కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/00 పేజీ 4
  • మీరు చాలా బిడియస్తులా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు చాలా బిడియస్తులా?
  • మన రాజ్య పరిచర్య—2000
  • ఇలాంటి మరితర సమాచారం
  • నేను మరింత కలివిడిగా ఎందుకు ఉండలేకపోతున్నాను?
    తేజరిల్లు!—1999
  • సిగ్గు, మొహమాటం ఎలా తగ్గించుకోవచ్చు?
    యువత అడిగే ప్రశ్నలు
  • నేను మరింత కలివిడిగా ఎలా ఉండగలను?
    తేజరిల్లు!—1999
  • యెహోవా మీకు శక్తిని ఇస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2000
km 7/00 పేజీ 4

మీరు చాలా బిడియస్తులా?

1 ఒక చిన్న పాప తల్లి కొంగుచాటు నుండి తొంగిచూస్తుంది. అది చూసి ఎందుకా అని మనం ఆశ్చర్యపోతామా? లేదు, సిగ్గుపడడం చిన్నతనంలో అతి సహజం. కొందరైతే పెద్దయ్యాక కూడా స్వభావరీత్యా కాస్త సిగ్గుపడుతుంటారు. అయితే, పరిచర్యలో పాల్గొనడానికి మీకు సిగ్గు అడ్డం వస్తుంటే మీరేం చేయగలరు?

2 సిగ్గును ఎదుర్కోవడం: ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు “మీ హృదయపు అంతరంగ స్వభావము” పట్ల శ్రద్ధనివ్వడమే. (1 పేతు. 3:4) అంతేగాక, యెహోవా పట్లా మీ పొరుగువారి పట్లా మీ ప్రేమను పటిష్ఠపర్చుకోండి. ఇంకా, త్యాగపూరితమైన ప్రేమను ప్రదర్శించే అతి శ్రేష్ఠమైన మార్గం, ప్రకటనా పనిని నెరవేర్చడమేనని దృఢ నిశ్చయంతో ఉండండి. వ్యక్తిగత పఠనం క్రమంగా చేయండి, కూటాలకు క్రమంతప్పక హాజరుకండి. క్రమంగా ప్రార్థన చేస్తూ, ప్రత్యేకంగా మీ సమస్య విషయమై యెహోవా సహాయం కోసం ఆయన్ను అర్థించండి. ఆయనపై బలమైన విశ్వాసమూ, నమ్మకమూ ఉంటే, మీపై మీకే నమ్మకం ఏర్పడి, “నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేషధైర్యము” మీకు కలుగుతుంది.—ఫిలి. 1:14.

3 మీలో న్యూనతా భావాలుంటే వాటిని పోగొట్టుకోవడానికి ప్రయత్నంచండి. తిమోతి కూడా ఇలా చేయాల్సివచ్చిందని అర్థమౌతోంది. పౌలు అందుకనే, “నీ యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము” అని తిమోతిని ప్రోత్సహిస్తూ, ‘దేవుడు మనకు శక్తిగల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మ నియ్యలేదు’ అని గుర్తుచేశాడు. (1 తిమో. 4:11, 12; 2 తిమో. 1:7) యెహోవా తిమోతిని ఎంతో గొప్పగా ఉపయోగించుకున్నాడు, మీరు ఆయనపై పూర్తి నమ్మకాన్ని ఉంచి ముందుకు సాగితే ఆయన మిమ్మల్ని కూడా ఉపయోగించుకుంటాడు.—కీర్త. 56:11.

4 బిడియస్థురాలైన ఒక సహోదరి, తనను వ్యతిరేకిస్తున్న తన భర్తకు భయపడేది. అప్పుడు, మత్తయి 10:37 వంటి బైబిలు లేఖనాలను ధ్యానించడం ద్వారా ఆమె సహాయాన్ని పొందింది. ఆమె పట్టుదలతో అలాగే కొనసాగినప్పుడు, పరిచర్యలో పాల్గొనడం ఆమెకు మరింత సుళువుగా మారింది, చివరికి ఆమె భర్త, తల్లి, సహోదరులు అందరూ సత్యాన్ని స్వీకరించారు!

5 సిద్ధపాటు చాలా ప్రాముఖ్యం: మీరు పరిచర్యకు సంపూర్ణంగా సిద్ధపడితే మీ నమ్మకం మరింత పెరుగుతుంది. బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను అనే పుస్తకంలో నుండి లేదా మన రాజ్య పరిచర్య యొక్క గత సంచికల్లో నుండి మీరొక సరళమైన అందింపును ఎంపిక చేసుకుని, దాన్ని మీ మనస్సులో బాగా ముద్రించుకుని, దాన్ని మళ్ళీ మళ్ళీ అభ్యాసం చేయండి. అనవసరమైన చింతను పెంచుకుంటూ పోవడానికి బదులుగా, చేయగలనన్న నమ్మకాన్ని కలుగజేసుకోండి. ఇతరులతో కలిసి పనిచేయడం ద్వారా ధైర్యాన్ని కూడగట్టుకోండి. ఇంటింటి పరిచర్యలో మీరు కలిసే వ్యక్తుల్లో కూడా మీలానే చాలామంది బిడియస్థులుంటారని గుర్తుంచుకోండి. మనం రాజ్య సందేశం ప్రతి ఒక్కరికి ప్రకటించాలి.

6 మీరు సిగ్గుపడే వ్యక్తైతే క్రుంగిపోకండి. ఈ మార్గాల్ని మీరు స్వయంగా అన్వయించుకుంటూ ఉండగా, సువార్తను ప్రభావవంతంగా ప్రకటించేలా యెహోవా మీకు సహాయం చేస్తాడు. అప్పుడు మీ పరిచర్యలో మీకు ఆనందం లభిస్తుంది.—సామె. 10:22.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి