కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/00 పేజీ 2
  • సేవా కూటాల పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2000
  • ఉపశీర్షికలు
  • మార్చి 13తో ప్రారంభమయ్యే వారం
  • మార్చి 20తో ప్రారంభమయ్యే వారం
  • మార్చి 27తో ప్రారంభమయ్యే వారం
  • ఏప్రిల్‌ 3తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2000
km 3/00 పేజీ 2

సేవా కూటాల పట్టిక

మార్చి 13తో ప్రారంభమయ్యే వారం

పాట 118 (20)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుంచి ఎంపిక చేసిన ప్రకటనలు.

15 నిమి: “మనం సువార్తను ప్రకటిస్తాము.” ఉపోద్ఘాతాన్ని నిమిషంలోపుకు పరిమితం చేసి ప్రశ్నా-జవాబుల చర్చను చేయండి. పరిచర్యలో జ్ఞానము పుస్తకాన్ని అందించేటప్పుడు దాని నుండి చూపించగల క్షేమాభివృద్ధికరమైన లేఖనాధార అంశాల ఉదాహరణలను ఇవ్వండి.

20 నిమి: “2000 ఏప్రిల్‌ను మన అపూర్వమైన నెలగా చేసుకోగలమా?” (1-11 పేరాలు) ప్రశ్నా జవాబులు. సంఘంలోని ఇటీవలి సహాయ పయినీర్ల శిఖరాగ్ర సంఖ్యను ప్రస్తావించండి. పరిచర్యలో తమ భాగాన్ని పెంచుకోవటం ద్వారా తాము పొందిన వ్యక్తిగత ప్రయోజనాలను చెప్పమని వారిలో కొందరిని అడగండి. ఏప్రిల్‌లో సహాయ పయినీర్ల కొత్త శిఖరాగ్ర సంఖ్యను చేరుకోవటానికి పనిచేసేలా సంఘాన్ని ప్రోత్సహించండి. మన పరిచర్య పుస్తకం 113-14 పేజీలలో ఉన్న అర్హతలను సమీక్షించండి. సహాయ పయినీర్‌ సేవ చేయటానికి ఇష్టపడే ప్రచారకులు, ఈ కూటం తర్వాత దరఖాస్తులను పొందవచ్చు.

పాట 187 (22) ముగింపు ప్రార్థన.

మార్చి 20తో ప్రారంభమయ్యే వారం

పాట 21 (8)

10 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్‌ రిపోర్టు.

15 నిమి: “నేనేం చేయగలను?” పుస్తక పఠన నిర్వాహకుడు ఒకరిద్దరు పరిచర్య సేవకులతో ఈ శీర్షికను చర్చిస్తాడు. కొందరు ప్రచారకులు తమకున్న వివిధ పరిమితులవల్ల, సంఘ కార్యకలాపాలకు ఎక్కువగా దోహదపడలేక పోతున్నామని భావించవచ్చు. రాజ్య పని ముందుకు వెళ్లటానికీ, సంఘాన్ని బలపర్చటానికీ మనమందరం చేయగల విలువైన సహాయాల్లోని అనేక మార్గాల్లో కొన్నింటిని సమీక్షించండి. ప్రతి ఒక్కరు ఎలా ‘చివరి రిపోర్టునందు భాగం వహించవచ్చో’ చూపిస్తూ ముగించండి.—మన పరిచర్య, 108-10 పేజీలు.

20 నిమి: “2000 ఏప్రిల్‌ను మన అపూర్వమైన నెలగా చేసుకోగలమా?” (12-18 పేరాలు) ప్రశ్నా జవాబులు. పరిచయస్థులను జ్ఞాపకార్థ దినానికి ఎలా ఆహ్వానించాలో చిన్న ప్రదర్శనను చూపించండి. 2000 క్యాలెండరులోని ఏప్రిల్‌ నెలను సమీక్షించి, స్థానికంగా ఏర్పాటు చేయబడిన పరిచర్య కోసమైన కూటాల వివరాలను తెలియజేయండి. ఆ నెలలో పరిచర్యలో సాధ్యమైనంత చేయటానికి ఆచరించతగ్గ షెడ్యూలు వేసుకోమని ప్రతి ఒక్కరికీ గుర్తు చేయండి, అలా సంఘం నూరు శాతం పాల్గొనే లక్ష్యం పెట్టుకోవచ్చు. వీలైన వారందరినీ సహాయ పయినీర్‌ సేవ చేయమనీ, కూటం అయిన తర్వాత దరఖాస్తులను తీసుకోమనీ ప్రోత్సహించండి.

పాట 65 (23) ముగింపు ప్రార్థన.

మార్చి 27తో ప్రారంభమయ్యే వారం

పాట 119 (17)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మార్చిలోని తమ క్షేత్ర సేవా రిపోర్టులను ఇవ్వమని అందరికీ గుర్తు చేయండి. ఏప్రిల్‌లో సహాయ పయినీరింగ్‌ చేస్తున్న వారి పేర్లను ప్రకటించండి. దరఖాస్తులు ఇవ్వటానికి మరీ ఆలస్యం కాలేదని వివరించండి. ఆ నెలలో పథకం వేయబడిన క్షేత్ర సేవ కోసమైన కూటాల పూర్తి షెడ్యూలును స్థూలంగా చెప్పండి. ఏప్రిల్‌ నెలకు చక్కని ప్రారంభాన్నిస్తూ, ఈ వారాంతంలో పరిచర్యలో భాగం వహించమని ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించండి. ఈ నెలలో మనం కావలికోట, తేజరిల్లు ! విడి పత్రికలను అందిస్తాము. ఒక్కో తాజా సంచికను అందించడంలో ప్రభావవంతంగా ఉపయోగించగల ఒక శీర్షికను, సముచితమైన అంశాన్ని నొక్కి చెప్పండి. ప్రతి ఒక్కరు దేవుడు కోరుతున్నాడు బ్రోషూర్‌ ప్రతిని తమ వద్ద ఉంచుకుని, ఆసక్తిగల వారితో గృహ బైబిలు పఠనాలు ఆరంభించటానికి దాన్ని ఉపయోగించేందుకు కృషి చేయాలి.

13 నిమి: “సహాయాన్ని అడగండి.” ప్రేక్షకులతో పెద్ద చేసే చర్చ, ప్రసంగం. తరచుగా ఏదో విధమైన సహాయం మనకందరికీ ఎలా అవసరమో వివరించండి. నిజమే, ప్రతివారు తమ బరువును తామే భరించుకోవాలి. (గల. 6:5) అయితే, మనం వాటిని ఎదుర్కోలేనప్పుడు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందిన సంఘ సభ్యుల సహాయం పొందటానికి వెనుకాడకూడదు. ఇతరులిచ్చిన దయగల సహాయం తమను ఎలా ప్రోత్సహించిందో చూపించే అనుభవాలు చెప్పమని ప్రేక్షకులను ఆహ్వానించండి.

10 నిమి: స్థానిక అవసరాలు.

12 నిమి: 2000 వార్షికపుస్తకము (ఆంగ్లం) సమీక్ష. 31వ పేజీలో ఉన్న “1999 వెరసి మొత్తాలు”లోని ఉన్నతాంశాలను గూర్చి ప్రేక్షకులతో చర్చ, సమీక్ష. ఆ తర్వాత 3-5 పేజీలలో ఉన్న “పరిపాలక సభ లేఖ”ను కూడా చర్చించండి. ఇవ్వబడిన ప్రోత్సాహానికి తాము ఎలా ప్రతిస్పందిస్తారో కొందరిని వ్యాఖ్యానించమనండి.

పాట 195 (9) ముగింపు ప్రార్థన.

ఏప్రిల్‌ 3తో ప్రారంభమయ్యే వారం

పాట 72 (22)

10 నిమి: స్థానిక ప్రకటనలు, క్షేత్ర సేవా అనుభవాలు. ఇతరులు భాగం వహించేలా ప్రోత్సహించే, స్థానిక ప్రాంతంలోని ఇటీవలి అనుభవాల్లోంచి ఎంపిక చేయబడిన వాటిని ఉపయోగించండి.

17 నిమి: “దానియేలు ప్రవచనం పఠనం.” ప్రశ్నా జవాబులు. బైబిలు పుస్తకమైన దానియేలు గ్రంథాన్ని చదవడం ద్వారా మనం ప్రయోజనం పొందాలంటే మనమే స్థితిలో ఉండాలనేదాని గురించి క్లుప్తంగా వ్యాఖ్యానించండి. (దానియేలు ప్రవచనం [ఆంగ్లం] పుస్తకంలోని మొదటి అధ్యాయం, 15-17 పేరాలను చూడండి.) దానియేలు ప్రవచనం పుస్తకం స్థానిక భాషలో అందుబాటులో లేని పుస్తక పఠన గుంపులు సముచితమైన ప్రత్యామ్నాయ భాషలో లభ్యమౌతున్న అదే పుస్తకాన్ని ఉపయోగించవచ్చు, అలా సాధ్యం కాని పక్షంలో, 6వ పేజీలో ఇవ్వబడిన షెడ్యూల్‌ అనుసారంగా ప్రకటన దాని దివ్యమైన ముగింపు సమీపించింది ! పుస్తకాన్ని పఠించవచ్చు. ఈ శీర్షికను తదనుగుణంగా మలచుకోండి. సంఘ పుస్తక పఠనానికి క్రమంగా హాజరు కమ్మని అందరినీ ప్రోత్సహించండి.

18 నిమి: గంభీరమైన తప్పిదాల్ని గూర్చి నేను చెప్పాలా? యౌవనస్థుల నుద్దేశించి పెద్ద ఇచ్చే గంభీరమైన ప్రసంగం. యౌవనస్థులపై నాశనకరమైన ప్రభావాన్ని చూపిన అనేక సమస్యలు ఆధునిక సమాజంలో తలెత్తాయి. అవేమిటంటే, దిగజారిపోతున్న నైతిక ప్రమాణాలు, పెచ్చుపెరిగిపోతున్న దౌర్జన్యం, మాదక ద్రవ్యాలకు బానిసలవ్వడం, అధికారంలో ఉన్నవారిపట్ల గౌరవం లేకపోవడం వంటివి. కొంతమంది యౌవనస్థులు ద్వంద్వ జీవితాన్ని గడుపుతూ, తమ దుష్ప్రవర్తనను దాచిపెడతారు. ఇది, సంఘమంతటి ఆధ్యాత్మిక సంక్షేమానికీ తీవ్రమైన ముప్పు కల్గిస్తుంది. కొంతమంది గంభీరమైన తప్పిదం చేసి దాన్ని రహస్యంగా ఉంచాలనుకుంటారు. సంఘంలోని ఒక సహోదరుడు గానీ సహోదరి గానీ దేవుని చట్టాన్ని ఉల్లంఘించే గంభీరమైన తప్పిదం చేశారని మీకు తెలిస్తే మీరేమి చేయాలి? లేవీయకాండము 5:1 నందు పేర్కొనబడిన సూత్రాన్ని పరిశీలించండి. (ఆగస్టు 15, 1997 కావలికోట 27-30 పేజీలను చూడండి.) యువత అడిగే ప్రశ్నలు (ఆంగ్లం) పుస్తకంలోని 68-9 పేజీలను పరిశీలించి, అలాంటి సందర్భంలో ఒక వ్యక్తి ఏమి చేయాలో వివరించండి.

పాట 68 (23) ముగింపు ప్రార్థన.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి