కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/00 పేజీ 1
  • మీకు స్వయంత్యాగ స్ఫూర్తి ఉందా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీకు స్వయంత్యాగ స్ఫూర్తి ఉందా?
  • మన రాజ్య పరిచర్య—2000
  • ఇలాంటి మరితర సమాచారం
  • స్వయంత్యాగ స్ఫూర్తిని ఎలా కాపాడుకోవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • స్వయంత్యాగ స్ఫూర్తితో యెహోవాను సేవించుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • స్వయంత్యాగం ఎందుకు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • యెహోవా సేవను కేంద్రంగా చేసుకొని మీ జీవితాన్ని నిర్మించుకోండి
    మన రాజ్య పరిచర్య—1998
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2000
km 4/00 పేజీ 1

మీకు స్వయంత్యాగ స్ఫూర్తి ఉందా?

1 మానవజాతి కోసం యేసుక్రీస్తు నిస్వార్థంగా సాధించిన దాని పట్ల మనకున్న మెప్పు, మనం మన సామర్థ్యాలను, మన శక్తిని, మన బలాన్ని స్వయంత్యాగపూరిత మార్గంలో ఉపయోగించేలా మనందరినీ పురికొల్పాలి. ‘పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి’ అని లేఖనాలు ప్రోత్సహిస్తున్నాయి. (రోమా. 12:1) తరచూ స్వయంపరిశీలన చేసుకోవడం, మీ వ్యక్తిగత పరిస్థితులు అనుమతించినంత మేరకు మీరు ఆ విధమైన స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి సహాయం చేస్తుంది.

2 బైబిలు జ్ఞానాన్ని అన్వేషించడంలో: వ్యక్తిగత బైబిలు పఠనానికి, క్రమంగా అధ్యయనం చేయడానికి మీరు సమయాన్ని కేటాయించుకున్నారా? ఆ ప్రణాళికకు కట్టుబడి ఉంటారా? సంఘ కూటాలకు బాగా సిద్ధపడటం మీరు నియమానుసారంగా చేస్తారా? మీరొక కుటుంబ యజమాని అయితే మీ కుటుంబంతో క్రమంగా బైబిలు అధ్యయనం చేస్తున్నారా? ఇవి చేయాలంటే, టీవీ ముందు, లేక కంప్యూటర్‌ దగ్గర, లేక ఇతర విషయాలపై గడిపే సమయాన్ని త్యాగం చేయాల్సివుంటుంది. అయితే, దేవుని వాక్యంతో గడిపిన సమయం నిత్యజీవాన్ని తీసుకువస్తుంది గనుక, అదెంత చిన్న త్యాగమో కదా!—యోహా. 17:3.

3 మీ పిల్లలకు శిక్షణనివ్వడంలో: స్వయంత్యాగాన్ని గూర్చి నేర్చుకోవటాన్ని ప్రారంభించడానికి సరైన సమయం బాల్యమే. ఆడుకోవడానికి సమయమున్నట్లుగానే, పని చేయడానికీ, దైవపరిపాలనా కార్యక్రమాలకూ సమయముండాలని మీ పిల్లలకు బోధించండి. (ఎఫె. 6:4) ఇంట్లో ఏదైనా ఉపయోగకరమైన పనిని అప్పగించండి. పరిచర్యలో వారితో పాటు భాగం వహించడానికి క్రమ ప్రణాళికను వేసుకోండి. మీ స్వంత మాదిరి ద్వారా మీ ఉపదేశాన్ని బలపరచండి.

4 సంఘ కార్యకలాపాల్లో: సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ, అందరి మేలు కోసం ఇష్టపూర్వకంగా త్యాగాలు చేసినప్పుడు, అది వర్థిల్లుతుంది. (హెబ్రీ. 13:16) రాజ్య ప్రచార పనిలోనూ, శిష్యులను చేసే పనిలోనూ ఎక్కువ సమయం గడపడం మీకు సాధ్యమౌతుందా? అనారోగ్యంతో ఉన్నవారికీ పెద్ద వయస్సులో ఉన్న వారికీ బహుశా కూటాలకు రావడానికి సహాయం అవసరమైతే మీరు స్వచ్ఛందంగా చేయగలరా?

5 యేసు తన మానవ జీవితాన్ని సర్వోత్కృష్టంగా త్యాగం చేసే ముందు, తమ దృష్టిని రాజ్య ఆసక్తులపై కేంద్రీకరించమనీ జీవితంలో మిగతా అన్నింటికి రెండవస్థానాన్ని ఇవ్వమనీ తన అపొస్తలులకు ఉపదేశించాడు. (మత్త. 6:33) మనం ఆనందంగా యెహోవా సేవ చేస్తూ ఉండగా అలాంటి స్వయంత్యాగ స్ఫూర్తిని ప్రదర్శిస్తూనే ఉండటం గొప్ప ఆనందాన్ని తెస్తుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి