“దేవుని వాక్యప్రకారం ప్రవర్తించేవారు” యెహోవాసాక్షుల జిల్లా సమావేశము
1 “మహాసమాజములో నేను నిన్ను స్తుతించెదను బహు జనులలో నిన్ను నుతించెదను.” (కీర్త. 35:18) నేడు మన సమావేశాల్లో దైవిక ఉపదేశాన్ని పొందేందుకు వేలాదిమంది శాంతియుతంగా సమకూడటాన్ని దావీదు చూస్తే ఎంత పులకరించిపోతాడో కదా! ఇండియాలో నవంబరు 1999 మధ్య నుండి 2000 సంవత్సరం జనవరి ప్రారంభం వరకూ, “దేవుని ప్రవచన వాక్యము” జిల్లాసమావేశాలు మొత్తం 27 జరిగాయి. ఈ సమావేశాలకు హాజరైన 30,462 మందిలో మీరూ ఒకరా? ఈ సంవత్సరాంతంలో జరిగేందుకు ఏర్పాటు చేయబడిన “దేవుని వాక్యప్రకారం ప్రవర్తించేవారు” అనే రాబోయే జిల్లా సమావేశాల్లో, “సంఘములతో ఆత్మ చెప్పుచున్నమాట” ఆనందంతోనూ ఆసక్తితోనూ ఆలకించాలని ఇష్టపడుతున్న, తమ “ఆధ్యాత్మిక అవసరాలందు శ్రద్ధగల” వారైన తోటి యెహోవా స్తుతికర్తలతో కలిసి సమావేశమయ్యే అవకాశాలు మనకు లభిస్తాయి.—ప్రక. 2:29; మత్త. 5:3, NW.
2 మీ వసతి ఏర్పాట్ల కోసం: సమావేశం జరుగుతున్న నగరంలో మీరు వసతిని ఏర్పాటు చేసుకొనేందుకు తగిన సహాయాన్ని సమాచారాన్ని అందించడానికి ప్రతి సమావేశంలో రూమింగ్ డిపార్ట్మెంటు ఉంటుంది. మీ వసతి కోసం ఏర్పాట్లు చేసుకోవడంలో ముందుగానే మంచి పథకం వేసుకోండి. మీ సంఘ కార్యదర్శి మీకు రూమ్ రిక్వెస్ట్ ఫారమ్ అందజేయగలడు. అవసరమైన సమాచారాన్ని నింపిన తర్వాత మీరు ఆ ఫారమ్‌ను మీ సంఘ కార్యదర్శికి అందజేయవచ్చు, మీరు ఎక్కడైతే హాజరు కాబోతున్నారో ఆ సమావేశ హెడ్‌క్వార్టర్స్‌కు ఆయన దాన్ని పంపిస్తారు. మీ స్వంత చిరునామా వ్రాసిన, స్టాంపులు అంటించిన ఎన్వెలప్ను దానికి జతచేయండి. మీరు ఎక్కడైతే హాజరవుతున్నారో ఆ నగరంలో ఒకటి కంటే ఎక్కువ సమావేశాలు జరుగుతుంటే మీరు హాజరవ్వబోయే తేదీలను తప్పక తెలియజేయండి.
3 వృద్ధుల గురించి, ప్రత్యేక అవసరాలున్న వారి గురించి శ్రద్ధ వహించడం: వృద్ధులకూ, రోగులకూ, ప్రత్యేక అవసరాలున్న వారికీ ఉన్న ప్రత్యేకమైన పరిస్థితుల గురించి తెలిసిన బంధువులు, పెద్దలు, సంఘంలోని ఇతరులు వాళ్ళు సమావేశానికి హాజరయ్యేందుకు సహాయం చేయడం ద్వారా ప్రేమ పూర్వకమైన శ్రద్ధను చూపించవచ్చు. (పోల్చండి 1 తిమోతి 5:4.) వారు కార్యక్రమం వల్ల పూర్తిగా ప్రయోజనం పొందగలిగేలా అనువైన స్థలంలో సౌకర్యవంతంగా కూర్చొనేలా చూడాలి. అలాంటి వారికి సహాయం చేయడానికి సహోదర సహోదరీలు ఇష్టపూర్వకంగా ముందుకు వస్తే ఎంత బావుంటుంది. భోంచేయడానికి సహాయం చేయడం, తాగడానికి నీళ్ళు తెచ్చివ్వడం, టాయ్‌లెట్‌కు వెళ్ళేటప్పుడు వారికి తోడు వెళ్ళడం వంటివి అందులో ఇమిడివుండవచ్చు. పెద్ద వయస్సువారి గురించి, ప్రత్యేక అవసరాలున్న వారి గురించి శ్రద్ధ వహించే ఆధిక్యతలో అనేకులు పాల్గొనడం ద్వారా, అలాంటి వారి బంధువులు, సాధారణంగా వారి గురించి ఎల్లవేళలా శ్రద్ధ తీసుకొనేవారితో సహా అందరూ కార్యక్రమం నుంచి ప్రయోజనం పొందవచ్చు.
4 మూడు రోజులూ హాజరయ్యేలా ఏర్పాటు చేసుకోండి: మీరు ఆధ్యాత్మిక విషయాలకు అవధానమివ్వకుండా పరధ్యానాన్ని కలుగజేయాలని సాతాను ప్రయత్నించాడా? విచారకరంగా, చాలామంది సహోదర సహోదరీలు వారి కుటుంబాలు, ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని పొందలేకపోతున్నారు. ఎలా? జిల్లా సమావేశాల్లోని శుక్రవారం రోజున కార్యక్రమానికి హాజరు కాకపోవడం మూలంగా. మన సహోదరుల్లో అధిక శాతంమంది శుక్రవారం కార్యక్రమాలు అందించే ఆధ్యాత్మిక ఉపదేశాన్నీ, సహవాసాన్ని పొందడం లేదని కొన్ని సందర్భాల్లో గమనించడం జరిగింది.
5 కొంతమంది సహోదరులు సమావేశానికి హాజరవ్వడానికి వారి యజమాని దగ్గరకు వెళ్ళి సెలవు అడగడానికి వెనకాడవచ్చు. మీ పరిస్థితి కూడా అదేనా? విషయాన్ని గూర్చి యెహోవాకు ప్రార్థించి, మీ యజమానితో మీ పరిస్థితిని గురించి వివరించడానికి ఎందుకు ధైర్యాన్ని కూడగట్టుకోకూడదు? అదే పరిస్థితిలో ఉన్న నెహెమ్యాకు వచ్చిన మంచి ఫలితాన్ని గుర్తుంచుకోండి. (నెహె. 2:1-6) రాజ్యాసక్తులకు ప్రథమస్థానాన్నిస్తే, ఆయన మన జీవితావసరాలను తీరుస్తాడు అని తెలుసుకొని, మనకు సహాయం చేయాలని మన పరలోక తండ్రికున్న సుముఖతపై విశ్వాసముంచండి.—మత్త. 6:32బి, 33.
6 మన సమావేశాలు మీపై ఎలా ప్రభావం చూపిస్తున్నాయి? తూర్పు అమెరికా నుండి ఒక సహోదరి, “1999 జిల్లా సమావేశాన్ని బట్టి చాలా కృతజ్ఞతలు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే నేను చూసే సహోదరులతో కలిసి సహవసించడం నాకు చాలా ఆనందాన్ని తీసుకువస్తుంది. టీనేజ్‌లో ఉండి గర్భవతిగా ఉన్నప్పుడు నేను సత్యాన్ని గూర్చి తెలుసుకున్నాను, నాకు బైబిలు పఠనాన్ని నిర్వహించిన వ్యక్తి నన్ను మొదటి సమావేశానికి తీసుకుని వెళ్ళినప్పటి విషయాన్ని నేను ఎంతో ఆనందంగా గుర్తుచేసుకుంటాను. ‘వేవేలకొలది సహోదరులు’ అనే రాజ్యగీతాన్ని పాడుతుండగా, నేను ఆ ఓపెన్ ఎయిర్ స్టేడియంలో పైనున్న మేఘాలను చూసినప్పుడు నాకు కన్నీళ్ళు ఆగలేదు. ‘నా చుట్టూ ఇంతమంది మంచి ప్రజలుండగా, నేను కావాలని యెహోవా ఎందుకు కోరుకుంటాడు?’ అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. నేను యెహోవాకు సంపూర్ణంగా సేవ చేయాలని ఆ రోజు నిశ్చయించుకున్నాను” అని వ్రాసింది. ఎంతటి హృదయోద్దీపకమైనది! పరిశుభ్రమైన యెహోవా ప్రజలతో సహవసించడం నిశ్చయంగా సంతోషకరమైన విషయం, కాదంటారా?
7 చివరి దినాల అంతిమ భాగంలో మనకు వార్షిక జిల్లా సమావేశాలు మునుపెన్నటి కన్నా ఇప్పుడు ఎంతో అవసరం. అది మన ఆధ్యాత్మిక ఆరోగ్యాన్నీ, సంయమనాన్ని కాపాడుకొనేందుకు యెహోవా చేసిన ఏర్పాటు. కాబట్టి, ఈ సంవత్సరపు “దేవుని వాక్యప్రకారం ప్రవర్తించేవారు” అనే జిల్లా సమావేశానికి మూడు రోజులూ హాజరవ్వాలని తీర్మానించుకోండి. మీ తీర్మానానికి అనుగుణ్యంగా మీరు ఏ చర్యలు తీసుకోవచ్చు? సమావేశమంతటికీ హాజరయ్యేందుకు పని నుండి సెలవు కోసం మీ యజమానిని ముందుగానే అడగండి. మీరు ఆర్థికంగా అంత మంచి స్థితిలో లేకపోతే అవసరమైన డబ్బు ఇప్పటినుండే ఆదా చేయడం మొదలుపెట్టండి. ఏ విధమైన ఆటంకాన్నైనా అధిగమించేందుకు సహాయం చేయమని యెహోవాను అడగండి. మీరు అలా చేస్తే, ప్రేమగల మన పరలోక తండ్రియైన యెహోవా నుండి వచ్చే నిత్యజీవపు మాటలు వినడానికీ, మన సహోదర సహోదరీల ప్రేమపూర్వకమైన సహవాసాన్ని అనుభవించేందుకు ఎదురు చూడవచ్చు.—పోల్చండి యోహాను 6:68.
[3వ పేజీలోని బాక్సు]
సమావేశ సమయాలు
శుక్రవారం, శనివారం
ఉదయం 9:30 నుండి సాయంత్రం 5:00 వరకు
ఆదివారం
ఉదయం 9:30 నుండి సాయంత్రం 4:00 వరకు