సమావేశాలు—సంతోషం కలిగించే సమయాలు!
1 యెహోవాసాక్షుల సమావేశాలు గొప్ప సంతోషం కలిగించే సందర్భాలు. వంద కంటే ఎక్కువ సంవత్సరాలుగా ఈ సమావేశాలు మన సంస్థ అభివృద్ధికి దోహదపడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పనిపై, చిన్న ప్రారంభాల నుండి సమృద్ధమైన యెహోవా ఆశీర్వాదాలను మనం చూశాము. ఆధునిక కాలాల్లో, చికాగోలోని ఇల్లినోయిస్‌లో 1893లో జరిగిన మన మొదటి సమావేశానికి హాజరయిన 360 మందిలో 70 మంది యెహోవాకు తాము సమర్పించుకున్నామని తెలపడానికి సూచనగా బాప్తిస్మం పొందారు. గత సంవత్సరం వరుసగా జరిగిన “దేవుని వాక్యప్రకారం ప్రవర్తించేవారు” జిల్లా సమావేశాలకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 94,54,055 మంది హాజరు కాగా, 1,29,367 మంది బాప్తిస్మం పొందారు. సంతోషించడానికి ఇది ఎంత అద్భుతమైన విషయం!
2 దేవుని ప్రజలు యెహోవానుండి వచ్చే ఆదేశాలను అందుకోవడానికి ప్రధానమైన మార్గంగా ఇలా సమావేశమయ్యే ఏర్పాట్లు బైబిలు కాలాలనుండే చేయబడ్డాయి. ఎజ్రా మరియు నెహెమ్యాల కాలంలో ధర్మశాస్త్ర గ్రంథము చదవబడినప్పుడు “ఉదయము మొదలుకొని మధ్యాహ్నమువరకు” ప్రజలు విన్నారు. (నెహె. 8:2, 3) ఆ సందర్భంలో ధర్మశాస్త్రము ప్రజలకు బాగా అర్థమైనందువల్ల, “ఆ ప్రత్యేక దినాన్ని వాళ్ళెంతో సంతోషంగా జరుపుకున్నారు.” (నెహె. 8:8, 12, ఈజీ-టు-రీడ్ వర్షన్) యెహోవానుండి మంచి ఉపదేశాలను, “తగినవేళ” ఆధ్యాత్మిక ఆహారమును “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు[ని]” ద్వారా పొందడానికి సమావేశాలు మనకు మంచి అవకాశాన్నిస్తాయి కాబట్టి మనం కూడా సంతోషిద్దాం. (మత్త. 24:45) మనుష్యుడు “దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలన” జీవించాలని యేసు చెప్పాడు కాబట్టి, సమావేశాలు మన ఆధ్యాత్మిక ఆరోగ్యానికి చాలా ప్రాముఖ్యమైనవి.—మత్త. 4:4.
3 హాజరు కావడానికి ప్రయత్నించడం అన్ని విధాలుగా తగినది: “దేవుని వాక్యాన్ని బోధించేవారు” అనే ఈ సంవత్సరపు జిల్లా సమావేశానికి హాజరవడాన్ని మనం అందరము వ్యక్తిగత లక్ష్యంగా పెట్టుకోవాలి. ప్రతిరోజు ముందుగానే చేరుకొని, ముగింపు ప్రార్థనకు అందరితో కలిసి “ఆమెన్!” అని చెప్పేంతవరకు మనం అక్కడ ఉండేలా ప్రణాళిక వేసుకోవాలి. అలా చేయడానికి బహుశా మనం మన దైనందిన కార్యక్రమాల్లో సర్దుబాట్లు చేసుకోవాల్సి రావచ్చు. సమావేశానికి హాజరవడం కోసం మన ఉద్యోగంనుండి సెలవు పొందాలంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసిరావచ్చు. ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టకుండా మనం స్థిరంగా ఉండాలి. మనకు వసతి మరియు/లేక ట్రాన్స్‌పోర్టేషన్ కావాలనుకుంటే ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలి. మనం ఎలాంటి ప్రయత్నం చేసినా అది తగినదే!
4 యెహోవా ప్రజలు సమావేశాలకు హాజరవడం వల్ల పొందే ఆశీర్వాదాలను డబ్బుతో లెక్కించరు. 1958లో, న్యూయార్క్ నగరంలో జరిగిన దైవిక చిత్తం అనే యెహోవాసాక్షుల అంతర్జాతీయ అసెంబ్లీకి హాజరు కావాలని నిర్ణయించుకొన్న కొందరి ఉదాహరణలను గమనించండి. ఒక సహోదరుడు అసెంబ్లీకి హాజరు కావడానికీ, అక్కడ సహాయం చేయడానికీ తన కన్స్ట్రక్షన్ బిజినెస్‌ను రెండు వారాలపాటు మూసేశాడు. వర్జిన్ ఐలాండ్స్‌లోని మరొక సహోదరుడు, ఆరుగురు సభ్యులున్న తన మొత్తం కుటుంబంతో హాజరవాలని ఐదెకరాల స్థలాన్ని అమ్మేశాడు. ఒక యువజంట, రెండు నెలల వయసునుండి ఏడేండ్ల వయసున్న తమ ముగ్గురు పిల్లలను కూడా అసెంబ్లీకి తీసుకువెళ్ళడానికి వాళ్ల మోటర్బోటును అమ్మేశారు. కాలిఫోర్నియాలోని ముగ్గురు అన్నదమ్ములు తమ ఉద్యోగాలకు హాజరు కాకుండా అసెంబ్లీకి వెళితే తిరిగి వచ్చేసరికి ఉద్యోగాలు ఊడిపోతాయి అని బెదిరించబడ్డారు. అయినప్పటికీ, మరపురాని ఆ అసెంబ్లీకి హాజరవకుండా వాళ్ళను ఆ బెదిరింపేమీ ఆపలేకపోయింది.
5 హృదయపూర్వకంగా చేసే మన ప్రయత్నాలను యెహోవా ఆశీర్వదిస్తాడు: యెహోవా తన ప్రజలు చేసే ప్రయత్నాలను చూస్తాడు, ఆశీర్వదిస్తాడు. (హెబ్రీ. 6:10) ఉదాహరణకు, 1950లో జరిగిన దైవిక పరిపాలన అభివృద్ధి అనే అసెంబ్లీకి హాజరయినవారు, “నూతన విధానం” అనే బహిరంగ ప్రసంగాన్ని విన్నారు. సహోదరుడు ఫ్రెడ్రిక్ ఫ్రాంజ్ “నూతనభూమి భావి రాజులు ఇక్కడ, ఈ రోజు మన మధ్య ఉన్నారని తెలుసుకోవడం ఈ అంతర్జాతీయ అసెంబ్లీకి హాజరయిన వారందరికీ సంతోషకరంగా ఉందా?” అని అడగడం ద్వారా అందరినీ ప్రోత్సహిస్తూ, పురికొల్పాడు. 50 సంవత్సరాల తర్వాత, నేడు కూడా కీర్తన 45:16 యొక్క స్పష్టపరచబడిన అవగాహనతో మనం ఇంకా సంతోషిస్తున్నాము.
6 గత సంవత్సరపు జిల్లా సమావేశానికి హాజరయిన తర్వాత, ఒక మెప్పుదలగల కుటుంబ పెద్ద ఇలా వ్రాశాడు: “సహోదరులారా, ఈ సమావేశం నా ప్రాణాలను ఎలా రక్షించిందో మీకు తెలియదు. మా కుటుంబం ఉద్యోగరీత్యా పట్టణానికి తరలి వెళ్ళాల్సివచ్చింది, దానితో మా ఆధ్యాత్మికత సన్నగిల్లింది . . . మా క్రైస్తవ బాధ్యతలను నిర్లక్ష్యం చేశాము. చివరికి మేము కూటాలకు హాజరవడం, పరిచర్యలో పాల్గొనడం కూడా మొత్తానికే మానేశాము. . . . ఈ సమావేశము మమ్మల్ని తిరిగి పునరుజ్జీవింపజేసింది. మేము మళ్ళీ ఆధ్యాత్మిక లక్ష్యాలను పెట్టుకొంటున్నాము, వాటిని సాధించడానికి తగిన ఏర్పాట్లు కూడా చేసుకొంటున్నాము.”
7 మనకు కావలసిన ఆధ్యాత్మిక ఆహారాన్ని యెహోవా అందిస్తున్నాడు. మన సమావేశాల్లో ఆయన సమృద్ధమైన భోజనపు బల్లను సిద్ధపరుస్తున్నాడు. ఈ ఏర్పాటుకు మనం చూపించే ప్రశంస, కొర్నేలీని పేతురు సందర్శించినప్పుడు “ప్రభువు [“యెహోవా,” NW] నీకు ఆజ్ఞాపించినవన్నియు వినుటకై యిప్పుడు మేమందరము దేవుని యెదుట ఇక్కడ కూడియున్నా[ము]” అని కొర్నేలీ చెప్పినట్లే మనమూ చెప్పడానికి పురికొల్పాలి. (అపొ. 10:33) ఈ సంవత్సరపు “దేవుని వాక్యాన్ని బోధించేవారు” అనే జిల్లా సమావేశంలోని ప్రతి సెషన్‌కు “దేవుని యెదుట . . . కూడి”యుండడాన్ని మన లక్ష్యంగా చేసుకొని ఆనందించుదాం!