కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/00 పేజీ 2
  • సేవా కూటాల పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2000
  • ఉపశీర్షికలు
  • నవంబరు 13తో ప్రారంభమయ్యే వారం
  • నవంబరు 20తో ప్రారంభమయ్యే వారం
  • నవంబరు 27తో ప్రారంభమయ్యే వారం
  • డిసెంబరు 4తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2000
km 11/00 పేజీ 2

సేవా కూటాల పట్టిక

నవంబరు 13తో ప్రారంభమయ్యే వారం

పాట 6 (45)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు.

13 నిమి: రాజ్య వార్త నెం. 36ను అందించడంలో ఎదురైన అనుభవాలు. రాజ్య వార్త నెం. 36ను పంచిపెట్టడంలో ఇప్పటివరకూ వారు పొందిన ప్రోత్సాహకరమైన ఫలితాలను చెప్పమని ప్రచారకులను కోరండి. ఈ ప్రచారకార్యక్రమంలో తమ ప్రకటనా పనిని విస్తృతపర్చుకున్నందుకు, అలాగే వేర్వేరు ప్రచారకులతో పనిచేసే అవకాశం కల్గినందుకు వారు ఎలా ఆనందించారో చెప్పమని క్రమ పయినీర్లను, సహాయ పయినీర్లను అడగండి.

22 నిమి: రీజనింగ్‌ పుస్తకాన్ని చక్కగా ఉపయోగించండి. 7-8 పేజీలను ప్రశ్నాజవాబులతో చర్చించండి. పరిచర్యలో మరింత ప్రభావవంతంగా పాల్గొనేలా సిద్ధపడడానికి ఈ పుస్తకాన్ని ఎలా రూపొందించారో చూపించండి. టెలిఫోన్‌ సాక్ష్యం ఇస్తున్నప్పుడు ఈ పుస్తకాన్ని ఎలా ఉపయోగించవచ్చో వివరించండి. ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సహాయకరమైన సమాచారాన్ని ఎలా కనుగొనవచ్చో చూపండి. ఈ పుస్తకంతో పరిచయం కల్గి ఉండమని, వాళ్ళ సాక్ష్యపు బ్యాగ్‌లో దీనిని ఉంచుకోమని, క్రమంగా ఉపయోగించమని అందర్నీ కోరండి.

పాట 5 (46) ముగింపు ప్రార్థన.

నవంబరు 20తో ప్రారంభమయ్యే వారం

పాట 8 (53)

12 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్‌ రిపోర్టు. మీ ప్రాంతంలో ఎంతమేరకు పనిపూర్తి చేయబడిందో, నవంబరు 30లోగా ఆ ప్రాంతం పూర్తి చేయడానికి ఏమి అవసరమో క్లుప్తంగా తెలపండి.

13 నిమి: ప్రశ్నా భాగం. ఒక పెద్ద ఇచ్చే ప్రసంగం.

20 నిమి: “ప్రకటిస్తూనే ఉండండి!” ప్రసంగం మరియు ఇంటర్వ్యూ. కొంతమంది తమ జీవిత కాలమంతా యెహోవా సంస్థతో సహవసించారు, ప్రకటనా పనిని పట్టుదలతో చేశారు. అనుకూల దృక్పథంతో వారలా చేయడం వల్ల ఆనందాన్ని కనుగొన్నారు. (జ్ఞానము పుస్తకం 179వ పేజీలోని 20వ పేరా; కావలికోట, ఆగస్టు 1, 1992, 20-1 పేజీల్లోని 14-15 పేరాలు.) చాలా ఏళ్ళ నుంచి పరిచర్యలో చురుకుగా పాల్గొంటున్న ఒక ప్రచారకుడ్ని ఆహ్వానించి, పరిచర్యలో పట్టుదల కలిగి ఉండడానికి గల కారణాలను చెప్పమనండి.

పాట 17 (187) ముగింపు ప్రార్థన.

నవంబరు 27తో ప్రారంభమయ్యే వారం

పాట 2 (15)

10 నిమి: స్థానిక ప్రకటనలు. నవంబరు నెల సేవా రిపోర్టులను ఇవ్వమని అందరికీ గుర్తుచేయండి. డిసెంబరులో సాహిత్య ప్రతిపాదనలు న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌తో పాటు జ్ఞానము పుస్తకం. బైబిలును అనేక భాషల్లో ఉత్పత్తి చేయడంలో యెహోవాసాక్షులు ఒక ప్రముఖ పాత్రను ఎలా వహించారో వివరించండి.​—కావలికోట, అక్టోబరు 15, 1997, 11-12 పేజీలు చూడండి.

20 నిమి: “రాజ్య వార్త నెం. 36పై ఏర్పడిన ఆసక్తిని పెంపొందించడం.” 1-5 పేరాలను ప్రశ్నాజవాబులతో చర్చించండి. ఇప్పటి వరకు పూర్తిచేయని ప్రాంతంలో పని చేయడం కోసం చేసిన స్థానిక ఏర్పాట్లను వివరించండి. పునర్దర్శనాల కోసమై 7, 8 పేరాల్లో ఇచ్చిన అందింపులను ఒక్కొక్కదాన్ని ప్రదర్శించి చూపండి. ఆసక్తిని చూపించిన ప్రతి చోట బైబిలు పఠనాలను ప్రారంభించడానికి తీవ్రంగా ప్రయత్నించే ప్రాముఖ్యతను నొక్కి చెప్పండి. 9వ పేరాను, ఉల్లేఖించబడిన లేఖనాలను చర్చించడంతో ముగించండి.

15 నిమి: టీవీ చూసే అలవాటును నేను ఎలా అదుపు చేసుకోగలను? టీవీ చూడడానికి, ప్రతి రోజు గంటలకొద్దీ సమయాన్ని వెచ్చిస్తున్న ఒక యౌవన సహోదరుడితో ఒక పెద్ద మాట్లాడతాడు. ఆ యౌవనుడు అలా చూడడంలో ఏమీ హానిలేదని ప్రారంభంలో తనను తాను సమర్థించుకుంటాడు. అది కేవలం కాలక్షేపం కోసమే, కనుక దాని ప్రతికూల ప్రభావం తన మీద పడదని అంటాడు. యువత ఇలా అడుగుతోంది (ఆంగ్లం) పుస్తకం 36వ అధ్యాయంలో ఉన్న ముఖ్య విషయాలను పెద్ద వివరిస్తాడు. టీవీ ఎక్కువగా చూడడంలో వ్యక్తిగత పఠనం చేయడానికి, పరిచర్యకు వెళ్ళడానికి, లేక సంఘపు పనుల్లో సహాయం చేయడానికి ఉపయోగించగల అమూల్యమైన సమయం పోతుందని ఆయన వివరిస్తాడు. ఆయన ఇచ్చిన సలహాకు మెప్పుదల చూపిస్తూ తన ఆధ్యాత్మిక ప్రయోజనార్థమై టీవీ చూసే అలవాట్లను మార్చుకుంటానని ఆ యౌవన సహోదరుడు చెబుతాడు.

పాట 22 (130) ముగింపు ప్రార్థన.

డిసెంబరు 4తో ప్రారంభమయ్యే వారం

పాట 4 (43)

10 నిమి: స్థానిక ప్రకటనలు. “ఆన్సరింగ్‌ మెషీన్‌కు మీరు ఏమి చెబుతారు?”

15 నిమి: రాజ్య వార్త నెం. 36ను అందిస్తున్నప్పుడు ఎదురైన అనుభవాలు. ప్రాంతాన్ని పూర్తిచేయడంలో కల్గిన ఫలితాన్ని తెల్పండి. సంఘంలోని వారెవరైనా మొట్టమొదటి సారిగా సేవలో పాల్గొన్నారా? గృహస్థులు చేసిన అనుకూల వ్యాఖ్యానాలను చెప్పండి. ప్రచారకులెవరైనా బైబిలు పఠనాలను ప్రారంభించగల్గారా? ప్రారంభిస్తే, ఎలా ప్రారంభించగల్గారో వివరించమనండి లేక ప్రదర్శించి చూపమనండి. ఆసక్తి చూపిన వారి ఆసక్తిని ఇంకా పెంపొందించమని అందరికి గుర్తుచేయండి.

20 నిమి: “సమయోచితముగా పలుకబడిన మాట.” ప్రేక్షకులతో చర్చ మరియు ప్రదర్శనలు. చర్చలను ప్రారంభించే సామర్థ్యం లేదని చాలామంది భావిస్తారు, ఫలితాలు సాధించాలంటే ప్రత్యేకమైన సామర్థ్యం అవసరమని వారు తప్పుగా భావిస్తారు. క్రొత్త, యౌవన ప్రచారకులతో సహా మనమంతా కాస్తంత ప్రయత్నంతో చర్చలను ఎలా ప్రారంభించవచ్చో వివరించండి. అక్కడ ఇవ్వబడిన అందింపులను వివరిస్తూ వాటికున్న సరళతను ఉన్నతపరుస్తూ వాటిని ఇద్దరూ లేక ముగ్గురు ప్రచారకులను ప్రదర్శించమనండి. ఉపయోగించగల ఇతర అందింపుల కోసం మార్చి 1998 మన రాజ్య పరిచర్య, 8వ పేజీ చూడండి. పరిచర్యలో ఎక్కువ సంతోషాన్ని పొందడానికి, అనుకూల ధృక్పథాన్ని కలిగి ఉండమని అందరినీ కోరండి.

పాట 29 (222) ముగింపు ప్రార్థన.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి