కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 9/01 పేజీ 2
  • సేవా కూటాల పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2001
  • ఉపశీర్షికలు
  • సెప్టెంబరు 10తో ప్రారంభమయ్యే వారం
  • సెప్టెంబరు 17తో ప్రారంభమయ్యే వారం
  • సెప్టెంబరు 24తో ప్రారంభమయ్యే వారం
  • అక్టోబరు 1తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2001
km 9/01 పేజీ 2

సేవా కూటాల పట్టిక

సెప్టెంబరు 10తో ప్రారంభమయ్యే వారం

పాట 23 (200)

10  నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు.

13 నిమి: స్థానిక అవసరాలు.

22 నిమి: “మీ పరిచర్యను మీరు సంపూర్ణంగా నెరవేరుస్తున్నారా?”a ప్రేక్షకులతో 1-3 పేరాలు చర్చించిన తర్వాత, జూలై-సెప్టెంబరు తేజరిల్లు!ను ఉపయోగిస్తూ ఒకటి, సెప్టెంబరు 15 కావలికోటను ఉపయోగిస్తూ మరొకటి, రెండు పత్రిక అందింపులను క్లుప్తంగా ప్రదర్శించండి. 4వ పేరా చర్చించిన తర్వాత, జ్ఞానము పుస్తకముతో సూచించిన అందింపును ప్రదర్శించండి.

పాట 13 (124) ముగింపు ప్రార్థన.

సెప్టెంబరు 17తో ప్రారంభమయ్యే వారం

పాట 4 (43)

15 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్‌ రిపోర్టు. “అది ఇండెక్స్‌లో ఉంది.” సృష్టికర్త (ఆంగ్లం) పుస్తకాన్ని ప్రతిపాదించడానికి అందింపులను ఎలా కనుగొనాలో చూపించండి.

15 నిమి: గత సంవత్సరం మనమెంత బాగా చేశాము? సేవా పైవిచారణకర్త ఇచ్చే ప్రసంగం. 2001వ సేవా సంవత్సరపు నివేదికనుండి ప్రాముఖ్యంగా సంఘపు రిపోర్టును చర్చించండి. సాధించిన మంచి విషయాలనుబట్టి ప్రతి ఒక్కరిని అభినందించండి. కూటాలకు హాజరవడానికి, ప్రాంతీయసేవలో క్రమంగా పాల్గొనడానికి, బైబిలు అధ్యయనాలు చేయడానికి, సంఘం ఎలా పని చేసిందో ప్రధానంగా చర్చిస్తూ, ఇంకా అభివృద్ధి చెందడం కోసం ఆచరణాత్మకమైన సలహాలను సంక్షిప్తంగా చెప్పండి. రాబోయే సంవత్సరంలో సాధించగల లక్ష్యాలను నిర్దేశించండి.

15 నిమి: ప్రశ్నాభాగం. ప్రసంగం. సంఘంలోని సేవ కోసమైన కూటాల వార పట్టికను సమీక్షించండి. హాజరైన వారందరు ఈ కూటాల్లో మంచి ఉత్సాహకరమైన చర్చలకు ఎలా తోడ్పడగలరో వివరించండి. ఈ సేవా ఏర్పాట్లకు మద్దతునిమ్మని సంఘాన్ని ప్రోత్సహించండి.

పాట 18 (162) ముగింపు ప్రార్థన.

సెప్టెంబరు 24తో ప్రారంభమయ్యే వారం

పాట 6 (45)

15 నిమి: స్థానిక ప్రకటనలు. “పత్రికల గురించి ఏమని చెప్పాలి?” ఆర్టికల్‌లో అందించిన సూచనలతో, జూలై-సెప్టెంబరు తేజరిల్లు!ను ఉపయోగిస్తూ ఒకటి, అక్టోబరు 1 కావలికోటను ఉపయోగిస్తూ మరొకటి, రెండు అందింపులను ప్రదర్శించండి.

