సేవా కూటాల పట్టిక
మే 8తో ప్రారంభమయ్యే వారం
పాట 125 (9)
8 నిమి: స్థానిక ప్రకటనలు మన రాజ్య పరిచర్య నుంచి ఎంపిక చేసిన ప్రకటనలు.
17 నిమి: మే నెలలో ఆత్మ యందు తీవ్రతగల వారై ఉండండి. సేవాధ్యక్షుడు ఇచ్చే ప్రసంగం, నిర్వహించే ఇంటర్వ్యూలు. ఏప్రిల్ నెలలో సంఘం సేవలో చేసిన కృషిని ఉన్నతపర్చండి. సహాయ పయినీరింగ్ చేసిన లేదా పరిచర్యలో ఎక్కువగా పాల్గొన్న ఇద్దరు ప్రచారకులను ఇంటర్వ్యూ చేయండి. వాళ్ళు ఎలాంటి ఆశీర్వాదాలను అనుభవించారు? సంఘం ఆసక్తితో చేసిన ఈ కార్యకలాపాన్ని మళ్ళీ మే నెలలో అదేవిధంగా చేయవచ్చా? పరిచర్యలోని వివిధ అంశాలలో పాల్గొనమని అందరినీ ప్రోత్సహించండి. ఈ నెలలో సెలవులను ఆనందిస్తున్న యౌవనస్థులైన ప్రచారకులను పరిచర్యలో ఎక్కువగా భాగంవహించమని పురికొల్పండి. ఈ నెల మన సంఘంలో క్రమరాహిత్యాన్ని నిర్మూలించగలమా? క్రమంగారాని వారి సహాయార్థం చేయబడిన ఏర్పాట్లను పేర్కొనండి. జ్ఞాపకార్థదినానికి హాజరైన వారందరి ఆసక్తిని పునరుద్ధీపనం చేయవచ్చా? వారి ఆధ్యాత్మిక సంక్షేమం పట్ల ఆసక్తిని కనుపర్చి, బైబిలు పఠనం చేయడాన్ని గురించి చెప్పండి. సహోదరులకున్న ఆసక్తిని ఉత్సాహాన్ని బట్టి వారిని ప్రశంసించండి.
20 నిమి: “దేవుని వాక్యప్రకారం ప్రవర్తించేవారు” యెహోవాసాక్షుల జిల్లా సమావేశం. ఇన్‌సర్ట్‌లోని శీర్షికను కార్యదర్శి ప్రశ్నాజవాబులతో నిర్వహిస్తాడు. మనమందరం సంస్థ నిర్దేశాలను సన్నిహితంగా ఎందుకు పాటించాలో తెలియజేసేందుకు, ఉదహృత లేఖనాలను ఉపయోగించండి. శుక్రవారంతోసహా సమావేశపు మూడు రోజులూ హాజరవడానికి అవసరమైన తేదీల్లో సెలవు తీసుకోవలసిన ప్రాముఖ్యాన్ని నొక్కి తెల్పండి. సంస్థ చేసే ఏర్పాట్లకు సహకరిస్తున్నందుకు సహోదరులను మెచ్చుకోండి.
పాట 201 (8) ముగింపు ప్రార్థన.
మే 15తో ప్రారంభమయ్యే వారం
పాట 134 (28)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్ రిపోర్టు.
20 నిమి: “టెలిఫోన్ సాక్ష్యం—అనేకమందిని కలుసుకొనేందుకు ఒక మార్గం.” ఇన్‌సర్ట్‌లోని మొదటి 13 పేరాలను ప్రశ్నాజవాబులతో నిర్వహించాలి. ఉన్న సమయాన్ని బట్టి, కొన్ని పేరాలను ఎంపిక చేసి చదవండి. 12, 13 పేరాల్లో పేర్కొనబడిన సిద్ధపాటు చర్యలను ప్రదర్శించండి. మిగిలిన ఏడు పేరాలను తర్వాతి వారం కోసం సిద్ధపడి, బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను అనే బుక్‌లెట్‌ను తెచ్చుకొమ్మని సంఘానికి గుర్తు చేయండి.
15 నిమి: “మిమ్మల్ని మీరు ఎలా దృష్టించుకుంటారు?” జనవరి 15, 2000 కావలికోట, 20-22 పేజీల ఆధారంగా పెద్ద ఇచ్చే ప్రసంగం.
పాట 203 (5) ముగింపు ప్రార్థన.
మే 22తో ప్రారంభమయ్యే వారం
పాట 36 (23)
10 నిమి: స్థానిక ప్రకటనలు. ప్రశ్నాభాగాన్ని పరిశీలించండి.
15 నిమి: “మెలకువగా ఉండండి.” ప్రశ్నాజవాబుల చర్చ. మనకు ఆ దినము, ఆ గడియ తెలియకపోయినా ఆధ్యాత్మికంగా మనం మెలకువగా ఉండటం ఎందుకు అత్యవసరమో వివరించండి.—నవంబరు 1, 1995 కావలికోట 20వ పేజీ చూడండి.
