“అత్యవసర భావంతో వాక్యాన్ని ప్రకటించండి”
1 “అత్యవసరం” అని వ్రాసివున్న దేన్నైనా మీరు అందుకున్నప్పుడు, దాన్ని మీరెలా దృష్టిస్తారు? “అత్యవసరం” అన్న పదానికి “వెంటనే అవధానాన్నివ్వాల్సిన అవసరముంది” అని అర్థం. సరైన కారణంతోనే, అపొస్తలుడైన పౌలు, “అత్యవసర భావంతో వాక్యాన్ని ప్రకటించండి” అని క్రైస్తవులకు ఉపదేశించాడు. (2 తిమో. 4:2 NW) మీరు ఈ పనికి వెంటనే అవధానాన్నివ్వడం ద్వారా ప్రతిస్పందిస్తారా?
2 తన సహోదరులలో కొంతమంది, క్రైస్తవులుగా తమకప్పగించబడిన పనిలో “మాంద్యులు”గా తయారౌతున్నారని బహుశా పౌలుకు ఎవరో తెలియజేసివుంటారు. (రోమా. 12:11) అలా మాంద్యులుగా తయారవ్వడం, వాళ్ళ శ్రమకు వచ్చే ప్రతిఫలాలను, అలాగే ఇతరులకు సహాయపడటంలో వారు పొంది ఉండగలిగే ఆనందాన్ని పరిమితం చేసింది.
3 పరిచర్య పట్ల యేసు దృక్పథం: తన పరిచర్యను నెరవేర్చడంలో యేసు ఎంతటి ఆనందాన్ని పొందాడు! “నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది” అని ఆయన చెప్పాడు. ‘పొలములు తెల్లబారి కోతకు వచ్చియున్నవని’ చెప్పడం ద్వారా ఆయన ఎవరినైతే ప్రోత్సహించాడో ఆ శిష్యులను యేసు మాదిరి పురికొల్పింది. (యోహా. 4:34, 35) “తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని” ఆయన తన శిష్యులతో చెప్పినప్పుడు, ఆయన తన పరిచర్య అంతటిలో చూపించిన అత్యవసర భావం స్పష్టమైంది. (మత్త. 9:38) ప్రకటించమని తనకివ్వబడిన నియామకానికి యేసు మెప్పుదల చూపించాడు, అలాచేయకుండా ఏదైనా తనను ఆటంకపరచడానికి అనుమతించకూడదని ఆయన నిశ్చయించుకున్నాడు.
4 మన విషయమేమిటి? మునుపెన్నటి కన్నా నేడు, ప్రకటనా పనిలో అత్యవసర భావంతో కొనసాగవలసి ఉంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో, పొలములు కోతకు వచ్చియున్నవి. పూర్తిగా సాక్ష్యమివ్వబడింది అని అనిపిస్తున్న దేశాల్లో కూడా ప్రతి సంవత్సరం వేలాది మంది బాప్తిస్మం పొందుతున్నారు. ఈ విధానాంతం త్వరితంగా ముగింపుకు వస్తుండగా, ‘చేయడానికి ప్రభువు పనిలో ఎంతో ఉంది.’ (1 కొరిం. 15:58) మునుపెన్నటి కన్నా ఇప్పుడు, ఇతరులతో రాజ్య సందేశాన్ని పంచుకోవడానికి మనం తీవ్రంగా కృషి చేయడం ఆవశ్యకం.
5 ఇంటింటి పరిచర్యలోనూ, ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ, సువార్తను ప్రజలతో పంచుకోవడంలో పూర్తిగా నిమగ్నమైవుందాం. సాధ్యమైనంత ఎక్కువగా ప్రకటనా పనిలో పాల్గొనడం ద్వారా మనం మన జీవితాల్లో దేవుని రాజ్యానికి ప్రథమస్థానాన్ని ఇస్తున్నామని చూపిస్తాము. (మత్త. 6:33) వాక్యాన్ని అత్యవసరంగా ప్రకటించడంలోని మన విశ్వాస్యత మనకు మరింత ఆనందాన్ని తీసుకువస్తుంది.