“మర్యాదగాను క్రమముగాను” వ్యవస్థీకరించబడింది
1 ఒక జిల్లా సమావేశం విజయవంతంగా జరగాలంటే, అందుకు అనేక ప్రయత్నాల సమ్మేళనం అవసరం. సమావేశపు అడ్మినిస్ట్రేషన్ సమావేశానికి అనువైన స్థలంతోపాటు రూమింగ్ రిజర్వేషన్లను కూడా ఏర్పాటు చేస్తుంది. ఒంటరి వ్యక్తులు, కుటుంబాలు తమ ప్రయాణానికి, వసతులకు కావలసిన ఏర్పాట్లు చేసుకొంటారు. సమావేశం విజయవంతంగా జరగడానికి అవసరమయ్యే అనేక డిపార్టుమెంట్లలో పనిచేయడానికి సంఘాలు కూడా తమ స్వచ్ఛంద ప్రయత్నాలతో సహకరిస్తాయి. వీటన్నిటి లక్ష్యమేమిటంటే, “సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగ[డమే].”—1 కొరిం. 14:39, 40.
2 సమావేశపు వ్యవస్థీకరణా బృందంతో మీరు మీ ప్రయత్నాలతో సహకరిస్తుండగా, సమావేశానికి అవసరమైన ఏర్పాట్లను చేయడానికి నెలలు, కొన్నిసార్లు సంవత్సరాలు కూడా పడుతుందని గుర్తుంచుకోండి. వందలాది సహోదరులు కొన్ని పనులు పూర్తిచేయడానికి ఎంతో సమయాన్ని వెచ్చిస్తారు. వాటిలో అవసరమైన వాటిని అద్దెకు తేవడం, పరికరాలను సమకూర్చడం, పనివాళ్ళను పిలిపించడంలాంటివి ఇమిడి ఉన్నాయి. ముందుగానే చేసే ఈ సిద్ధపాటు మనందరికీ ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను తెస్తుంది. ఆ పనిలో సహకరించడానికి మనమేమి చేయగలము?
3 రూమింగ్ ఏర్పాట్లతో సహకరించండి: మనమందరమూ సమావేశపు ఏర్పాట్లతో సహకరించడం చాలా ప్రాముఖ్యం. ఇది ప్రత్యేకంగా మన వసతి ఏర్పాట్లు చేసుకొంటున్నప్పుడు అవసరం. వాస్తవానికి, ప్రతి సమావేశానికి వందలాది రూములు అవసరమవుతాయి. మన సహోదరులు చాలా మటుకు ధనవంతులు కాదు కాబట్టి అద్దె తక్కువగా ఉన్న రూముల కోసమే చూస్తారు. సాధ్యమైనంత తక్కువ రేట్లలో హోటల్ రూముల కోసం బేరమాడడంలో తీవ్ర ప్రయత్నాలు జరుగుతాయి. మనం ఇతరుల అవసరాలను గురించి ప్రేమపూర్వకంగా ఆలోచించాలి, మన “సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను.”—ఫిలి. 2:4.
4 వసతి సౌకర్యాలను పొందడంలో మనం సమావేశపు సూచనలను చక్కగా పాటిస్తే ఆ పనిలో ఇమిడివున్న అందరికీ ప్రయోజనం ఉంటుంది. ఆ సూచనలను నిర్లక్ష్యం చేస్తే అనవసరమైన సమస్యలు ఎదురవుతాయి. అదెలా? మనం ఈ సలహాలను పాటించినప్పుడు, ఎన్ని రూములు బుకింగ్ చేశారు, ఎంతమంది అతిథులు ఉంటారు అని హోటల్వాళ్ళకు ముందే తెలుస్తుంది. ఇది రాబోయే సంవత్సరాల్లో కూడా తక్కువ రేట్లతోనే రూములివ్వడానికి, అందుకు అవసరమైన ప్రణాళికలు వేసుకోవడానికి హోటల్వాళ్ళకు సహాయపడుతుంది. మనలో చాలామంది రిజర్వేషన్లు క్యాన్సిల్ చేసుకుంటే లేదా వేరే ఏర్పాటేదైనా చేసుకుంటే, అది హోటల్ యాజమాన్యంతోపాటు, అదే హోటల్లో వసతి కావాలనుకునే మన ఇతర సహోదర సహోదరీలకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అంతేగాక మనం మన వాగ్దానానికి కట్టుబడి ఉండమనే భావంతో హోటల్ యాజమాన్యం భవిష్యత్తులో మన కోసం కొన్ని రూములనే కేటాయించవచ్చు. మరి మనం “అవునంటే అవును,” అని మన మాటకు కట్టుబడి ఉండడం ఎంత మంచిది! (ఇటాలిక్కులు మావి.)—మత్త. 5:37.
5 ఈ మంచి ఫలితాలను పరిశీలించండి: ఒక సమావేశం తర్వాత, ఒక క్యాంప్‌సైట్ మేనేజరు ఇలా వ్యాఖ్యానించాడు: “యెహోవాసాక్షులు తాము చేసే పనులన్నింటిలో చాలా నిజాయితీగా ఉంటారనేది నేను గమనించాను. గత వారం మా క్యాంప్‌లో 40 మంది యెహోవాసాక్షులు బసచేశారు, వాళ్లు ఎటువంటి చిన్న సమస్య కూడా కలిగించలేదు. బదులుగా, వాళ్ళ ట్రేలర్‌లో లేదా టెంట్లో అదనంగా ఎవరైనా వ్యక్తి బసచేస్తే, వాళ్ళే స్వయంగా వచ్చి ఆ విషయాన్ని తెలిపేవాళ్ళు. నేను గమనించినంత వరకు వాళ్ళు చాలా మంచి కస్టమర్లు.” మనకు రూములు, హోటళ్ళు అద్దెకు ఇచ్చే వారందరు అలాంటి చక్కని అనుభవాన్ని పొందితే ఎంత బాగుంటుంది! అది ఎంత చక్కని సాక్ష్యం ఇస్తుంది!
6 ఒక హోటల్ ఛైన్ రీజనల్ మేనేజరు ఒకసారిలా అన్నాడు: “యెహోవాసాక్షులుగా తమ నమ్మకాలకు నిదర్శనంగా చాలా అద్భుతంగా ప్రవర్తించిన ఇంత పెద్ద గుంపు మా హోటళ్ళలో ఇంతవరకు దిగినట్టు నాకు గుర్తులేదు. మీరు మళ్ళీ వస్తారని ఆశిస్తున్నాను.” మంచి ప్రవర్తన మనలను మాత్రమే కాకుండా ప్రపంచంలో మనలను గమనించే చాలామందికి కూడా పునరుత్సాహం కలిగిస్తుందని ఈ వ్యాఖ్యానం వ్యక్తం చేస్తోంది.
7 మనం సహకరించగల ప్రధానమైన మార్గాలు: కొన్ని చిన్న విషయాల ద్వారా, రూమింగ్ రిజర్వేషన్లు చేసే సమావేశపు ఏర్పాటుకు మనం సహకరించవచ్చు. (1) మీరు వాడాలనుకుంటున్న వాటికంటే ఎక్కువ హోటల్ రూములు రిజర్వ్ చేయకండి. (2) మీ రూము రిజర్వేషన్ కోసం డిపాజిట్ చేయడానికి సరిపడేంత డబ్బును పంపించండి. (3) కాంప్లిమెంటరీగా అతిథులకు అల్పాహార ఏర్పాట్లను చేస్తే వాటిని దుర్వినియోగం చేయకండి. (4) హోటల్ నియమాలను మనం చక్కగా పాటిస్తామని హోటల్ యజమానులు ఆశిస్తారన్న విషయం గుర్తుంచుకోండి.
8 యెహోవా దేవుని సేవకులుగా, మనం చేసే పనులన్నింటిలో ఆయన వ్యక్తిత్వాన్ని కనబరిచే ఆధిక్యత మనకుంది. దానిలో, దేవుని పేరు ఇమిడి ఉన్న సమావేశాలకు హాజరు కావడంతోపాటు అందుకు కావలసిన ఏర్పాట్లను చేయడం కూడా ఒక భాగమే. “దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు” అని గుర్తుంచుకోండి. (1 కొరిం. 14:33) కాబట్టి, మనం “దేవుని వాక్యాన్ని బోధించేవారు” జిల్లా సమావేశానికి హాజరు కావడానికి ఏర్పాట్లు చేసుకునేటప్పుడు, మనలను చూసేవారందరు యెహోవా యొక్క ఆ లక్షణం మనలోనూ ఉందని గ్రహించేలా ప్రవర్తించాలని నిశ్చయించుకుందాం. అలా చేయడం వల్ల, గమనించే యథార్థ హృదయులు యెహోవా ప్రజల సంఘాలు “మర్యాదగాను క్రమముగాను” వ్యవస్థీకరించబడ్డాయని గ్రహించవచ్చు.—కీర్త. 68:26.