ప్రశ్నా భాగం
◼ రాజ్యమందిరాన్ని శుభ్రపర్చే బాధ్యత ఎవరిది?
శుభ్రమైన, ఆకర్షణీయమైన రాజ్యమందిరం, మనం ప్రకటించే సందేశంపై అనుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. (పోల్చండి 1 పేతురు 2:12.) హాలును శుభ్రంగా, క్రమమైనరీతిలో ఉంచడం ప్రాముఖ్యం, దాని బాగోగులు చూసుకోవటంలో ప్రతి ఒక్కరూ భాగం వహించవచ్చు. దాని పూర్తి బాధ్యత ఎవరో కొందరిది మాత్రమేనని తలంచకూడదు. సాధారణంగా, శుభ్రపర్చే పనిని పుస్తక పఠన గుంపుల వారీగా ఏర్పాటు చేస్తారు, పఠన నిర్వాహకుడు గానీ, ఆయన సహాయకుడు గానీ నాయకత్వం వహిస్తారు. ఒకటికన్నా ఎక్కువ సంఘాలు సహవసిస్తున్న మందిరాలైతే, పెద్దలు విషయాలను సంస్థీకరిస్తారు, అలా అన్ని సంఘాలు దాన్ని శుభ్రం చేయడంలో భాగం వహించవచ్చు.
ఈ బాధ్యతను అత్యంత శ్రేష్ఠమైన రీతిలో మనం ఎలా చేయవచ్చు? క్రమమైన షెడ్యూల్ ప్రకారం రాజ్యమందిరం ఎల్లప్పుడూ శుభ్రం చేస్తూ ఉండాలి. శుభ్రం చేయడానికి ఉపయోగించే వాటినీ, పరికరాలనూ అందుబాటులో ఉంచుకోవాలి. పని చేసే వాళ్ళు చూసుకొనేందుకు వీలుగా ఉండేచోట, ఏమేమి పనులు చేయాలో ఆ పనుల పట్టికను అంటించాలి. కూటం ముగిసిన ప్రతిసారీ మామూలుగా శుభ్రంచేయడానికి ఒకటి, ప్రతి వారం బాగా శుభ్రం చేసేందుకు మరొకటి రెండు వేర్వేరు పట్టికలుండవచ్చు. బాగా శుభ్రం చేయడానికి దినాన్ని, సమయాన్ని నియమించబడిన వారందరికీ వీలుగా ఉండేలా పుస్తక పఠనాధ్యక్షుడు ముందుగానే పట్టిక వేయాలి. మొక్కల పట్లా, పువ్వుల పట్లా కూడా క్రమమైన అవధానాన్ని చూపించాలి. ఫుట్‌పాత్‌లు, పార్కింగ్ ప్రదేశాలు చెత్తా చెదారం లేకుండా ఉంచాలి. బహుశా జ్ఞాపకార్థ దినానికి ముందు ప్రతి సంవత్సరం బాగా శుభ్రం చేయాలి. కర్టెన్లను ఉతకడం, కిటికీలను, గోడలను కడగడం కూడా ఇందులో ఇమిడివుంటుంది.
మందిరం లోపల గానీ, మందిరం బయట గానీ చెత్తాచెదారం పడేయకుండా ఉంటే ప్రతి ఒక్కరికీ శుభ్రం చేయడం తేలికగా ఉంటుంది. మనం ఉపయోగించిన ప్రతిసారీ టాయ్‌లెట్లను శుభ్రం చేసినట్లయితే, తర్వాత వ్యక్తి ఉపయోగించడానికి శుభ్రంగా ఉంటాయి. పరికరాలను పగలగొట్టకుండా, ఫర్నీచర్ పాడుకాకుండా జాగ్రత్త పడండి. పాడైన కుర్చీలను, కొళాయి గొట్టాలకు సంబంధించిన సమస్యలను, మాడిపోయిన బల్బులను, ఇంకా అలాంటి వాటిని గమనించి, రాజ్యమందిర నిర్వహణలో నడిపింపునిస్తున్న సహోదరునికి వెంటనే తెలియజేయాలి.
మనలో ప్రతి ఒక్కరమూ మన భాగాన్ని నిర్వర్తించేందుకు సుముఖత చూపుదాము. ఇది, రాజ్యమందిరాన్ని ఆహ్లాదకరమైన ఆరాధనా గృహంగా చేసి, యెహోవాను ఘనపర్చే శుభ్రమైన ప్రజలుగా మనలను భిన్నంగా ఉంచుతుంది.—1 పేతు. 1:14-16.