పయినీరింగ్ కొరకైన ద్వారం మీ కోసం ఇప్పుడు తెరవబడి ఉందా?
1 మన 1999 వార్షిక లేఖనం, మనం ఇప్పటికీ యెహోవా “రక్షణ దినమందు” ఉన్నామని గుర్తు చేస్తుంది. (2 కొరిం. 6:2) కానీ, ఆయన రక్షణ దినము త్వరలోనే ముగుస్తుంది. తర్వాత ఆయన “తీర్పుదినము” ప్రారంభమవుతుంది. (2 పేతు. 2:9) మానవజాతి రక్షణ కోసం యెహోవా అవకాశాన్ని పెంచే కొలది ప్రతిస్పందించేవారి సంఖ్య అంతకంతకూ పెరగడాన్ని చూడటం ఎంత పులకరింతగా ఉందో!
2 ప్రతిస్పందించే వారిని ఆలస్యం కాకముందే చేరుకోవాలనే సవాలును ఎదుర్కోవడానికి యెహోవా ప్రజలు చాలా శ్రమించారు. శ్రమించడమంటే, చాలా మంది రాజ్య ప్రచారకుల విషయానికి వస్తే, దీని అర్థం పయినీరు సేవలోకి ప్రవేశించడమే. పయినీరింగ్ కొరకైన ద్వారం ఇప్పుడు మీ కొరకు తెరవబడి ఉందా? మేము ఎందుకు అడుగుతున్నాం?
3 మెప్పుదల వ్యక్తంచేయబడింది: జనవరి 1999 మన రాజ్య పరిచర్యలో ప్రకటించినట్లుగా క్రమ, సహాయ పయినీర్లు చేరుకోవలసిన గంటల కోటా తగ్గింది. క్రొత్త కోటాను చేరుకోవటానికి క్రమ పయినీర్లు నెలకు 70 గంటలనూ ఒక సేవా సంవత్సరానికి 840 గంటలనూ పూర్తిగా ఉపయోగించవలసిన అవసరముంది. సహాయ పయినీర్లు సేవలో ప్రతి నెలా 50 గంటలను వెచ్చిస్తారు. ఈ క్రిందివి, ఈ సవరింపుల ఫలితంగా మెప్పుదలను వ్యక్తపరుస్తూ వచ్చిన అనేక మెప్పుదలా వ్యక్తీకరణల్లో కేవలం కొన్ని మాత్రమే:
“మన పరలోకపు తండ్రి నుండి వచ్చిన ఎంతటి ఆశీర్వాదపు బహుమానం!”
“ఈ ఏర్పాటు వల్ల కలిగిన ఆనందం, ప్రేమ, కృతజ్ఞతలతో కూడిన భావోద్వేగాలను మాటల్లో వివరించలేము!”
“అది మన షెడ్యూల్‌ను మరింత సులభంగా చేరుకొనేలా చేస్తుంది!”
“అనేకమంది పూర్తికాల పరిచర్యను తీసుకోవాలనీ, యెహోవాను సేవించటం ద్వారా వచ్చే ఆశీర్వాదాలను పెద్ద మొత్తంలో అనుభవించాలన్నదే మా ప్రార్థన.”
4 దేవుని రక్షణ దినపు పరాకాష్ఠకు మనం సమీపిస్తూ ఉండగా, దేవుడు తన ప్రజల నుంచి బలమైన చివరి స్తుతి కేకలను కోరుతున్నాడని రుజువవుతుంది. (1) రాజ్య ప్రచారకుల సంఖ్యలో వస్తున్న క్రమమైన పెరుగుదల ద్వారా మరియు (2) ప్రతి ఒక్క వ్యక్తి రాజ్య ప్రకటనా పనిలో ఆయన ఏమి చేయగలడో దాని విషయంలో అభివృద్ధికి ప్రయత్నించడం ద్వారా ఈ సందేశం మరింత విస్తారంగా, మరింత అధికంగా ప్రచురించబడుతోంది. ‘వృద్ధి కలుగజేయు వాడైన’ యెహోవా, రక్షణను అంగీకరించిన వారిందరి సుముఖతగల స్ఫూర్తిని ఆశీర్వదించడం ద్వారా రెండు విధాల్లోనూ సఫలతను తీసుకువచ్చాడు.—1 కొరిం. 3:6, 7; కీర్త. 110:3.
5 వ్యర్థం చేసుకోవద్దు: “మేమాయన [యెహోవా]తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసికొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము” అని తన తోటి క్రైస్తవులకు పౌలు ఇచ్చిన హెచ్చరిక యెహోవా రక్షణ దినానికి సంబంధించినది. ఇతరుల రక్షణ కోసం ప్రతి అవకాశంలోనూ పని చేసేందుకు ఇది “మిక్కిలి అనుకూలమైన సమయము” అని మనం చూస్తే దాన్ని “వ్యర్థం చేసుకోము.” (2 కొరిం. 6:1, 2) పౌలు మాటలు ఈ రోజు మరింత అత్యవసర భావాన్ని స్ఫురింపజేస్తున్నాయి. యెహోవా మీద హృదయపూర్వకమైన ప్రేమగల క్రైస్తవులు, ఆయన తమకు అప్పగించిన పరిచర్యలో సాధ్యమైనంత మేరకు పూర్తిగా పాల్గొనటాన్ని ఒక ఆధిక్యతగా భావిస్తారు. క్రమ పయినీరుగా, మీరు ఇప్పుడు పరిచర్యలో మరింత ఎక్కువ భాగం వహించగలుగుతారా?
6 ఇది సహేతుకమైన లక్ష్యం: ఇండియాలో, సెప్టెంబరు 1కెల్లా 1000 మంది క్రమ పయినీర్లు పయినీర్ జాబితాలో ఉండడాన్ని చూడాలన్నదే మన లక్ష్యం. అది సహేతుకమైన, సాధించగల లక్ష్యమని మేం నమ్ముతున్నాం. మనం ఎందుకంత నమ్మకాన్ని కలిగివున్నాము? మార్చి 1997లో 1,715 మంది సహోదర సహోదరీలు, ఏప్రిల్ 1998లో దాదాపు 2,170 మంది సహోదర సహోదరీలు సహాయ పయినీరింగ్ చేశారని చూశాం. చాలామంది 60గంటలు రిపోర్ట్ చేశారు—క్రమ పయినీర్ల క్రొత్త కోటాకు కేవలం 10 గంటలు మాత్రమే తక్కువ ! సహాయ పయినీరింగ్ చేసిన వీరిలో కేవలం 200 మందే ఈ సేవా సంవత్సరం ముగిసేముందు క్రమ పయినీరు జాబితాలో చేరినా, సెప్టెంబరును 1000 లేక అంతకన్నా ఎక్కువ మంది పూర్తికాల పయినీర్లతో ప్రారంభించవచ్చు!
7 ఒక షెడ్యూల్ అవసరం: క్షేత్రసేవలో నెలకు 70 గంటలు చేరుకోవడం ఇప్పటికీ మీకు కాస్త కష్టంగా అనిపిస్తుందా? బహుశా వారానికి 17 గంటల లెక్కన ఆలోచించడం సహాయకరంగా ఉండవచ్చు. ప్రక్క పేజీలో ఉన్న నమూనా షెడ్యూళ్ళను ఉపయోగించి మీ వ్యక్తిగత పరిస్థితులకు సరిపోయేటువంటి, క్రమ పయినీరు షెడ్యూల్‌ను తయారుచేసుకొనేందుకు ప్రయత్నించండి. మీ షెడ్యూల్ ప్రకారం పనిచేస్తూ, అనుభవజ్ఞులైన పయినీర్లు వ్యక్తిగత, కుటుంబ బాధ్యతలతో తమ పయినీరు సేవను ఎలా సమతుల్యంగా చేసుకుంటారో అనే దానిపై సలహాలు అభిప్రాయాలను తెలుసుకొనేందుకు వారితో మాట్లాడండి. మీ సర్క్యూట్‌లోని పయినీర్లు సేవా పనిలో ప్రతి వారం షెడ్యూల్‌ను ఏవిధంగా వేసుకొంటున్నారో మీ ప్రాంతీయ పైవిచారణకర్తను అడగండి. తర్వాత, పయినీరింగ్ చేయాలన్న మీ పథకాలు ఆశీర్వదించబడేలా యెహోవా వైపు చూడండి.—సామె. 16:3.
8 దానిని కుటుంబ ప్రోజెక్ట్‌గా చేయండి: పయినీరింగ్ని కుటుంబ ప్రోజెక్ట్‌గా చేయడాన్ని గురించి మీరు ఆలోచించారా? మీరు కుటుంబ సమేతంగా కూర్చొని—జాగ్రత్తగా ప్లాన్ వేసుకోవడం ద్వారా మంచి సహకారం ద్వారా—మీ కుటుంబంలో ఒకరు గానీ ఇద్దరు గానీ పయినీరింగ్ ఎలా చేయవచ్చు అనే దాని గురించి చర్చించండి. కొందరు, తమ పరిస్థితుల గురించి సత్యసంధంగా మదింపు చేసుకున్న తర్వాత క్రమ పయినీరింగ్ చెయ్యడం తమకు ఇప్పుడు వీలు కాదని కనుగొంటారన్నది అర్థం చేసుకోదగిన విషయమే. అలాగైతే పయినీరింగ్ను భవిష్యద్ లక్ష్యంగా చేసుకోండి. మీరు క్రమ పయినీరింగ్ను ప్రారంభించేందుకు ఖచ్చితమైన ఒక తేదీని నిర్ణయించుకొని, ఆ తేదీనే ప్రారంభించగలిగేలా పథకాలు వేసుకోవడం మొదలుపెట్టండి. బహుశా మీరు క్రమ పయినీర్ సేవా లక్ష్యాన్ని కాలక్రమేణా చేరుకొనేందుకు సంవత్సరంలో అనేక సార్లు సహాయ పయినీర్‌గా చేయవచ్చు.
9 ఇప్పుడు ఇండియాలో, లిస్ట్‌లో ఉన్న 800 కంటే ఎక్కువ మంది క్రమ పయినీర్లు వేర్వేరు పరిస్థితుల్లో ఉన్నారు. వీరిలో 100 మంది ఒంటరి వాళ్ళు, దాదాపు 200 మంది 50 ఏండ్లు దాటినవాళ్ళు. దగ్గరదగ్గర 500 మంది 20-50 ఏండ్లలోపువాళ్ళు, వాళ్ళలో అనేక మందికి కుటుంబ, సంఘ బాధ్యతలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా పయినీరింగ్ కోసం, ‘అనుకూల సమయాన్ని కొనుక్కుంటూ’ ఉన్నారు. ఇలా చేయడమంటే, చాలామంది విషయానికి వస్తే, నిరాడంబర జీవితాన్ని గడుపుతున్నారనే. నిరాడంబరంగానే అయినా మరింత సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నారనే.—కొలొ. 4:5.
10 మీ జీవితాన్ని సరళం చేసుకోవల్సిన అవసరముందా? మీ జీవితాన్ని సరళం చేసుకోవడం మీరు పయినీరింగ్ చేయగల ద్వారాన్ని తెరిచేందుకు కీలకం కావచ్చు. అనవసరమైన గదులు, అలంకార వస్తువులు ఉంటే వాటిని జాగ్రత్తగా ఉంచటం కోసం ఎక్కువ సమయమూ, డబ్బూ అవసరం అవుతుంది. అదొక పెద్ద పని కూడా. అలా అనవసరమైనవి ఉన్న ఒక పెద్ద ఇల్లులా ఉందా మీ జీవితం? నిరాడంబర జీవితాన్ని అవలంబించడం బహుశా పయినీరింగ్ చేసేందుకు అనుమతించవచ్చు. లౌకిక ఉద్యోగంలో మీరు వెచ్చించే సమయాన్ని మీరు తగ్గించగలరా? అత్యవసరం కాని పనుల నుండి సమయాన్ని కొనుక్కోగలరా లేక వినోదానికి గడిపే సమయంలో మరింత సమతూకాన్ని చూపిస్తారా?
11 బైబిలు, “అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము” అని 1 తిమోతి 6:8 మనలను ఉద్బోధిస్తుంది. యెహోవా సేవలో మనం మన శాయశక్తులా చేసేందుకు, తక్కువలోనే సంతృప్తిగా ఉండడం ప్రాముఖ్యం, ఆధ్యాత్మిక ఆసక్తులకు ప్రథమ స్థానమివ్వడాన్ని అది సులభతరం చేస్తుంది. (మత్త. 6:22, 33) 1998 వార్షిక పుస్తకము (ఆంగ్లం) 104వ పేజీలో జపాన్ నందలి రిపోర్ట్‌లో, ఆ దేశంలో ఎందుకంత చక్కటి పయినీర్ స్ఫూర్తి ఉందో అనే దానిపై అనేక సూచనలు ఇవ్వబడ్డాయి. ఒకటి చూద్దాం: “సాధారణంగా, జపనీయుల ఇళ్ళు చాలా నిరాడంబరంగా ఉంటాయన్నది నిజం, కనుక ఇంటిని శుభ్రం చేయడానికి తక్కువ సమయం పడుతుంది, చాలా మటుకు వారి జీవితాలను కూడా నిరాడంబరంగా ఉంచుకోవడం అక్కడి సాంప్రదాయం.” 1 తిమోతి 6:8లోని ప్రాథమిక భావం అది కాదా?
12 ప్రపంచ వ్యాప్తంగా, యెహోవా రక్షణ దినం ముగింపుకు రాక ముందు, దేవుని సేవకులు సువార్తను మునుపెన్నటికన్నా మరింత అధికంగా ప్రకటిస్తున్నారు. మెచ్చుకోదగిన రీతిగానే, గత సంవత్సరం 7,00,000 మంది ప్రతినెలా, ఏదో ఒక రూపంలోని పయినీరు సేవలో భాగం వహించారు. వారితోపాటు చేరేందుకు మీరు మీ జీవితంలో సర్దుబాట్లు చేసుకోగలరా? “యినీరింగ్ కొరకైన ద్వారం మీ కోసం ఇప్పుడు తెరవబడి ఉందా?” అనే ప్రశ్నకు సమాధానమిచ్చేటప్పుడు జాగ్రత్తగానూ, ప్రార్థనాపూర్వకంగాను మీ పరిస్థితులను పరిశీలించుకోమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.
[3వ పేజీలోని బ్లర్బ్]
లక్ష్యం: 1000 మంది క్రమ పయినీర్లు!
[4వ పేజీలోని బాక్సు]
క్రమ పయినీరు నమూనా షెడ్యూళ్ళు
అవసరమైన గంటలు: వారానికి 17
శుక్ర, శని, ఆదివారాలు
రోజు గంటలు
శుక్రవారం 8
శనివారం 6
ఆదివారం 3
మొత్తం గంటలు: 17
మంగళవారం, గురువారం, శనివారం
రోజు గంటలు
మంగళవారం 7
గురువారం 7
శనివారం 3
మొత్తం గంటలు: 17
సోమ, బుధవారాలు, శుక్ర ఆదివారాలు
రోజు గంటలు
సోమవారం 5
బుధవారం 5
శుక్రవారం 5
ఆదివారం 2
మొత్తం గంటలు: 17
రెండు సాయంత్రాలు, శని ఆదివారాలు
రోజు గంటలు
సోమవారం 3
బుధవారం 3
శనివారం 8
ఆదివారం 3
మొత్తం గంటలు: 17
మీ సొంత క్రమపయినీరు షెడ్యూల్‌ను వేసుకోండి
రోజు గంటలు
సోమవారం
మంగళవారం
బుధవారం
గురువారం
శుక్రవారం
శనివారం
ఆదివారం
మొత్తం గంటలు: 17