కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 8/00 పేజీ 2
  • ప్రశ్నాభాగం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రశ్నాభాగం
  • మన రాజ్య పరిచర్య—2000
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీకు వ్యక్తిగత క్షేత్రం ఉందా?
    మన రాజ్య పరిచర్య—2006
  • వ్యక్తిగత క్షేత్రం తీసుకోగలరేమో ఆలోచించండి
    మన రాజ్య పరిచర్య—2013
  • వ్యాపార క్షేత్రంలో ప్రకటించే విధానం
    మన రాజ్య పరిచర్య—2004
  • మీ అవసరాలను తీర్చే పటములు
    తేజరిల్లు!—1995
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2000
km 8/00 పేజీ 2

ప్రశ్నాభాగం

◼ సంఘానికి సంబంధించిన మాస్టర్‌ టెరిటరీ మ్యాపును రాజ్యమందిరంలో కనపడేటట్లు ఉంచాలా?

అవును, మాస్టర్‌ టెరిటరీ మ్యాపును ఫ్రేము కట్టించి రాజ్యమందిరంలో గోడకు తగిలించాలి. ఆ మ్యాపును ఇన్ఫర్మేషన్‌ బోర్డు మీద పెట్టకూడదు. ఆ సంఘానికి నియమించబడిన ప్రాంతం సరిహద్దులు, అలాగే వ్యక్తిగతంగా కేటాయించబడిన ప్రాంతం సరిహద్దులు, వాటికి కేటాయించబడిన సంఖ్య అందులో ఉండాలి. ఒకే రాజ్యమందిరాన్ని ఉపయోగించే సంఘాలన్నిటి ప్రాంతాల సరిహద్దులను అందులో సూచించాలి. ప్రచారకులు, ఆసక్తిగల క్రొత్తవారు తాము ఏ సంఘానికి చెందిన ప్రాంతంలో నివసిస్తున్నామో నిర్ణయించుకోవడానికి ఇది సహాయం చేస్తుంది. ఆ మ్యాపు మీద సంఘ పుస్తక పఠనాలు జరిగే స్థలాలను చూపించడం, తాము ఏ పుస్తక పఠనానికి నియమించబడ్డారో తెలుసుకునేందుకు కూడా సహాయపడుతుంది. ఎప్పటికప్పుడు ఆ మ్యాపును మార్పులకు తగిన విధంగా సరిచేస్తూ ఉండాలి.

అలా ఆ మ్యాపును గోడపై తగిలించి పెట్టడం, ప్రచారకులు తమకు సాధ్యమైతే ఒక వ్యక్తిగత ప్రాంతాన్ని కల్గి ఉండడం మంచిది అని గుర్తు చేస్తూ ఉంటుంది. తమ ఇంటికి దగ్గరగా ఉన్న ప్రాంతాన్ని పరిచర్య కోసం తీసుకోవాలని ఆశిస్తున్నవారికి ఆ మ్యాపు సహాయకరంగా ఉంటుంది. క్షేత్రసేవ కొరకైన కూటాల్లో అది కొన్నిసార్లు సమయాన్ని ఆదా చేసేదిగా ఉండి, ప్రచారకులు తాము ఎక్కడైతే పని చేయడానికి నియమించబడ్డారో ఆ స్థలానికి త్వరగా వెళ్ళేలా వారిని నిర్దేశించడానికి పుస్తక పఠన నిర్వాహకునికి సహాయం చేస్తుంది.

సంఘం తనకు కేటాయించబడిన ప్రాంతంలో రాజ్య సందేశాన్ని సంపూర్ణంగా ప్రకటించేందుకు సంస్థీకరించబడిందని కూడా ఆ మ్యాపు సాక్ష్యమిస్తుంది.—లూకా 9:6.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి