ఆన్సరింగ్ మెషీన్‌కు మీరు ఏమి చెబుతారు?
సాధారణంగా ఇంట్లో దొరకని వ్యక్తులకు లేదా ప్రవేశించడానికి వీలుకాని ప్రాంతాల్లో నివసిస్తున్న వ్యక్తులకు సాక్ష్యం ఇవ్వడానికి టెలిఫోన్ ఒక ప్రభావవంతమైన ఉపకరణం. అయితే, అనేక సందర్భాల్లో మనం ఫోన్ చేసినప్పుడు మనిషి స్వరం వినిపించదు, బదులుగా ఆన్సరింగ్ మెషీన్లో నుండి రికార్డు చేయబడిన ఒక స్వరం వినిపిస్తుంది. మీరు ఫోన్ చేసినప్పుడు మీకీ అనుభవం ఎదురైతే ఏమి చేయవచ్చు? ఫోన్ పెట్టేయకండి. బదులుగా, చక్కని మాటల్ని వ్రాసివుంచుకుని ఆ మాటల్ని ఫోన్లో చదవండి. ఆహ్లాదభరితంగా ఉండేలా, ఒక వ్యక్తితో సంభాషిస్తున్నట్లే అనిపించేలా బాగా అభ్యాసం చేయండి. మీరేం చెప్పగలరు?
రాజ్యమందిరంలో ఇవ్వబడే బహిరంగ ప్రసంగానికి మీరు హృదయపూర్వక ఆహ్వానాన్ని అందించవచ్చు. మీరిలా చెప్పవచ్చు: “క్షమించండి నేను మిమ్మల్ని మీ ఇంట్లో కలవలేకపోయాను. మీరు, [బహిరంగ ప్రసంగపు శీర్షిక పేరు చెప్పి] అనే అంశంపై బైబిలు ఆధారిత చర్చను వినాలనుకుంటే దయచేసి యెహోవాసాక్షుల రాజ్యమందిరానికి రండి. దీనికి ప్రజల్నందర్నీ ఆహ్వానిస్తున్నాము. దీనికి చందాలు ఏమాత్రం సేకరించబడవు.” తర్వాత స్పష్టంగా కూటాలు జరిగే రోజును, సమయాన్ని చెప్పండి, వీధి పేరును లేదా రాజ్యమందిరం ఉన్న స్థలాన్ని వివరించి చెప్పండి.
కూటాలకు ఎవరైనా క్రొత్తవారు హాజరైతే వారిపట్ల శ్రద్ధ కలిగి ఉండండి, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుని, వారిని హృదయపూర్వకంగా ఆహ్వానించండి. ఉచిత గృహ బైబిలు పఠనాన్ని గురించి వారికి చెప్పడం మర్చిపోకండి!