఎక్కడికి వెళ్తున్నారో తెలిసుండాలి. సాక్ష్యమిచ్చే ప్రచారకుల ప్రతి జంట తాము పని చేయాల్సిన ప్రాంతానికి త్వరగా చేరుకోగలిగేందుకు, వారు సరిగ్గా ఏ ప్రాంతంలో పని చేయాలో తెలుపుతూ వాళ్ళకు టెరిటరీ మ్యాప్‌ కార్డ్‌ (S-12) చూపించాలి. అలా చేయడంవల్ల పెద్ద పెద్ద గుంపులుగా క్షేత్రం వరకు నడిచివెళ్ళడం, అక్కడ ప్రజలందరూ చూస్తుండగా తమ తమ నియమిత ప్రాంతాలు ఎక్కడున్నాయో అడిగి తెలుసుకోవడము తప్పుతుంది. కూటమి తక్కువ సమయం ఉంటుంది కాబట్టి అందరూ సమయానికి చేరుకోవడం ముఖ్యం. సేవా కూటమి ఏదైనా సంఘ కూటమి తర్వాత జరిగినట్లయితే, ఉదాహరణకు కావలికోట అధ్యయనం తర్వాత అయితే అది చాలా క్లుప్తంగా ఉండాలి. అప్పటికే చక్కని లేఖనాధార చర్చ జరిగింది కాబట్టి, దిన వచనం చర్చించాల్సిన అవసరం లేదు.

బాప్తిస్మం పొందిన యోగ్యులైన సహోదరులను సేవ కోసమైన ఒక్కో కూటమిని నిర్వహించడానికి ముందుగానే నియమించాలి. ఎప్పుడైనా ముందుండి నడిపించడానికి ఎవరూ అందుబాటులో లేని రోజు తటస్థపడితే, అలాంటి సందర్భాల్లో కూటాన్ని నిర్వహించడానికి ఒక బాప్తిస్మం పొందిన సహోదరిని పెద్దలు నియమించి ఉంచాలి. ఆ సహోదరి కూర్చొని, దినవచనం లేక క్షేత్రసేవకు సంబంధించిన ఇతర పాయింట్లను గ్రూపుతో చర్చించాలి. ఆమె వ్యాఖ్యానాలు క్లుప్తంగా ఉండాలి. ఆమె తన తలపై ముసుగు వేసుకోవాలి.

క్షేత్ర సేవ కోసమైన కూటాలు మనం ప్రోత్సాహం పొందడానికి, పరిచర్యలో పాల్గొనేలా సిద్ధపడడానికి అద్భుతమైన అవకాశాలు. నిర్వాహకుడు ఎంత బాగా సిద్ధపడితే అందరూ అంత ఎక్కువ ప్రయోజనం పొందుతారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి