కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/01 పేజీ 2
  • సేవా కూటాల పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2001
  • ఉపశీర్షికలు
  • మార్చి 12తో ప్రారంభమయ్యే వారం
  • మార్చి 19తో ప్రారంభమయ్యే వారం
  • మార్చి 26తో ప్రారంభమయ్యే వారం
  • ఏప్రిల్‌ 2తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2001
km 3/01 పేజీ 2

సేవా కూటాల పట్టిక

మార్చి 12తో ప్రారంభమయ్యే వారం

పాట 16 (143)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు.

15 నిమి: స్థానిక అవసరాలు.

20 నిమి: “‘ప్రయాసపడవలసిన, పాటుపడవలసిన’ సమయం ఏప్రిల్‌ నెల.” (1-13 పేరాలు) సంఘాధ్యక్షుడు నిర్వహించాలి. ఏప్రిల్‌లో మనమేమి సాధించాలని కోరుకుంటున్నామన్నది ఉత్సాహంగా చర్చించాలి. ఆ నెలలో సంఘంలోని అందరూ పరిచర్యలో పాల్గొనాలనే లక్ష్యాన్ని చేరుకునేందుకు సంఘంలోని ప్రతి ఒక్కరూ ఎవరి వంతు వారు చేయాలని ప్రోత్సహించండి.

పాట 26 (212), ముగింపు ప్రార్థన.

మార్చి 19తో ప్రారంభమయ్యే వారం

పాట 15 (127)

8 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్‌ రిపోర్ట్‌.

17 నిమి: 2001 వార్షిక పుస్తకమును సద్వినియోగం చేసుకోండి. ప్రసంగమూ, ప్రేక్షకులతో చర్చా. 31వ పేజీలోని “2000 గ్రాండ్‌ టోటల్స్‌”ను పునఃసమీక్షించండి. 3-5 పేజీల్లో ఉన్న “పరిపాలక సభ యొక్క ఉత్తరము”ను చర్చించండి. క్రొత్త వార్షిక పుస్తకంలో ముఖ్యంగా తమను ప్రోత్సహించిన తమ విశ్వాసాన్ని బలపరచిన ఒక నివేదికను గానీ అనుభవాన్ని కానీ చెప్పమని ప్రేక్షకుల్లో కొందరిని అడగండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బేతేలు కుటుంబాలు వార్షిక పుస్తకమును సంవత్సరాంతమూ కలిసి చదువుతున్నట్లే, కుటుంబాలు కూడా వార్షిక పుస్తకమునంతటినీ కలిసి చదవాలని ప్రోత్సహించండి. 255వ పేజీలో ఉన్న, నేర్చుకున్నవాటిని పునఃసమీక్షించేందుకు ఉపయోగించగల ప్రశ్నలను ప్రత్యేకంగా పేర్కొనండి. యెహోవా సంస్థనూ, దానిలో భాగమై ఉండే ఆధిక్యతను మరింతగా అర్థం చేసుకునేలా బైబిలు విద్యార్థులకు సహాయపడేందుకు వార్షిక పుస్తకమును ఎలా ఉపయోగించవచ్చనే దానికి సూచనలను అడగండి.

20 నిమి: “‘ప్రయాసపడవలసిన, పాటుపడవలసిన’ సమయం ఏప్రిల్‌ నెల.” (14-30 పేరాలు) సేవా పైవిచారణకర్త వాటి నుండి ఎంపిక చేసుకున్న ప్రశ్నా సమాధానాల భాగాలతో ప్రసంగాన్నిస్తాడు. ఏప్రిల్‌ నెలలో, సాధ్యమైనంత మేరకు పరిచర్యలో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరూ ఆచరణాత్మకమైన షెడ్యూల్‌ని వేసుకోవాలి. ఆ నెల కోసం పథకం వేయబడిన క్షేత్రసేవ కొరకైన కూటాల షెడ్యూల్‌ని క్లుప్తంగా తెలియజేయండి. సహాయ పయినీరింగ్‌ చేయగలవారందరినీ చేయమనీ, కూటం తర్వాత దరఖాస్తులను తీసుకోమనీ ప్రోత్సహించండి.

పాట 6 (45), ముగింపు ప్రార్థన.

మార్చి 26తో ప్రారంభమయ్యే వారం

పాట 25 (204)

10 నిమి: స్థానిక ప్రకటనలు. ఏప్రిల్‌లో సహాయ పయినీరింగ్‌ చేసేందుకు దరఖాస్తును ఇప్పటికైనా పంపవచ్చనీ, సమయం మించిపోలేదనీ వివరించండి. ప్రతి దినము లేఖనములను పరిశీలించుట—2001లో ఏప్రిల్‌ 3-8 రోజులకు ఇవ్వబడిన చదవవలసిన జ్ఞాపకార్థానికి సంబంధించిన బైబిలు భాగాల షెడ్యూల్‌ను అనుసరించమని అందరినీ ప్రోత్సహించండి. జ్ఞాపకార్థాన్ని ఆచరించే వారంలో కావలికోట అధ్యయనం ఎప్పుడు జరగనుందో ప్రకటించండి. ఈ ఆదివారం, అంటే ఏప్రిల్‌ 1న, ఇవ్వబడనున్న “ఎవరు రక్షించబడతారు?” అనే ప్రత్యేక బహిరంగ ప్రసంగాన్ని గురించి చర్చించడం మరిచిపోకండి. ఏప్రిల్‌ నెల పరిచర్యకు మంచి ఆరంభంగా ఉండేలా, అదే రోజున పరిచర్యలో పాల్గొనమని అందరినీ ప్రోత్సహించండి.

20 నిమి: “మనమందరమూ యెహోవానూ ఆయన కుమారుడ్నీ ఘనపరచుదాం.” ఒక పెద్ద లేఖనాధారంగా పురికొల్పునిచ్చే ప్రసంగాన్నిస్తారు. ఏప్రిల్‌లో పథకం వేయబడిన ప్రత్యేక కార్యకలాపంలో సాధ్యమైనంత ఎక్కువగా పాల్గొనమని, జ్ఞాపకార్థానికి ప్రజలను ఆహ్వానించేందుకు ప్రత్యేక ప్రయత్నం చేయమని అందరినీ ప్రోత్సహించండి.

15 నిమి: మన పత్రికల అందింపులను సిద్ధం చేయడం. ఏప్రిల్‌ నెలలో కావలికోట, తేజరిల్లు!లను మనం ప్రతిపాదిస్తాం. అక్టోబరు 1996 మన రాజ్య పరిచర్యలోని 8వ పేజీ, 3, 10 పేరాలను పునఃసమీక్షించండి. ఒక్కో తాజా పత్రికను అందించడంలో ప్రభావవంతంగా ఉపయోగించగల (1) ఒక ఆర్టికల్‌ను, (2) సముచితమైన చర్చనీయాంశాన్నీ, (3) ఆసక్తిని రేకెత్తించే ఒక ప్రశ్నను, (4) సమయోచితమైన లేఖనాన్నీ చర్చించండి. ఆసక్తిగలవారితో బైబిలు అధ్యయనాలను ప్రారంభించేందుకు దేవుడు కోరుతున్నాడు బ్రోషూర్‌ని గానీ, జ్ఞానము పుస్తకాన్ని గానీ ఉపయోగించడానికి ప్రయత్నించండి. మొదటి సందర్శనంలోనే దీన్నెలా చేయవచ్చో చూపించేటువంటి చక్కగా సిద్ధపడిన ప్రదర్శనతో ముగించండి.

పాట 1 (13), ముగింపు ప్రార్థన.

ఏప్రిల్‌ 2తో ప్రారంభమయ్యే వారం

పాట 29 (222)

9 నిమి: స్థానిక ప్రకటనలు. మార్చి నెల క్షేత్రసేవా రిపోర్టులను ఇవ్వమని ప్రచారకులకు గుర్తు చేయండి. “జ్ఞాపకార్థ ఆచరణకు సంబంధించిన జ్ఞాపికలు” పునఃసమీక్షించండి.

18 నిమి: “ప్రకటించేలా ప్రేమ మనల్ని పురికొల్పుతుంది.”a ఈ ఆర్టికల్‌లోని లేఖనాలను చదివి వివరించండి. అంతర్దృష్టి (ఆంగ్లం) వాల్యూమ్‌ 2, 673వ పేజీ 1వ పేరాలోని తలంపులను చేర్చండి. ప్రకటనాపనిలో పట్టుదలగా ఉండేందుకు దేవుని మీద తనకున్న ప్రేమ తననెలా పురికొల్పుతుందో చెప్పమని అనేక సంవత్సరాలుగా క్రియాశీలంగా ఉన్న ఒక ప్రచారకుడ్ని ఆహ్వానించండి. ఏప్రిల్‌లోనూ, ఆ తర్వాతి నెలల్లోనూ ప్రకటనా పనిలో పాల్గొనాలని ప్రచారకులందరినీ ప్రోత్సహించండి.

18 నిమి: “కూటాలకు హాజరయ్యేందుకు ఇతరులకు సహాయం చేయండి.”b జూన్‌ 1996 మన రాజ్య పరిచర్య ఇన్‌సర్ట్‌లోని 14-16 పేరాలు, బైబిలు విద్యార్థులను సంస్థవైపుకు నడిపేందుకు అదనపు సూచనలను ఇస్తున్నాయి. కూటాలకు హాజరవ్వమని ప్రోత్సహించేందుకు, దేవుడు కోరుతున్నాడు బ్రోషూర్‌నూ (5వ పాఠం, 7వ పేరా), జ్ఞానము పుస్తకాన్నీ (5వ అధ్యాయం, 22వ పేరా) మొదట్లోనే ఎలా ఉపయోగించవచ్చో చూపించండి. దీన్ని సోదాహరణంగా చూపేందుకు, కూటాలకు హాజరవ్వడాన్ని గురించి గంభీరంగా ఆలోచించమని సామర్థ్యంగల ఒక ప్రచారకుడు బైబిలు విద్యార్థిని ఆప్యాయంగా ప్రోత్సహించడాన్ని చూపించేటువంటి చక్కగా సిద్ధపడిన ప్రదర్శనను చేర్చండి.

పాట 11 (85), ముగింపు ప్రార్థన.

[అధస్సూచీలు]

a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషంకన్నా తక్కువకు పరిమితంచేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషంకన్నా తక్కువకు పరిమితంచేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి