సేవా కూటాల పట్టిక
ఆగస్టు 14తో ప్రారంభమయ్యేవారం
పాట 23 (200)
12 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుంచి ఎంపిక చేసిన ప్రకటనలు. మే నెల క్షేత్ర సేవా రిపోర్టును సంఘంలో వివరించండి. ఆగస్టులో ఇంకా రెండు వారాంతాలే మిగిలివున్నాయి గనుక, నెలాంతానికి ముందే పరిచర్యలో భాగం వహించమని ప్రతీ ఒక్కరినీ ప్రోత్సహించండి. వారాంతంలోని క్షేత్ర సేవ కొరకైన కూటముల పట్టికను పరిశీలించండి.
15 నిమి: “విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము.” ఉపోద్ఘాతాన్ని నిమిషం లోపుకు పరిమితం చేసి ప్రశ్నా-జవాబుల చర్చను చేయండి. సంఘ పుస్తక పఠన నిర్వాహకులు వారి వారి గుంపుల కోసం క్షేత్ర సేవా కార్యకలాపాల్ని ఎలా ఏర్పాటు చేస్తారు, పరిచర్యలో ప్రతి వ్యక్తి భాగం వహించేలా, పరిచర్యా రిపోర్టును వాళ్ళు క్రమంగా ఇచ్చేలా వ్యక్తిగత సహాయాన్ని ఎలా అందిస్తారు అన్న విషయమై అదనపు వివరణ కోసం మన పరిచర్య పుస్తకం 44-5 పేజీల్లో ఉన్న సమాచారాన్ని చూడండి.
18 నిమి: స్కూలుకు వెళ్ళడం ద్వారా మీరెలా ప్రయోజనం పొందగలరు. లౌకిక విద్య ఎందుకు ప్రయోజనకరమో వారు గుర్తించేలా సహాయం చేయడానికి ఒక తండ్రి తన పిల్లలతో మాట్లాడతాడు. (యువత ఇలా అడుగుతోంది [ఆంగ్లం] అనే పుస్తకంలోని 133-9 పేజీలను చూడండి.) నేటి క్రమశిక్షణా రాహిత్యమైన సమాజంలో స్కూలుకు వెళ్ళడం గొప్ప సవాలుతో కూడుకున్నదని చాలామంది యౌవనస్థులు భావిస్తారు. స్కూల్లో తాము నేర్చుకునే విషయాలు నిజ జీవితంలో ఎందుకూ పనికిరావనీ శుద్ధ దండగనీ భావించి కూడా వాళ్ళు విసుగు చెందుతారు. తగినంత మోతాదులో లౌకిక విద్యను పొందటం ఎందుకు జ్ఞానయుక్తమో వివరిస్తూ తండ్రి లేఖన సూత్రాలనూ, సరైన కారణాలనూ చర్చిస్తాడు. స్కూల్లో బాగా చదవమనీ, పాఠాలు జరుగుతున్నప్పుడు శ్రద్ధగా అవధానమివ్వమనీ ఆయన ప్రోత్సహిస్తాడు.
పాట 15 (127) ముగింపు ప్రార్థన.
ఆగస్టు 21తో ప్రారంభమయ్యేవారం.
పాట 16 (143)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్ రిపోర్ట్. “ప్రేమామయుడైన దేవుడు బాధల్ని ఇంతకాలం వరకూ ఎందుకు అనుమతించాడు” అన్న ప్రశ్నకు ఎలా జవాబు చెప్పాలో చూపుతూ ప్రతిభావంతంగా పరిచర్య చేస్తున్నట్లుండే చక్కగా అభ్యాసం చేసిన ప్రదర్శనను ఇవ్వండి. (రీజనింగ్ పుస్తకం, 395-6 పేజీలు) ఈ వారాంతపు పరిచర్యలో ప్రతి ఒక్కరూ భాగం వహించేలా ప్రోత్సహించండి.
10 నిమి: సేవాధ్యక్షుడు ఇచ్చే ప్రసంగం. “మన సాహిత్యాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించండి” డిసెంబరు 1999 మన రాజ్య పరిచర్య 3వ పేజీలో ఉన్న ముఖ్య విషయాలను ఉన్నతపర్చండి. సాహిత్యాన్ని అందించేటప్పుడు దానిని తగిన వ్యక్తులకు అందించగలిగేలా విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగించమని ప్రచారకులను ప్రోత్సహించండి.
25 నిమి: “మీరు ప్రయోజనం పొందుతున్నారా?” ప్రశ్నా-జవాబులు.
పాట 6 (45) ముగింపు ప్రార్థన.
ఆగస్టు 28తో ప్రారంభమయ్యేవారం
పాట 20 (93)
10 నిమి: స్థానిక ప్రకటనలు. ఆగస్టు నెలలోని క్షేత్ర సేవా రిపోర్టులను ఇవ్వమని అందరికీ గుర్తు చేయండి. సెప్టెంబరు 6వ తారీఖుకల్లా రిపోర్టులన్నీ సరిచూడ గల్గేలా సంఘ పుస్తక పఠన నిర్వాహకులు తమ గ్రూపులో ఉన్న ప్రతీ ఒక్కరూ తమ తమ రిపోర్టులు ఇచ్చారో లేదో చూడాలి.
15 నిమి: స్థానిక అవసరాలు.
20 నిమి: “కూటాలు యౌవనులకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి.” పెద్ద ద్వారా నిర్వహించబడే ప్రశ్నా-జవాబుల చర్చ. 8వ పేరాను చర్చిస్తున్నప్పుడు, కూటాలు జరుగుతున్న సమయంలో ఏకాగ్రతను నిలపడానికీ, ఎక్కువ అవధానాన్ని ఇవ్వడానికీ తోడ్పడే ఆచరణాత్మకమైన కొన్ని విషయాలను తెల్పండి. (అక్టోబరు 8, 1998, తేజరిల్లు !లోని 20-21 పేజీలను చూడండి.) తమ పిల్లలు క్రమంగా అన్ని కూటాలకూ తప్పకుండా హాజరయ్యేలా చూడమని తల్లిదండ్రులను ప్రోత్సహించండి.—సెప్టెంబరు 1, 1997 కావలికోట, 25వ పేజీలోని అనుభవాన్ని చూడండి.
పాట 8 (53) ముగింపు ప్రార్థన.
సెప్టెంబరు 4తో ప్రారంభమయ్యేవారం
పాట 9 (37)
15 నిమి: స్థానిక ప్రకటనలు. ప్రశ్నా భాగం. అనియత సాక్ష్యము ఇస్తున్నప్పుడు ఎదురైన అనుభవాలను చెప్పమని ప్రచారకులను కోరండి. మన పరిచర్య పుస్తకంలోని 93-4 పేజీలను ఉపయోగించి, మన పరిచర్యలోని ఈ రంగంలో భాగం వహించడంలోని ప్రయోజనాలను తెల్పండి.
10 నిమి: మన కాలం ఎంతో విశిష్టమైనది. నవంబరు 15, 1996 కావలికోటలోని 22-3 పేజీలకు ఆధారంగా ఒక పెద్ద ఇచ్చే ప్రసంగం.
20 నిమి: “మీరు సహిస్తున్నారా?” ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. క్రైస్తవ పరిచర్యలో సహనాన్ని కనబరుస్తూ కొనసాగే విషయంలో తామెంత విజయాన్ని సాధించారో ఒక్కసారి ఆలోచించమని చెప్పండి. ఒకవేళ సహించలేకపోతున్నాం అనిపిస్తే ఆధ్యాత్మికంగా మనలను మనం బలపరుచుకోవలసిన అవసరత ఉందన్నమాట. అక్టోబరు 1, 1999 కావలికోటలోని 20-21 పేజీల్లోని 17-21 పేరాల్లోవున్న విషయాలను చేర్చండి. సహనాన్ని కనబరుస్తూ ఉండడంలో పట్టుదలతో కొనసాగేందుకు ఏమి చేస్తున్నారో చెప్పమని అనేక సంవత్సరాలుగా పరిచర్యలో నమ్మకంగానూ సహనంతోనూ కొనసాగుతున్న ఇద్దరు లేక ముగ్గురు ప్రచారకులను ఆహ్వానించండి.
పాట 6 (45) ముగింపు ప్రార్థన.