యెహోవా దేవుని సుందరమైన నామాన్ని ఉన్నతంగా ఘనపర్చడం
1 పాపం చేసేలా మన మొదటి తల్లిదండ్రులను సాతాను ప్రేరేపించినప్పుడు, అతడు దేవుని నామాన్ని అప్రతిష్టపాలు చేశాడు. యెహోవా ఆదాముతో అబద్ధం చెప్పాడన్న అభిప్రాయాన్ని వారిలో కుయుక్తిగా ప్రవేశపెట్టాడు. (ఆది. 3:1-5) తన మాటను నెరవేర్చే దేవుని సామర్థ్యంతో దైవికనామము ముడిపెట్టబడివున్నది కాబట్టి, సాతాను చేసిన ఆరోపణ నీచాతి నీచమైన అపవాదైవుంది. తన దైవిక సంకల్పాన్ని అంతకంతకూ పురోభివృద్ధిదాయకంగా నెరవేర్చడం ద్వారా, యెహోవా తన నామానికి కలిగిన నిందను తొలగించి, దాన్ని సుందరమైనదిగా చేసుకున్నాడు.—యెష. 63:12-14.
2 ‘తన నామం పెట్టబడిన’ ప్రజలుగా యెహోవా ఎవరినైతే పిలిచాడో ఆ ప్రజలం మనమే. (అపొ. 15:14, 16) అది, ఆ నామం పరిశుద్ధపర్చబడడం గురించి మనమెలా భావిస్తామో చూపించుకునేందుకు మనకు అవకాశాన్ని ఇస్తుంది. మంచిదీ, దయగలదీ, ప్రేమపూర్వకమైనదీ, కనికరంగలదీ, నీతిమంతమైనదీ అయిన ప్రతీదానికి యెహోవా నామం ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆ నామం నిజంగా సుందరమైనదని మనం కనుగొంటాం. మనం దేవుని మహిమాన్విత నామ గొప్పతనం పట్ల భక్తిపూర్వక భయంతో నింపబడతాం. (కీర్త. 8:1; 99:3; 148:13) ఇది, ఏం చేసేలా మనల్ని ప్రేరేపించాలి?
3 దేవుని నామాన్ని పరిశుథ్థపరచడం: అత్యంత పరిశుద్ధమైన దేవుని నామాన్ని అంతకన్నా మరింతగా ఎవ్వరూ పరిశుద్ధపరచలేరు. కానీ మన శుభ్రమైన ప్రవర్తన ద్వారా, రాజ్య ప్రచార పనిద్వారా మనం దేవుని నామాన్ని అత్యంత ఘనమైనదిగా దృష్టిస్తున్నామని ప్రదర్శించగలం. “యెహోవాను స్తుతించుడి ఆయన నామమును ప్రకటించుడి జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి” అని మనం తెలియజేద్దాం. (యెష. 12:4) మనం దీన్ని ఎలా చేయగలం?
4 యెహోవా నామాన్నీ, ఆ నామం వేటికైతే ప్రాతినిధ్యం వహిస్తుందో వాటన్నింటి గురించీ ప్రకటించడానికి మనకున్న ప్రతి అవకాశాన్నీ మనం సద్వినియోగం చేసుకోవచ్చు. నియతంగానైనా లేక అనియతంగానైనా, ఇంటింటి పరిచర్యలోనైనా లేక షాపు షాపుకీ చేసే పరిచర్యలోనైనా, వీధి సాక్ష్యమైనా లేక టెలిఫోన్ సాక్ష్యమైనా సరే, మన ప్రకటనా కార్యక్రమం యెహోవాను ఘనపరుస్తుంది. వినడానికి సుముఖత చూపించే ఆసక్తిగల వ్యక్తులను మనం కనుగొన్నప్పుడు, వారిని పునర్దర్శించి, యెహోవాను గురించి ఇంకా ఎక్కువ బోధించేందుకు నిర్దిష్టమైన ఏర్పాట్లను చేసుకోవాలి. మనం వాళ్ళను తిరిగి కలుస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకొని, గృహబైబిలు పఠనాలను ప్రారంభించడానికి చేసే మన ప్రయత్నాల్లో మనం పట్టుదల కలిగివుండాలి. సంతోషకరంగా, ప్రతి సంవత్సరం వందలాది వేలాదిమంది యెహోవా సుందరమైన నామాన్ని తెలుసుకొంటున్నారు, గౌరవిస్తున్నారు, పరిశుద్ధపరుస్తున్నారు.
5 దేవుని నామాన్ని పరిశుద్ధపర్చే పనిలో మనం హృదయపూర్వకంగా పాల్గొనడం, ఏదెను వనంలో సాతాను లేవనెత్తిన వివాదాంశంలో మన స్థానం ఏమైవుందన్న విషయాన్ని స్పష్టంగా చూపిస్తుంది. అది, మనం చేయగలిగే అత్యంత ప్రశస్తమైన, గౌరవపూర్వకమైన పనైవుంది. సుందరమైన యెహోవా నామాన్ని ఉన్నతంగా ఘనపర్చి, ఆసక్తిదాయకంగా స్తుతిద్దాం!—1 దిన. 29:13.