కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/00 పేజీ 1
  • ‘నేనేం చేయగలను?’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘నేనేం చేయగలను?’
  • మన రాజ్య పరిచర్య—2000
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీ సంఘానికి మద్దతు ఇవ్వండి
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • ప్రతి మంచి పని కొరకు మనల్ని మనం ఇష్టపూర్వకంగా అర్పించుకొనుట
    మన రాజ్య పరిచర్య—1995
  • క్రైస్తవ ఐక్యతను పెంచడానికి మీరెలా సహాయం చేయవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • సంఘం క్షేమాభివృద్ధి పొందనివ్వండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2000
km 3/00 పేజీ 1

‘నేనేం చేయగలను?’

1 ‘నేనేం చేయగలను?’ ఆ ప్రశ్న 1870లలో చార్లెస్‌ తేజ్‌ రస్సెల్‌ సంస్థీకరించిన చిన్న బైబిలు పఠన గుంపు సభ్యుల మనస్సులలో మెదిలిందనటంలో సందేహం లేదు. వాళ్లు దేవుని చిత్తాన్ని అవగతం చేసుకుంటున్న కొద్దీ, ఇతరులు దేవుని సంకల్పాన్ని తెలుసుకునేందుకు సహాయం చేయటానికి తామేమి చేయగలమని ఆ తొలి బైబిలు విద్యార్థులు తప్పకుండా ఆలోచించే ఉంటారు. తాము సంపాదించుకుంటున్న బైబిలు జ్ఞానాన్ని మొత్తం ప్రపంచమంతటికీ చేరవేయడమన్నది బృహత్కార్యమే.

2 మనకు సంతోషకరమైన విధంగా, వారు ఆ సవాలును విజయవంతంగా ఎదుర్కున్నారు. ఎలా? ప్రతి వ్యక్తీ తనదైన చిరు పాత్రను పోషించడంతో, నేడు 234 దేశాల్లోనూ ద్వీపాల్లోనూ ఉన్న 90,000 సంఘాల్లో సేవచేస్తున్న దాదాపు అరవై లక్షలమంది రాజ్య ప్రచారకులున్న సంస్థగా యెహోవా సాక్షులు ప్రపంచమంతటికీ సుపరిచితమయ్యారు!—యెష. 60:22.

3 మీ పూర్తి మద్దతును అందించండి: ఈ చివరి దినాల్లో జరుగుతుందని యేసు ప్రవచించిన బృహత్కార్యంలో మనలో ప్రతి ఒక్కరం కొంతభాగం కలిగి ఉండటం ప్రాముఖ్యం. (మార్కు 13:10) ఈ కార్యం పరిమిత సంఖ్యలో ఉన్న పెద్దలకు మాత్రమే విడిచి పెట్టేది కాదు; అలాగే ప్రకటనా కార్యకలాపాన్ని కేవలం పయినీర్ల భుజాలపైనే వేసేయకూడదు. నిజానికి, ప్రతి సమర్పిత క్రైస్తవుడూ ఒక ప్రాముఖ్యమైన పాత్ర నిర్వర్తించవలసి ఉంది. మనమందరము ఏదో విధమైన ప్రకటనా కార్యకలాపంలో భాగం వహించగలము. (1 తిమో. 1:12) దీన్ని మనం ఎంత మేరకు చేసినప్పటికీ, మనకు మనం ప్రయోజనం చేకూర్చుకుంటాము, అలాగే ఇతరులకూ ప్రయోజనం చేకూరుస్తాము.—1 తిమో. 4:16.

4 ప్రతి ఒక్కరు ఇతర ప్రాముఖ్యమైన మార్గాలలో కూడా మన క్రైస్తవ సహోదరత్వానికి పూర్తి మద్దతును ఇవ్వగలరు. మనం క్రమంగా హాజరవటం ద్వారా, ఉత్సాహంగా పాల్గొనటం ద్వారా సంఘ కూటాలకు మద్దతునివ్వగలము. (కీర్త. 122:1, 8, 9) సంఘాన్ని నైతికంగా శుభ్రంగా ఉంచడానికి మన వంతు మనం చేయగలము. మన స్థితికి తగినంతలో ప్రపంచవ్యాప్త పనికి ఆర్థిక మద్దతును మనం ఇవ్వగలము. రాజ్యమందిరాన్ని శుభ్రపర్చటంలో మనం భాగం వహించగలము. కొత్తవారికి యౌవనస్థులకు అలాగే వృద్ధులకు ఏకరీతిన సహాయం చేయటం ద్వారా ప్రతి ఒక్కరూ సంఘంలో ఐక్యతను, ఆప్యాయతా స్ఫూర్తిని పెంపొందింపజేయగలరు.—కొలొ. 3:12, 14.

5 బహుశ, మీరిలా ప్రశ్నించుకుంటుండవచ్చు, ‘నేనేం చేయగలను?’ మీ ఒక్కరి ప్రయత్నాలు అల్పమైనవిగా కనబడినప్పటికీ, మీ వంతు మీరు చేయటం ద్వారా ఒక బలమైన చురుకైన ఆరోగ్యవంతమైన సంఘం రూపొందేందుకు మీరు తోడ్పడతారు. కాబట్టి, యెహోవా నామాన్ని మహిమపర్చటంలో మనకందరికీ ఒక ప్రాముఖ్యమైన పాత్ర ఉంది!

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి