ఆగస్టులోని సేవా కూటాలు
ఆగస్టు 2తో ప్రారంభమయ్యే వారం
పాట 39 (4)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా చేసిన, స్థానిక సంఘ ప్రచారకులంతా చేసిన క్షేత్రసేవ రిపోర్టుపై వ్యాఖ్యానించండి. ఆగస్టు నెలలో క్షేత్ర పరిచర్యలో పాల్గొనమని ప్రచారకులందరినీ ప్రోత్సహించండి.
17 నిమి: “యెహోవా దేవుని సుందరమైన నామాన్ని ఉన్నతంగా ఘనపర్చడం.” ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కంటే తక్కువ సమయానికి పరిమితం చేయండి, ఉపోద్ఘాతానంతరం చర్చను ప్రశ్నా జవాబులతో కొనసాగించండి. ఉదహరించబడిన లేఖనాలను ఉన్నతపర్చండి—నిరంతరం జీవించగలరు అనే పుస్తకంలో 184-5 పేజీలను చూడండి.
18 నిమి: “లౌకిక విద్యా, మీ ఆధ్యాత్మిక లక్ష్యాలూ.” ఒక తండ్రి తన కుమారునితోనో లేక కుమార్తెతోనో శీర్షికను చర్చిస్తాడు. డిసెంబరు 22, 1995 తేజరిల్లు! (ఆంగ్లం) 7-11 పేజీలలో ఉన్న సంబంధిత సమాచారాన్ని కూడా వాళ్ళు పునఃసమీక్షిస్తారు.
పాట 148 (6), ముగింపు ప్రార్థన.
ఆగస్టు 9తో ప్రారంభమయ్యే వారం
పాట 138 (21)
8 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు.
12 నిమి: పయినీర్లు ఇతరులకు సహాయపడతారు—ఎలాంటి అభివృద్ధిని సాధించడం జరిగింది? సేవా పైవిచారణకర్త ఇచ్చే ప్రసంగం, చేసే ఇంటర్వ్యూలు. మన రాజ్య పరిచర్య సెప్టెంబరు 1998 సంచిక, 8వ పేజీలో ఇవ్వబడిన నిర్దేశాన్ని పునఃసమీక్షించండి. ఆ కార్యక్రమం స్థానికంగా ఎలా సంస్థీకరించబడిందో తెలియజేసి, సహాయాన్ని పొందినవారు ఇటీవల సాధించిన పురోభివృద్ధిని వివరించండి. ఒకరిద్దరు పయనీర్లనూ, వారు చేసిన సహాయాన్నుండి ప్రయోజనం పొందిన ప్రచారకులలో కొంతమందినీ ఇంటర్వ్యూ చేయండి. పయినీర్ల నుంచి సహాయాన్ని పొందబోయే వరుసలో ఉన్న ప్రచారకులను ఈ సహాయ కార్యక్రమం నుంచి పూర్తి ప్రయోజనం పొందేలా ప్రోత్సహించండి.
25 నిమి: “పయినీరింగ్ కొరకైన ద్వారం మీ కోసం ఇప్పుడు తెరవబడి ఉందా?” ఒక పెద్ద నిర్వహించే ప్రశ్నా జవాబుల చర్చ. పయినీరు సేవ చేయడానికి అనేకమంది ప్రచారకులకు ఉన్న సాధ్యనీయతలను అనుకూలమైన విధంగా చూపించండి. అందరికీ ఎదురయ్యే ఆటంకాలను తామెలా అధిగమించి, సఫలీకృతులయ్యారో తమ సొంత అనుభవాన్నుంచి తెలియజేసే పయినీర్లను ఇంటర్వ్యూ చేయండి. “క్రమ పయినీరు నమూనా షెడ్యూల్” శీర్షికను విశ్లేషించండి. చక్కని మంచి ప్రణాళికను వేసుకోవడం పయినీరు సేవలో గడపాల్సిన గంటల లక్ష్యాన్ని చేరుకోవడంలో ఎలా తోడ్పడగలదో నొక్కి చెప్పండి. పయినీరు దరఖాస్తు పెట్టుకోవాలని ఎవరైనా అనుకుంటే వారు ఈ కూటం అయిన తర్వాత ఒక దరఖాస్తును పొందవచ్చని ప్రకటించండి.
పాట 202 (1), ముగింపు ప్రార్థన.
ఆగస్టు 16తో ప్రారంభమయ్యే వారం
పాట 131 (22)
10 నిమి: స్థానిక ప్రకటనలు. ఆగస్టు నెలలో ఇక మిగిలివున్నవి రెండు వారాంతాలు మాత్రమే గనుక, ఆగస్టు నెల ముగియకముందే పరిచర్యలో పాల్గొనమని ప్రతిఒక్కరినీ ప్రోత్సహించండి. “క్రొత్త ప్రాంతీయ సమావేశ కార్యక్రమం”ను పునఃసమీక్షించండి. బాప్తిస్మం తీసుకొనడానికి ఆలోచించమని క్రొత్తవారిని ప్రోత్సహించండి. ప్రాంతీయ సమావేశపు ప్రతి కార్యక్రమానికి హాజరవ్వమని అందరినీ ప్రోత్సహించండి.
15 నిమి: స్థానిక అవసరాలు.
20 నిమి: శిష్యులను చేసే పనిలో మీరు భాగం వహిస్తున్నారా? ప్రేక్షకులతో చర్చ. ఎక్కువ మొత్తంలో సాహిత్యాలు అందించబడుతున్న దృష్ట్యా, ప్రజలు ఆ సాహిత్యాల నుంచి ప్రయోజనం పొందేలా మనం వారికి సహాయపడే ఉద్దేశంతో బైబిలు పఠనాలను ప్రారంభించాలన్నదే మన లక్ష్యమై ఉండాలి. మరిన్ని బైబిలు పఠనాలను నిర్వహించకుండా ప్రచారకులను ఆటంకపరుస్తున్న సమస్యలను గురించి వారిని వ్యాఖ్యానించమనండి: (1) బైబిలు పఠనం చేయించుకోవడానికి ఇష్టపడే ప్రజలను కనుగొనడం చాలా కష్టం. (2) ఆసక్తి చూపే కొంత మంది ప్రజలు తాము బైబిలు పఠనం తీసుకోవడానికి కూడా తీరికలేనంత బిజీగా ఉన్నామని చెబుతారు. (3) బైబిలు పఠనం ప్రారంభమైన తర్వాత, ఆ పఠనాన్ని తీసుకొంటున్న వ్యక్తితో దాన్ని క్రమంగా కొనసాగించేలా అతన్ని ఇంటి దగ్గర కనుగొనడం చాలా కష్టం. అలాగే, బైబిలు పఠన పని పట్ల కొంతమంది ప్రచారకులకు ఉన్న అనుచిత భావాలవైపు అవధానాన్ని నిలపండి: (1) ‘బోధకునిగా అర్హుణ్నని నేను భావించడంలేదు.’ (2) ‘వారం వారం బైబిలు పఠనాన్ని నిర్వహించేందుకు నాకు సమయం లేదు.’ (3) ‘మరొకరికి నేను కర్తవ్యనిబద్ధుడ్నై ఉండడానికి నేను కాస్త తటపటాయిస్తాను.’ (4) ‘పరిచర్యకు సంబంధించిన ఇతర రంగాల్లో భాగం వహించడంతో సంతృప్తి చెందుతున్నాను.’ శిష్యులను చేసే పనిలో స్వయంగా పాల్గొనేలా ఆ ఆటంకాలను ఎలా అధిగమించవచ్చన్న విషయంపై అనుకూలమైన సలహాలను ఇవ్వండి. బైబిలు పఠన పనిలో సఫలీకృతులైన ప్రచారకులు తాము పొందిన ఆనందాన్ని తెలియజేయమనండి.—మే 1998 మన రాజ్య పరిచర్య ఇన్‌సర్ట్ 3-8, 15 పేరాలు చూడండి.
పాట 100 (6), ముగింపు ప్రార్థన.
ఆగస్టు 23తో ప్రారంభమయ్యే వారం
పాట 94 (5)
10 నిమి: స్థానిక ప్రకటనలు.
15 నిమి: వివాహ పవిత్రతను గుణగ్రహించేలా, ఆసక్తి చూపిస్తున్న క్రొత్త వ్యక్తులకు సహాయం చేయండి. తర్కము పుస్తకం (ఆంగ్లం) 248-50 పేజీల ఆధారంగా ప్రేక్షకులతో పెద్దచేసే చర్చ. రాజ్య సందేశానికి ప్రతిస్పందించినా చట్టబద్ధంగా వివాహం చేసుకోకుండా కలిసి జీవిస్తున్నందున పురోభివృద్ధి సాధించడంలో అంతంత మాత్రంగానే ఉన్న దంపతులు మనకు ఎదురౌతారు. క్రైస్తవులు గౌరవప్రదమైన వివాహ జీవితానికి ఎందుకు హత్తుకొని ఉండాలో అన్న విషయాన్ని అర్థం చేసుకునేలా వారికి ఎలా సహాయం చేయాలో చర్చించండి. (తేజరిల్లు! (ఆంగ్లం) జనవరి 8, 1992, పేజీలు 26-7 చూడండి.) అలాంటి దంపతులు తమ వివాహాన్ని చట్టబద్ధంగా నమోదు చేసుకోనంత వరకూ వాళ్ళెందుకు సంఘంలో భాగంకాలేరో అన్న విషయాన్ని వాళ్లు గ్రహించేలా వారికి సహాయపడేందుకు నేర్పుగా ఏమి చెప్పవచ్చో సలహాలనివ్వండి.
20 నిమి: “బౌద్ధమతస్థునికి మీరేమి చెప్తారు?” ప్రశ్నాజవాబులు. మనకు అపరిచితమైన పద్ధతులనూ, ఆచారవ్యవహారాలనూ కల్గివున్న క్రైస్తవేతర మతానికి చెందిన ప్రజలు నివసించే ప్రాంతంలో ఎవరినైనా కలుసుకున్నప్పుడు వారికి ఏం చెప్పాలో తెలియక కొట్టుమిట్టాడతాం. దీనిపై వెలువడే ఐదు భాగాల పరంపర శీర్షికల్లో ఇది మొదటిది. బాగా సిద్ధపడిన అందింపును ప్రదర్శించండి. బౌద్ధ మతంపై మరింత సమాచారం కోసం ఫిబ్రవరి 1998 మన రాజ్య పరిచర్య ఇన్‌సర్ట్; బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను 13వ పేజీ; దేవుని కొరకు మానవజాతి అన్వేషణ (ఆంగ్లం) పుస్తకంలోని 6వ అధ్యాయం చూడండి.
పాట 133 (3), ముగింపు ప్రార్థన.
ఆగస్టు 30తో ప్రారంభమయ్యే వారం
పాట 99 (8)
10 నిమి: స్థానిక ప్రకటనలు. ఆగస్టునెల క్షేత్ర సేవా రిపోర్ట్‌లను ఇవ్వమని అందరికీ గుర్తు చేయండి. సెప్టెంబరు 6నాటికి రిపోర్టులన్నింటినీ లెక్కించబడేలా తమ పుస్తక పఠన గుంపుల్లోని వారంతా తమ తమ రిపోర్టులను ఇచ్చారా లేదా అని పుస్తక పఠన నిర్వాహకులు చెక్ చేయాలి.
17 నిమి: మనం మన సహోదరులను ప్రేమిస్తాం. డిసెంబరు 1, 1995, కావలికోట, 15-17 పేజీలు, 7-11 పేరాలపై ఆధారపడి పెద్ద ఇచ్చే ప్రసంగం, ప్రేక్షకులు కూడా చర్చలో పాల్గొంటారు. మనం మన సహోదరులను గురించి బాగా తెలుసుకొన్నప్పుడు, ప్రోత్సాహాన్ని పంచుకొన్నప్పుడు, శ్రమలను సహించేందుకు ఒకరినొకరు సహాయం చేసుకున్నప్పుడు, మనం ఆనందించే పరస్పర ప్రయోజనాలను నొక్కి తెలియజేయండి. మరింత విస్తృతస్థాయిలో దాన్నెలా చేయవచ్చో సలహానివ్వండి. ఇతరులనుంచి వచ్చిన ప్రేమపూర్వకమైన ప్రోత్సాహం ద్వారా తామెలా సేదదీర్పును, బలాన్ని పొందారో చూపించే అనుభవాలను తెలియజేయమని ప్రేక్షకులను ఆహ్వానించండి.
18 నిమి: మీ నిరీక్షణను గూర్చి హేతువునివ్వండి. హైస్కూల్‌లో చదువుకుంటున్న ఒకరిద్దరు మాదిరికరమైన టీనేజర్లను పెద్ద ఇంటర్వ్యూ చేస్తారు. లోక స్నేహితులు, తమ కార్యకలాపాల్లో మన టీనేజర్లు వాళ్లతో చేరడాన్ని ఎందుకు ఎంపిక చేసుకోరో తెలుసుకోవాలని అనుకుంటారు. అలా తెలుసుకోవాలనే పరిస్థితులతో మన టీనేజర్లు ఎడతెగక పోరాడాల్సి వస్తోంది. తమ బైబిలు ఆధారిత నమ్మకాలను వివరించేందుకు అలాంటి అవకాశాలను ఉపయోగించుకుంటున్నప్పుడు, మన యువత వాటిని దృఢంగా తిరస్కరించాల్సిన అవసరం ఉంది. పొగాకునో, మాదకద్రవ్యాల్నో తమను కూడా తీసుకోమని ఒత్తిడి చేసినట్లైతే దానికి తామెలా ప్రతిస్పందించవచ్చో ఒక గుంపు చర్చిస్తుంది. యువత అడుగు ప్రశ్నలు (ఆంగ్లం) అనే పుస్తకం 277-81 పేజీల్లో ఉన్న సమాచారాన్ని పునఃసమీక్షిస్తారు. సరియైనదాన్ని చేయాలని తాము చేసుకున్న తీర్మానాన్ని ఎలా సమర్థిస్తామన్న విషయం, ఒక రక్షణవలయంగా పనిచేస్తుందనీ, మంచి సాక్ష్యాన్ని ఇస్తుందనీ వివరించండి.
పాట 129 (18), ముగింపు ప్రార్థన.