ప్రకటనలు
▪ సాహిత్య ప్రతిపాదనలు సెప్టెంబరు నెలలో: ఇరవయ్యో శతాబ్దమందలి యెహోవాసాక్షులు అనే బ్రోషూరు, జీవం—ఇక్కడికెలా వచ్చింది? పరిణామం ద్వారానా లేక సృష్టి ద్వారానా? (ఆంగ్లం) అనే పుస్తకము. అక్టోబరు నెలలో: కావలికోట, తేజరిల్లు! పత్రికలు. ఆసక్తి కనబరచిన వారితో పత్రికా మార్గాలను వృద్ధి చేయడానికి పునర్దర్శనాలు చేయండి. పత్రికా మార్గం ఆచరణాత్మకం కానప్పుడు మాత్రమే చందాలను ప్రతిపాదించండి. నవంబరు నెలలో: దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? బ్రోషూరు లేక నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకము. ఒకవేళ ఇవి ప్రజల దగ్గర అప్పటికే ఉంటే దేవుని కోసం మానవజాతి అన్వేషణ (ఆంగ్లం) లేక ఏదైనా ఇతర పాత ప్రచురణను ప్రతిపాదించండి. డిసెంబరు నెలలో: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి. ప్రత్యామ్నాయంగా, నా బైబిలు కథల పుస్తకము ఉపయోగించండి.
▪ బహిష్కరించబడిన వారెవరైనా లేక సహవాసం మానుకున్న వారెవరైనా తిరిగి రావడానికి మొగ్గు చూపిస్తున్నట్లయితే ఫిబ్రవరి 1, 1992, కావలికోట 16-21 పేజీల్లోని సూచనల ప్రకారం వ్యవహరించాలని పెద్దలకు గుర్తు చేయబడుతోంది.
▪ ప్రభుత్వం చేత రిజిష్టరు చేయబడిన ట్రస్టు ఉన్నవారు, ట్రస్టు ఆగిపోకుండా పీరియాడిక్ మీటింగులు జరుపుతూ, ఆ మీటింగుల వివరాలను భద్రపరచాలి.
▪ ప్రచారకులు, పయినీర్లు తమ వ్యక్తిగత కావలికోట, తేజరిల్లు! కాపీల కొరకు వ్యక్తిగత చందా చేయకుండా రాజ్య మందిరమునుండే పొందాలని ప్రోత్సహిస్తున్నాము. ఇలా చేయడంవల్ల సొసైటీకి పని, ఖర్చులు తగ్గుతాయి.
▪ ఏప్రిల్ 10, 2001 తేదీన అన్ని సంఘాలకు సంబోధించి వ్రాసిన ఉత్తరం, రక్త రహిత చికిత్స—వైద్య శాస్త్రం ఆ సవాలును ఎదుర్కొంటుంది (ఆంగ్లం) అనే క్రొత్త వీడియో డాక్యుమెంటరీ రిలీజ్ గురించి ప్రకటించింది. ఆ కార్యక్రమం ప్రత్యేకంగా ప్రజల కోసం సిద్ధం చేయబడింది. కాబట్టి, మనం చొరవ తీసుకుని దాని గురించి మాట్లాడడం, అది చూడడానికి అవిశ్వాసులైన మన బంధువులను, టీచర్లను, తోటి పనివారిని, తోటి విద్యార్థులను, పొరుగువారిని, బైబిలు విద్యార్థులను పిలవడం చాలా మంచి ఫలితాలను ఇవ్వగలదు. ఆ కార్యక్రమం చూసిన తర్వాత సాక్షులు కానివారు వేసే ప్రశ్నలు, చేసే వ్యాఖ్యానాలు పునర్దర్శనాలకు లేక బైబిలు అధ్యయనానికి పునాది వేస్తుండవచ్చు.
▪ కోల్‌కతాలో (కలకత్తా) జరగబోయే “దేవుని వాక్యాన్ని బోధించేవారు” జిల్లా సమావేశపు షెడ్యూలు మారింది. మారిన తేదీలు, నవంబరు 9-11, 2001, అయితే హాలు అడ్రస్ మాత్రం జూలై 2001 మన రాజ్య పరిచర్యలో ఇచ్చినదే.
▪ దయచేసి బాడ్జీలు పెట్టుకునే కార్డ్ హోల్డర్స్ మంచిగా ఉంటే, జిల్లా సమావేశం అయిపోయిన తర్వాత వాటిని పడవేయకండి. ప్రతి సంవత్సరం కొత్త వాటికోసం అడిగే బదులు వాటినే ఉపయోగించుకునేలా దాచిపెట్టుకోండి.
▪ లభ్యమయ్యే కొత్త ప్రచురణలు:
మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే —నేపాలీ, హిందీ
▪ మళ్ళీ లభ్యమయ్యే ప్రచురణలు:
నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము —బెంగాలీ
“ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను” —తమిళం, నేపాలీ, మరాఠీ, హిందీ
మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు? —తెలుగు
దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా? —తమిళం, తెలుగు, మరాఠీ, మలయాళం, హిందీ
జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు? —కన్నడ, తమిళం, తెలుగు, మరాఠీ, మలయాళం, హిందీ
మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే —తమిళం, మలయాళం
కురుక్షేత్రం నుండి అర్మగిద్దోను వరకు—మరియు మీరు తప్పించుకొనుట —తెలుగు
ఫిర్దౌసుకు నడిపే మార్గాన్ని కనుగొనడమెలా (ముస్లిములకు) —గుజరాతీ, తమిళం, తెలుగు, మలయాళం, హిందీ
▪ పైన చెప్పిన ప్రచురణల కోసం మీ లిటరేచర్ రిక్వెస్ట్‌లు (S-14) పంపించేముందు, ఇంతకుముందు మీరు రిక్వెస్ట్ చేసినవాటిని పంపించేశామన్న విషయాన్ని ఖాయం చేసుకోండి.