30 నిమి: దేవుణ్ణి ప్రేమించండి—లోకానికి చెందిన వాటిని కాదు. (1 యోహా. 2:15-17) ప్రసంగం, గత సేవా సంవత్సరంలో జరిగిన సర్క్యూట్‌ అసెంబ్లీ కార్యక్రమాన్ని పునఃసమీక్షిస్తూ ప్రేక్షకులతో చర్చ. ప్రచారకులు నేర్చుకున్న కీలకమైన పాయింట్ల గురించి, వాటిని వ్యక్తిగతంగా లేక కుటుంబసమేతంగా ఎలా అనుసరించగలిగారో తెలియజేయమని ప్రచారకులను అడగండి. (ఈ భాగాలను కొందరికి ముందుగానే నియమించవచ్చు.) ఆ కార్యక్రమంలోని ముఖ్యాంశాలివి, వీటిని మీ ప్రసంగంలో చేర్చండి: (1) “దేవుని పట్ల ఉన్న ప్రేమ మన పరిచర్యలో మనలను కదిలిస్తుంది.” మన సువార్తసేవకు అడ్డుతగిలే బిడియం, నేను తగను అనే భావం, మనుష్యుల భయంలాంటి ప్రతికూల భావాలను ఎదుర్కోవడానికి అలాంటి ప్రేమ మనకు సహాయపడుతుంది. (2) “యెహోవాను ప్రేమించువారు చెడును అసహ్యించుకుంటారు.” (w99 10/1 28-31) దేవుడు అసహ్యించుకునే దాన్ని మనం అసహ్యించుకోవడంపై ఆయనతో మన సంబంధం ఆధారపడి ఉంటుంది, స్పష్టంగా కనపడే అక్రమాన్నే కాకుండా, గూఢంగా ఉండే చెడుతనాన్ని కూడా అసహ్యించుకోవాలి. (3) “సర్వోత్తమమైన ప్రేమ మార్గమును అన్వేషించడం.” (w92 7/15 27-30) ఇతరుల దోషాలను మనమెందుకు సహించాలో, స్వార్థానికి, పోటీ స్వభావానికి, హానికరమైన పుకార్లకు దూరంగా ఎలా ఉండాలో మొదటి కొరింథీయులు 13:4-8 చూపిస్తోంది. దేవుని సంస్థతో నమ్మకంగా ఉండండి. (4) “లోకంలో ఉన్నవి—వాటిని మనమెలా దృష్టిస్తాము?” లోకంలో ఉన్నవాటిని మనం ప్రేమించకూడదు, శారీరక కోరికలకు లొంగిపోకూడదు, నేత్రాశలు మనల్ని తప్పుదారి పట్టించనీయకూడదు, లేక జీవపు డంబాలకు తావివ్వకూడదు. (5) “లోక సంబంధులు కాకుండా ఉండడం మనలను కాపాడుతుంది.” కొన్ని నమ్మకాలు, అలవాట్లు, ఆచారాలు దేవుని దృష్టిలో మనలను అనంగీకారులుగా ఎలా చేయగలవో రెండవ కొరింథీయులు 6:14-17 చూపిస్తోంది. అపవాది పన్నే పన్నాగాలను గ్రహించి వాటిని తప్పించుకొని తిరగాలి. (6) “దేవుని ప్రేమించేవారికి దైవిక వాగ్దానాలు.” (w86 6/15 5-6) యెహోవా ఆశీర్వాదం మన జీవితాలను ఆహ్లాదపరచడంతోపాటు, మన ఆధ్యాత్మికతను కూడా సమృద్ధిపరుస్తుంది.—1 తిమో. 6:17-19.

పాట 3 (32) ముగింపు ప్రార్థన.

అక్టోబరు 1తో ప్రారంభమయ్యే వారం

పాట 7 (51)

10 నిమి: స్థానిక ప్రకటనలు. సెప్టెంబరు నెల క్షేత్రసేవ రిపోర్టులను ఇమ్మని ప్రచారకులకు గుర్తుచేయండి.

15 నిమి: స్కూలులో నేను మంచిగా ఎలా చదువుకోగలను? ఒక పెద్దా ఆయన భార్య లేదా ఒక పరిచర్య సేవకుడూ ఆయన భార్య, స్కూలుకు వెళ్తున్న వాళ్ళ అబ్బాయితో/అమ్మాయితో మాట్లాడతారు. తమ కొడుకు/కూతురు చదువులో వెనకబడిపోయినట్లు గమనించి వాళ్ళు చింతిస్తుంటారు. యువత ఇలా అడుగుతోంది, (ఆంగ్లం) 18వ అధ్యాయంలోని సలహాను వాళ్ళు సమీక్షించి, వాళ్ళ అబ్బాయి/అమ్మాయి అభివృద్ధి చెందడానికి ఏమి చేయాలో చర్చిస్తారు. పవిత్ర సేవలో కొనసాగడానికి పూర్తి సామర్థ్యాన్ని వినియోగించగలిగేలా, శ్రేష్ఠమైన ప్రాథమిక విద్య యొక్క ప్రాముఖ్యతను తల్లిదండ్రులు నొక్కి చెబుతారు.

20 నిమి: “ప్రకటనా పనికి అది ఆటంకంగా ఉందా?”b ఉద్యోగంలో సమతూకం ఉండాల్సిన అవసరాన్ని, రాజ్యాసక్తులను మొదటి స్థానంలో పెట్టగలిగే ప్రాధాన్యతలను స్థిరపరచుకోవలసిన అవసరాన్ని నొక్కిచెప్పండి. తమ ఆధ్యాత్మికావసరాలను త్యాగం చేయకుండా, తమ కుటుంబ సభ్యుల భౌతికావసరాలను ఎలా తీరుస్తున్నారో చెప్పమని సంఘంలోని కొందరు కుటుంబ శిరస్సులను అడగండి.

పాట 11 (85) ముగింపు ప్రార్థన.

[అధస్సూచీలు]

a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి