కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 8/00 పేజీ 1
  • మీరు సహిస్తున్నారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు సహిస్తున్నారా?
  • మన రాజ్య పరిచర్య—2000
  • ఇలాంటి మరితర సమాచారం
  • సహనము—క్రైస్తవులకు ఆవశ్యకము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ‘సహనం తన పనిని పూర్తి చేయనివ్వండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • యెహోవా సంస్థను అంటిపెట్టుకుని ఉండండి
    యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
  • యెహోవాలా సహనం చూపించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2000
km 8/00 పేజీ 1

మీరు సహిస్తున్నారా?

1 ‘నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారన్న దానికన్నా నాకు ఎక్కువైన సంతోషము లేదు.’ (3 యోహాను 4) యోహాను ఆధ్యాత్మిక పిల్లల సహనము అతనికి గొప్ప ఆనందాన్ని కలిగించింది. తనకు పిల్లలు కాబోయే లక్షలాదిమంది ‘సత్యాన్ని అనుసరించి నడవడాన్ని’ చూడడం మన పరలోక తండ్రికి ఎంతటి ఆనందాన్ని తీసుకువస్తుందో కదా!—సామె. 23:15, 16; 27:11.

2 దేవుని ప్రజలు ఒక గుంపుగా క్రైస్తవ పనిని పట్టుదలతో కొనసాగిస్తూ ఉండగా కొంతమంది క్రమంగా వెనుకబడిపోయారు. వాళ్ళు మొదట్లో సత్యం తెలుసుకొనేటప్పుడు బహుశా ఆసక్తిగానే ఉన్నప్పటికీ సంవత్సరాలు గడుస్తుండగా వాళ్లు శిష్యులను చేసే పనిలో అప్పుడప్పుడూ, అదీ చాలా తక్కువగా భాగం వహించసాగారు.

3 భౌతిక పరిమితులవల్ల, పెరుగుతున్న వయసుతోపాటు పెరిగే సమస్యల వల్ల కొందరు వెనుకబడిపోవడం అర్థం చేసుకొనతగినదే. ఏమైనప్పటికీ వాళ్ళ సహనాన్ని బట్టి వాళ్లను ప్రశంసించాలి. వారు ఏమి చేయగలరో అది చేస్తున్నారు. కాని దేవునికి తమ జీవితాన్ని సమర్పించుకున్న ప్రతి ఒక్కరూ, ‘నా జీవితంలో రాజ్యాసక్తులు తక్కువ స్థానం వహించేలా భౌతిక లక్ష్యాలపై దృష్టిని కేంద్రీకరించేందుకు నేను అనుమతిస్తున్నానా? నేను “నులివెచ్చనగా” అయిపోయానా లేదా నాకై నేను ఇంకా తీవ్రంగా ‘పోరాడుతున్నానా’?’ అని తమను తాము ప్రశ్నించుకోవాలి. (ప్రక. 3:15, 16; లూకా 13:24) “సత్‌క్రియ చేయు ప్రతివానికి . . . మహిమయు ఘనతయు సమాధానమును కలుగును” అని యెహోవా వాగ్దానము చేస్తున్నాడని మనస్సులో ఉంచుకొని మనమేమి చేస్తున్నామో చూసుకొని ప్రార్థనాపూర్వకంగా అవసరమైన విధంగా మెరుగుపర్చుకోవాలి.—రోమా. 2:10.

4 ఎలా సహించాలి: సహించేందుకు యేసుకు సహాయపడినదేమిటి? “ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైయున్నాడు” అని పౌలు వివరించాడు. (హెబ్రీ. 12:1-3) యేసు ఎదుర్కోవలసి వచ్చిన తాత్కాలిక శ్రమల కంటే ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము ఎంతో విలువైనది. మన ఎదుట ఉంచబడిన ఆనందమును మనస్సులో ఉంచుకోవడం మనం కూడా సహించేందుకు సహాయపడుతుంది. (ప్రక. 21:4, 7; 22:12) వ్యక్తిగత బైబిలు పఠనం ద్వారా, కూటాలకు క్రమంగా హాజరవడం ద్వారా, పట్టుదలతో ప్రార్థించడం ద్వారా యెహోవా మనకిచ్చే బలం కోసం మనం ఆయన వైపు చూస్తే, మనకు ఆయనిచ్చిన పనిలో మనం పట్టుదలతో కొనసాగగల్గుతాము.

5 తన యథార్థవంతుల సహనాన్ని బట్టి యెహోవా ఆనందిస్తాడు. కాబట్టి “సత్యమును అనుసరించి నడుచు”కోవడం ద్వారా మనం ఆయన ఆనందాన్ని అధికం చేద్దాం.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి