కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/00 పేజీ 2
  • సేవా కూటాల పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2000
  • ఉపశీర్షికలు
  • ఫిబ్రవరి 14తో ప్రారంభమయ్యే వారం
  • ఫిబ్రవరి 21తో ప్రారంభమయ్యే వారం
  • ఫిబ్రవరి 28తో ప్రారంభమయ్యే వారం
  • మార్చి 6తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2000
km 2/00 పేజీ 2

సేవా కూటాల పట్టిక

ఫిబ్రవరి 14తో ప్రారంభమయ్యే వారం

పాట 113 (12)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు.

15 నిమి: “అత్యవసర భావంతో వాక్యాన్ని ప్రకటించండి.” ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కంటే తక్కువకు పరిమితం చేయాలి, తర్వాత, ప్రశ్నా జవాబుల చర్చను చేయండి. మన పరిచర్య పుస్తకం 170వ పేజీలోని వ్యాఖ్యలను కూడా చేర్చండి. ప్రకటనా పనిని ఎలా అభివృద్ధి చేసుకోవాలో కొన్ని ఆచరణాత్మక సలహాలను అందించండి.

20 నిమి: “తర్కించే సామర్థ్యాన్ని ఎలా వృద్ధి చేసుకోవచ్చు.” ప్రసంగం మరియు ప్రదర్శన. తర్కించే సామర్థ్యం పరిచర్యలో ఎందుకు అంత ప్రాముఖ్యమో, దాన్ని ఎలా సంపాదించుకోవాలో వివరించండి. సమర్థులైన ఇద్దరు ప్రచారకులు ఆ శీర్షికలోని 3వ పేరాలో సంక్షిప్తంగా ఇవ్వబడిన సూచనలను అనుసరిస్తూ పరిచర్య కోసం ఎలా సిద్ధపడాలో చర్చిస్తారు, ఆ తర్వాత వారు తమ అందింపును ప్రదర్శిస్తారు.

పాట 182 (24), ముగింపు ప్రార్థన.

ఫిబ్రవరి 21తో ప్రారంభమయ్యే వారం

పాట 17 (7)

10 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్‌ రిపోర్ట్‌.

15 నిమి: “‘ప్రభువునందు ప్రయాసపడుతున్న స్త్రీలు.’” ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కంటే తక్కువకు పరిమితం చేయాలి, తర్వాత, ప్రశ్నా జవాబుల చర్చను చేయండి. కావలికోట సెప్టెంబరు 15, 1996, 14-15 పేజీల్లోని, 18-19 పేరాలపై వ్యాఖ్యలను కూడా చేర్చండి. సహోదరీలు అందజేసే ఇష్టపూర్వక మద్దతును బట్టి, ఇతరుల కోసం వాళ్ళు చేసే ప్రయోజనకరమైన సేవలను బట్టి, ఆసక్తితో వాళ్ళు చేసే ప్రచారపనిని బట్టి వారిని హృదయపూర్వకంగా మెచ్చుకోండి.

20 నిమి: “విశ్వాసమందు నిలుకడగా ఉండేందుకు మనకేది సహాయపడగలదు?” పెద్ద ఇచ్చే ప్రసంగం. మనం అపాయకరమైన కాలాల్లో జీవిస్తున్నాము, మనకందరికీ ఏదో ఒక విధమైన సహాయం అవసరం. నిరుత్సాహపరిచే సమస్యలతో సతమతమౌతున్న వారిని బలపరిచేందుకు పెద్దలు, పరిచర్య సేవకులు ఏమి చేయవచ్చో సమీక్షించండి. (సెప్టెంబరు 15, 1993, కావలికోట 21-3 పేజీల్లో ఉన్న “క్షేమాభివృద్ధికరమైన కాపరితనము” అన్న ఉపశీర్షికను చూడండి.) మనల్ని ఆధ్యాత్మికంగా బలపరిచే మార్గాల్లో, మనం ఒకరినొకరం ఎలా ప్రోత్సహించుకోవచ్చో వివరించండి.—రోమా. 1:11, 12.

పాట 82 (10), ముగింపు ప్రార్థన.

ఫిబ్రవరి 28తో ప్రారంభమయ్యే వారం

పాట 46 (5)

10 నిమి: స్థానిక ప్రకటనలు. ఫిబ్రవరి కొరకైన క్షేత్రసేవా రిపోర్టులను ఇవ్వాలని అందరికీ గుర్తుచేయండి. జ్ఞానము పుస్తకాన్ని పరిచయం చేసేందుకు శాంతియుతమైన నూతనలోకం అనే కరపత్రాన్ని ఎలా ఉపయోగించవచ్చో ప్రదర్శించండి. ఆ కరపత్రంలోని మొదటి పేరా నుండి ప్రశ్నలను వేసిన తర్వాత, కీర్తన 37:29తో సహా, 3వ పేజీలోని మొదటి పేరాను చదవండి. ఆసక్తిని చూపిస్తే, జ్ఞానము పుస్తకాన్ని 5వ పేజీకి తెరచి, బాక్సును చదివి, పఠనాన్ని ప్రతిపాదించండి. ఈ నెలలో ప్రతి ఒక్కరూ క్రొత్త గృహ బైబిలు పఠనాలు ప్రారంభించేందుకు ప్రత్యేక ప్రయత్నం చేయాలి.

5 నిమి: ప్రశ్నాభాగం. పెద్ద ఇచ్చే ప్రసంగం.

12 నిమి: దానియేలు ప్రవచనము (ఆంగ్లం) పుస్తకాన్ని పరిశీలించండి. ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. క్రొత్త పుస్తకంలోని ఉన్నతాంశాలను పరిశీలించండి: ఆసక్తిని రేకెత్తించే అధ్యాయపు పేర్లూ, స్పష్టమైన చిత్రాలూ, ప్రతి చర్చ అనంతరం గల లోతుగా ఆలోచింపజేసే ప్రశ్నలతో ఉన్న బాక్సులూ, వివరాలను స్పష్టం చేసే చార్టులూ, పటాలూ. ఒక ప్రత్యేకమైన విధంగా మిఖాయేలు ఎలా ‘నిలబడతాడు’ అనే దాని గురించిన ప్రోత్సాహకరమైన వివరణను పరిశీలించండి (288-90 పేజీలు). దేవుని వాక్యాన్ని బోధించేవారముగా మనకుండాల్సిన సహనం యొక్క ప్రాముఖ్యతను గూర్చి చర్చించండి (311-12 పేజీలు). మనమందరం ఆ పుస్తకాన్ని జాగ్రత్తగా చదివి, ఆసక్తి గల వారినందరినీ అలాగే చదవమని ప్రోత్సహించాలి.

18 నిమి: “సంపూర్ణ నిశ్చయతతో సువార్తను ప్రకటించటం.” ఆ శీర్షిక ఆధారంగా, 1, 2 పేరాల్లో ఉదాహరించబడిన ఉల్లేఖించబడిన లేఖనాల ఆధారంగా ఒకటి రెండు నిమిషాల పాటు హృదయరంజకమైన ఉపోద్ఘాతాన్ని ఇవ్వండి. ప్రశ్నాజవాబుల చర్చ ద్వారా 3-12 పేరాలను పూర్తి చేయండి.

పాట 61 (16), ముగింపు ప్రార్థన.

మార్చి 6తో ప్రారంభమయ్యే వారం

పాట 116 (23)

5 నిమి: స్థానిక ప్రకటనలు.

10 నిమి: స్థానిక అవసరాలు.

10 నిమి: “మీరు ఎలా వింటున్నారన్నది చూసుకోండి.” సంఘకూటాల నుండి, అసెంబ్లీల నుండి, సమావేశాల నుండి, మరింత ప్రయోజనం పొందడానికి తాము ఏమి చేయవచ్చన్న విషయాన్ని ఒక కుటుంబ పెద్ద తన భార్యతోనూ, పిల్లలతోనూ చర్చిస్తాడు. కుటుంబంలోని వారందరూ ఇంకా ఎక్కువ అవధానాన్ని నిలుపవచ్చునని ఆయన భావిస్తాడు. నేర్చుకున్న విషయాలను గూర్చి మరిన్ని చర్చలు చేయవలసిన అవసరాన్ని, ఇవ్వబడిన సలహాలను, ఒక్కోదాన్ని ఎలా అన్వయించుకోవాలనే విషయాన్ని వారు పరిశీలిస్తారు. సాధ్యమైనంత వరకూ, ఏ కూటాలనూ, సమావేశాల్లోని ఏ కార్యక్రమాన్నీ తప్పిపోకుండా ఉండాలన్న తమ తీర్మానానికి తగ్గట్లుగా ఎలా ఉండాలనేది వాళ్ళు పరిశీలిస్తారు.

20 నిమి: “సంపూర్ణ నిశ్చయతతో సువార్తను ప్రకటించటం.” ఇన్‌సర్ట్‌లోని మొదటి 12 పేరాల్లో నుండి గత వారంలో జరిగిన చర్చ యొక్క కొంత క్లుప్త పరిశీలనానంతరం, 13-24 పేరాలపై ప్రశ్నాజవాబుల చర్చను నిర్వహించండి. ఉదాహరించబడిన ఉల్లేఖించబడిన లేఖనాలను చక్కగా ఉపయోగించండి.

పాట 186 (22), ముగింపు ప్రార్థన.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి