సేవా కూటాల పట్టిక
ఏప్రిల్ 10తో ప్రారంభమయ్యే వారం
పాట 122 (23)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుంచి ఎంపిక చేసిన ప్రకటనలు. ఏప్రిల్ 16న ఉండే, “మానవజాతికి విమోచన క్రయధనం ఎందుకు అవసరం” అన్న అంశంగల ప్రత్యేక బహిరంగ ప్రసంగాన్ని మర్చిపోవద్దు. ఏప్రిల్ 14-19 కోసం ప్రతిదినము లేఖనములను పరిశీలించుట—2000లో ఇవ్వబడిన జ్ఞాపకార్థ బైబిలు పఠన షెడ్యూలు ప్రకారం పఠించమని అందరినీ ప్రోత్సహించండి. ఇన్‌సర్ట్‌లో 4వ పేజీలో ఉన్న “జ్ఞాపకార్థదిన జ్ఞాపికలు”ను పరిశీలించండి.
15 నిమి: “మీరు క్రీస్తు ప్రేమకు ప్రతిస్పందిస్తున్నారా?” ఉపోద్ఘాతాన్ని నిమిషంలోపుకు పరిమితం చేసి ప్రశ్నా-జవాబుల చర్చను చేయండి. కావలికోట మే 1, 1998, 16-17 పేజీలు, 12-13 పేరాలలోని తలంపులను ఇమడ్చండి. జ్ఞాపకార్థ దినానికి ప్రజలను ఆహ్వానించేందుకు ప్రత్యేక ప్రయత్నం చేయమని ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించండి.
20 నిమి: “ఏప్రిల్—సత్‌క్రియలయందు ఆసక్తి కలిగి ఉండటానికి సమయం !” ప్రశ్నా జవాబులు. ఏప్రిల్‌లో మనం సాధించాలనుకుంటున్నదాన్ని గురించి ఉత్సాహవంతమైన చర్చ. “అనేకులను పురికొల్పే ఆసక్తి” అనే అంశాన్ని చర్చించేందుకు ఆఖరి మూడు, నాలుగు నిమిషాలను తీసుకోండి.
పాట 199 (11) ముగింపు ప్రార్థన.
ఏప్రిల్ 17తో ప్రారంభమయ్యే వారం
పాట 25 (2)
13 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్ రిపోర్టు. ఇక ఏప్రిల్‌లో రెండు వారాంతాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి, నెల పూర్తికాక ముందు పరిచర్యలో పాల్గొనమని ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించండి. క్రొత్త సంచికలను ఉపయోగించి క్లుప్తంగా పత్రికలను అందజేయడాన్ని ప్రదర్శించండి. తమ ఈస్టర్ ఆచారాల్లో మీరు పాల్గొనాలని కోరుకునే ప్రజలకు సమాధానమిచ్చే బాధ్యత మనకుంటుంది గనుక తర్కము (ఆంగ్లం) పుస్తకం 179-80 పేజీల్లో ఉన్న విషయాన్ని పునఃపరిశీలించండి.
16 నిమి: “మీకు స్వయంత్యాగ స్ఫూర్తి ఉందా?” ప్రశ్నా జవాబులు. ప్రాముఖ్యమైన వాటికి ప్రథమస్థానాన్ని ఇస్తూ ప్రాధాన్యతలను ఏర్పరచుకోవాలి. మనకు ఆధ్యాత్మికంగా ప్రయోజనకరమైన వాటిని చేస్తూ ఉండటానికి చొరవ, ఆత్మ నిగ్రహం అవసరం. యేసు మాదిరి నుండి మనం ఏమి నేర్చుకోవచ్చో వివరించండి.—అంతర్దృష్టి (ఆంగ్లం) సంపుటి 2, 68వ పేజీ, 3-5 పేరాలు చూడండి.
16 నిమి: ఎక్కడ ఎక్కువ ప్రభావవంతంగా ఉంటాయో అక్కడ పత్రికలను అందించండి. ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. తేజరిల్లు! జనవరి 8, (ఆంగ్లం) 1995, 22-4 పేజీల్లో ఉన్న సలహాలను పరిశీలించండి. పత్రికలలో వస్తున్న ప్రత్యేకమైన శీర్షికలకు ప్రతిస్పందించగల వారికోసం వెదకడం ఎందుకు మంచిదో వివరించండి. గత సంచికల్లోని ఉదాహరణలను, వాటిలోని శీర్షికలు స్థానిక ప్రాంతంలోని ఎటువంటి వ్యక్తులకు, వ్యాపారాలకు లేదా సంస్థలకు ఆకర్షణీయమైనవిగా ఉన్నాయో పరిశీలించండి. ఈ పద్ధతిని ఉపయోగించడం ద్వారా మంచి ఫలితాలను ఎలా పొందారో చూపించే అనుభవాలను తెలియజేయమని ప్రేక్షకులను ఆహ్వానించండి.
పాట 71 (4) ముగింపు ప్రార్థన.
ఏప్రిల్ 24తో ప్రారంభమయ్యే వారం
పాట 137 (11)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మీ సంఘంలో జ్ఞాపకార్థదిన ఆచరణకు ఎంతమంది హాజరయ్యారో ప్రకటించండి. మొదటిసారిగా హాజరైనవారు వ్యక్తపరచిన అభిప్రాయాలను తెలియజేయమని ప్రేక్షకులను ఆహ్వానించండి.
17 నిమి: కూటాలకు హాజరయ్యేందుకు క్రొత్తవారికి సహాయం చేయండి. జ్ఞానము పుస్తకం 161- 3 పేజీలు, 5-8 పేరాలపై ఆధారపడిన ఒక ప్రసంగం. క్రొత్త వారు కొంతకాలం పాటు పఠనం చేసిన తర్వాత, కూటాలకు రావడం ప్రారంభించడం ఆవశ్యకం. వాళ్ళు కూటాలకు హాజరయ్యేలా చేయడం మనకు ఒక సవాలు కావచ్చు. వాళ్ళని ప్రేరేపించడానికి మీరేమి చేయవచ్చు? పఠనాలు నిర్వహిస్తున్నవారు, జ్ఞానము పుస్తకంలోవున్న ఈ సమాచారాన్ని తమ విద్యార్థులతో పునఃపరిశీలించడానికీ, ఆ తర్వాత వాళ్లు సత్యారాధనలో మనతోపాటు చేరేందుకు వాళ్లకు సహాయం చేయడానికీ సమయాన్ని తీసుకోవాలి.
18 నిమి: “మీరు క్రమ రాజ్యప్రచారకులా?” ప్రసంగం మరియు ప్రేక్షకులతో కార్యదర్శి చేసే చర్చ. మనం ఎందుకు క్షేత్ర సేవ కార్యకలాపాలను నివేదిస్తామో వివరించండి. (మన పరిచర్య 106-8 పేజీలు చూడండి.) మనం మన రిపోర్టులను వెంటనే ఇవ్వకపోతే తలెత్తే కొన్ని సమస్యలను గురించి తెలియజేయండి. సరైన సమయానికి తమ రిపోర్ట్‌లు అందజేసేందుకు వారు ఏమి చేస్తారో తెలియజేయమని ప్రేక్షకులను ఆహ్వానించండి. సంఘ పుస్తక పఠన నిర్వాహకులు ఎలా సహాయపడవచ్చో తెలియజేయండి. ఏప్రిల్‌లో ఒక్క వారాంతమే మిగిలివుంది కాబట్టి, పరిచర్యలో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిన, నెలాఖరున రిపోర్ట్‌ను ఇవ్వాల్సిన ప్రాముఖ్యాన్ని నొక్కితెల్పండి.
పాట 200 (23) ముగింపు ప్రార్థన.
మే 1తో ప్రారంభమయ్యే వారం
పాట 213 (26)
12 నిమి: స్థానిక ప్రకటనలు. ఏప్రిల్ నెలలోని క్షేత్రసేవ రిపోర్ట్‌లను ఇవ్వమని అందరికీ గుర్తు చేయండి. మే 6వ తారీఖుకల్లా రిపోర్ట్‌లన్నీ సరిచూడ గల్గేలా, సంఘ పుస్తక పఠన నిర్వాహకులు తమ గ్రూప్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ తమ రిపోర్ట్‌లను ఇచ్చారో లేదో చూడాలి. ప్రశ్నాభాగంను పరిశీలించి, స్థానిక అవసరాలకు తగినట్లు అన్వయించండి.
15 నిమి: స్థానిక అవసరాలు.
18 నిమి: “మీరు తప్పకుండా తిరిగి వెళ్లండి !” ప్రేక్షకులతో చర్చ. మనం పునర్దర్శనాలను చేయలేకపోవడానికి గల కారణాలను పరిశీలించండి. ఖచ్చితమైన నోట్స్, తిరిగి వెళ్ళాలన్న సుముఖత ఎందుకు ప్రాముఖ్యమో వివరించండి. పునర్దర్శనాలు చేసేందుకు ప్రతి వారం కొంత సమయాన్ని ప్రక్కకు పెట్టడాన్ని గూర్చి సలహానివ్వండి. మన పరిచర్య పుస్తకం, 88-9 పేజీల్లో చెప్పబడినదాన్ని పరిశీలించండి. 1995 వార్షికపుస్తకం (ఆంగ్లం) 45వ పేజీలో నివేదించబడిన అనుభవాన్ని తెలియజేయండి.—1 కొరిం. 3:6, 7.
పాట 68 (9) ముగింపు ప్రార్థన.