20 నిమి: “టెలిఫోన్ సాక్ష్యం—అనేకమందిని కలుసుకొనేందుకు ఒక మార్గం.” 14-20 పేరాలను ప్రశ్నాజవాబులతో నిర్వహించాలి. ఉన్న సమయాన్ని బట్టి, కొన్ని పేరాలను ఎంపిక చేసి చదవండి. 16వ పేరాలో ప్రస్తావించబడిన బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను అనే బుక్‌లెట్‌పై వ్యాఖ్యానించమని ప్రేక్షకులను కోరండి. జూలై 1990 మన రాజ్య పరిచర్య (ఆంగ్లం) 4వ పేజీ నుండి అదనపు విషయాలను ఉన్నతపర్చండి. 16వ పేరాలో ఇవ్వబడిన మాదిరి అందింపులలో ఒకదానిని ఉపయోగించి టెలిఫోన్ సాక్ష్యం ఎలా ఇవ్వవచ్చో ప్రదర్శించి చూపండి. ఈ విధంగా సాక్ష్యాన్ని ఇవ్వడంవల్ల కలిగే గొప్ప సాధ్యతలను పరిశీలిస్తూ ఉత్సాహవంతంగా ముగించండి.
పాట 83 (17) ముగింపు ప్రార్థన.
మే 29తో ప్రారంభమయ్యే వారం
పాట 135 (6)
12 నిమి: స్థానిక ప్రకటనలు. మే నెలలోని క్షేత్రసేవ రిపోర్టులను ఇవ్వమని అందరికీ గుర్తు చేయండి. జూన్ నెల సాహిత్య ప్రతిపాదనను గూర్చి క్లుప్త అందింపును ప్రదర్శించండి. దేవుడు కోరుతున్నాడు బ్రోషూర్‌లో 13వ పాఠాన్ని ఉపయోగిస్తూ బైబిలు పఠనాన్ని ఎలా అందించాలో చూపించండి.
15 నిమి: “మీరు చేసే పవిత్ర సేవలో సంతోషాన్ని కనుగొనడం.” ప్రసంగం. మన పరిచర్యలో మనం ఆనందించటానికి గల కారణాలను చర్చించండి.—అంతర్దృష్టి, (ఆంగ్లం) సంపుటి 2, 120వ పేజీ చూడండి.
18 నిమి: ప్రతిఫలదాయకమైన బైబిలు పఠనం. పాఠశాల నిర్దేశక పుస్తకము 34-5 పేజీలు, 6, 7 పేరాల ఆధారంగా ప్రసంగం, ప్రదర్శన. దైవ పరిపాలనా పరిచర్య పాఠశాల పాఠ్యక్రమంలో ఒక భాగమైన ప్రామాణిక బైబిలు పఠన కార్యక్రమం ఆధారంగా బైబిలు ఉన్నతాంశాలు ఇవ్వబడతాయి. (డిసెంబరు 1999 మన రాజ్య పరిచర్య 7వ పేజీ) ఈ వారపు బైబిలు పఠన భాగాన్ని ఒక కుటుంబం ఎలా పరిశీలిస్తుందో ఒక కుటుంబం ప్రదర్శించి చూపాలి. వాళ్ళు ఒకటో రెండో ఆసక్తికరమైన అంశాలను ఎన్నుకొని వాచ్‌టవర్ పబ్లికేషన్స్ ఇండెక్స్‌లో గానీ లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం)లో గానీ కొంత అదనపు పరిశోధన చేస్తారు. బైబిలు చదవడం ఎలా అర్థవంతమైనది కాగలదో, ‘సత్యవాక్యమును సరిగా ఉపదేశించడానికి’ మనలను ఎలా సిద్ధపరుస్తుందో చూపించండి.—2 తిమో. 2:15.
పాట 95 (28) ముగింపు ప్రార్థన.
జూన్ 5తో ప్రారంభమయ్యే వారం
పాట 37 (9)
5 నిమి: స్థానిక ప్రకటనలు.
10 నిమి: స్థానిక అవసరాలు.
15 నిమి: “చిన్నవారికి అందుబాటులో ఉన్న ఆధిక్యత.” ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. డిసెంబరు 1, 1996, కావలికోట, 13వ పేజీ, 15వ పేరాలోని అనుభవాలను చెప్పండి. పత్రికలను అందించడంలో వాళ్ళు ఎలా ఆనందాన్ని పొందారో గుర్తు తెచ్చుకోమని యౌవనులను ఆహ్వానించండి. ఒకరిద్దరు యౌవనస్థులు ఇంటింటి పత్రికా అందింపును సరళంగా ప్రదర్శించాలి. ప్రతి వారం పత్రికా పనికి తమ పిల్లలను తమతో తీసుకువెళ్ళమని తల్లిదండ్రులను ప్రోత్సహించండి.
15 నిమి: “‘పరీక్షింపబడవలెను’—ఎలా?” పెద్ద ఇచ్చే ప్రసంగం. సంఘంలో పరిచర్య సేవకులు ఉండటాన్ని గురించిన లేఖనాధార ఏర్పాటును పరిశీలించండి. [అంతర్దృష్టి, (ఆంగ్లం) సంపుటి 2, 409వ పేజీ చూడండి.] ఆ నియామకం కోసం వాళ్లకు ఉండవలసిన అర్హతలను చూపించండి. (మన పరిచర్య పుస్తకం, 55-7 పేజీలు చూడండి.) పరిచర్య సేవకులు ఏయే విధాలుగా సేవ చేయవచ్చో తెలియజేసి, ఇంకా ఎక్కువమంది సహోదరులు ఈ ఆధిక్యతను పొందేందుకు కృషి చేయమని ప్రోత్సహించండి.
పాట 82 (10) ముగింపు ప్రార్థన.