కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/99 పేజీ 4
  • “విషయానికి వద్దాం!”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “విషయానికి వద్దాం!”
  • మన రాజ్య పరిచర్య—1999
  • ఇలాంటి మరితర సమాచారం
  • జీవాన్ని కాపాడే మన పరిచర్యలో విజయవంతంగా పాల్గొనుట
    మన రాజ్య పరిచర్య—1993
  • దేవుని కుమారుడైన యేసుక్రీస్తును గూర్చి నేర్చుకోవడానికి ఇతరులకు సహాయపడండి
    మన రాజ్య పరిచర్య—1993
  • పత్రికలు అందించడానికి ఎలా సిద్ధపడాలి?
    మన రాజ్య పరిచర్య—2006
  • పరిచర్యలో బంగారు సూత్రాన్ని పాటించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1999
km 7/99 పేజీ 4

“విషయానికి వద్దాం!”

1 మీరు జాగ్రత్తగా సిద్ధపడిన అందింపును మధ్యలో ఆపుతూ, గృహస్థుడు ఎప్పుడైనా, “మీకు ఏం కావాలి? విషయానికి రండి!” అన్నాడా? అలాంటి అనుభవం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

2 నేడు అనేక మంది ప్రజలకు సహనం లేదు. మనం ఎవరమో, ఎందుకు అక్కడికి వెళ్ళామో వాళ్ళు తెలుసుకోవాలనుకుంటారు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినదాని ఉద్దేశం, బైబిలు విషయాలను చర్చించాలన్నదేనని వాళ్ళు తెలుసుకున్నప్పుడు వారు బహుశా వినడానికి నిరాకరించవచ్చు. బైబిలును చదవడం, ఆధ్యాత్మిక విషయాలను గురించి సంభాషించడం అనేవి చాలామంది జీవితాల్లో ప్రాముఖ్యమైన విషయాలు కావు. మనతో బైబిలు అంశాలను చర్చించేందుకు కొన్ని నిమిషాలు తీసుకోవాలని అలాంటి గృహస్థులను ఎలా ఒప్పించగలం?

3 ఏది బాగా పనిచేస్తుంది: కీలకం ఏమిటంటే గృహస్థునికి సంబంధించిన సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలను బైబిలు ఇస్తుందని ఆయనకు చూపించడం, అదీ వీలైనంత తక్కువ మాటల్లో చూపించడం. గృహస్థుడ్ని ఆలోచింపజేసేలా రూపకల్పన చేయబడిన నిర్దిష్ట ప్రశ్నా, ఆ తర్వాత, ఆ ప్రశ్నకు జవాబునిచ్చే లేఖనాన్ని ఉపయోగించడమూ అత్యంత ఫలకరమైన అందింపు యొక్క ప్రత్యేకతలు. ఈ క్రింద ఇవ్వబడిన సూచనల్లో కొన్నింటి ప్రకారం చేయడానికి ప్రయత్నించడంలో మీరు ఆనందించవచ్చు. మనం ఒకవైపు గృహస్థుని ఆసక్తిని రేకెత్తిస్తూనే, త్వరలోనే ‘విషయానికి వెళ్ళేందుకు’ మనకు సహాయపడేలా అవి రూపకల్పన చేయబడ్డాయి.

4 ఆసక్తి లేదని తరచూ ప్రజలు చెప్పే ప్రాంతంలో పని చేస్తున్నప్పుడు వారిని వ్యక్తిగతంగా ఇమిడ్చే ఒక ప్రశ్నను వేయవచ్చు:

◼ “మనం తర్వాతి సహస్రాబ్దానికి సమీపిస్తుండగా, మీకు ఆశాభావం కలుగుతోందా, సందేహం కలుగుతోందా? [ప్రతిస్పందించనివ్వండి.] ఈ రోజు మనం చూస్తున్న పరిష్కరించలేని సంఘటనలను, అలాగే వాటి పరిణామాలను బైబిలు ముందుగానే సూచించింది.” 2 తిమోతి 3:1, 2, 5 మరియు సామెతలు 2:21, 22 చదవండి.

◼ “ఈ దేశంలో ఆరోగ్య సంరక్షణను గూర్చిన చింత అధికంగా ఉంది. ఆరోగ్య సమస్యలన్నింటినీ శాశ్వతంగా పరిష్కరిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడని మీకు తెలుసా?” ప్రకటన 21:3, 4 చదవండి.

◼ “ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరూ బైబిలు సూత్రాలను పాటించినట్లయితే మన సమాజం ఎలా ప్రయోజనం పొందుతుందని మీరు అనుకుంటున్నారు?” మత్తయి 22:37-39 చదవండి.

5 రాజ్యసువార్తను ప్రకటించాలన్నది మన దౌత్యం కనుక, రాజ్యం దేన్ని నెరవేరుస్తుందనేదాని వైపుకు సాధ్యమైనప్పుడల్లా అవధానాన్ని మళ్ళించవచ్చు. మీరిలా చెప్పవచ్చు:

◼ “యావత్‌ ప్రపంచానికి ఒకే ప్రభుత్వం ఉంటుందని ప్రపంచమంతటిలో ప్రాచీన పుస్తకమైన బైబిలు ముందే చెప్పిందని మీకు తెలుసా?” దానియేలు 2:44 చదవండి.

◼ “ఒకవేళ యేసుక్రీస్తు ఈ భూమిని పరిపాలిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయని మీరనుకుంటున్నారు?” కీర్తన 72:7, 8 చదవండి.

6 మతనిష్ఠగల ప్రజలున్న ప్రాంతంలో, ఈ క్రింది ఉపోద్ఘాతాల్లో ఒక దాన్ని మీరు ప్రయత్నించగలరు:

◼ “చాలా మంది ప్రజలు మతం వల్ల, శరీర రంగువల్ల, స్త్రీ, పురుష భేదాల వల్ల బాధలననుభవిస్తున్నారు. అలా అన్యాయంగా బాధలుపెట్టడాన్ని గురించి దేవుడు ఎలా భావిస్తాడని మీరు అనుకుంటున్నారు?” అపొస్తలుల కార్యములు 10:34, 35 చదవండి.

◼ “యేసుక్రీస్తు తన దినాల్లో చాలా అద్భుతాలు చేశారని మనకు తెలుసు. ఒక అద్భుతాన్ని చేయమని మీరు ఆయనను అడిగేటట్లయితే, ఏ అద్భుతాన్ని చేయమని అంటారు?” కీర్తన 72:12-14, 16 చదవండి.

7 ఒకవేళ గృహస్థుడు తలుపు తెరిచేందుకు విముఖత చూపించినట్లయితే, బహుశా ఇలా చెప్పడం ద్వారా మీరు సంభాషణను ప్రారంభించవచ్చు:

◼ “ఈనాడు అనేకమంది ప్రజలు సమస్యలను గురించి వినీ వినీ విసిగి పోయారు. వాళ్ళు పరిష్కార మార్గాలను గురించి వినాలనుకుంటున్నారు. మీ విషయంలో కూడా అది నిజమనడంలో సందేహం లేదు. కానీ మన సమస్యలకు నిజమైన పరిష్కార మార్గాలను ఎక్కడ కనుగొనవచ్చు?” ప్రతిస్పందించనివ్వండి. 2 తిమోతి 3:16, 17 చదవండి.

8 ఎందుకు ప్రయత్నించి చూడకూడదు? తరచూ, గృహస్థుని ఆసక్తిని రేకెత్తించేందుకు కావలసిందల్లా, సరళమైన, క్లుప్తమైన ఒక ప్రశ్న వేయడమే. మునుపు వ్యతిరేకించిన ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళిన ఇద్దరు సహోదరీలలో ఒకరు, “ప్రభువు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ప్రార్థించేది ఏ రాజ్యం కోసమో మీరు గుర్తు పట్టగలరా?” అని ఆమెను అడిగిన తర్వాత, ఆమె వాళ్ళను తన ఇంట్లోకి ఆహ్వానించింది. ఆ ప్రశ్న ఆమెలో ఆసక్తిని రేకెత్తించింది, అలా ఆమె బైబిలు పఠనానికి అంగీకరించింది. ఆమె ఇప్పుడు యెహోవాకు సమర్పించుకున్న ఒక సేవకురాలు!

9 మీరు ఒక గృహస్థునితో మాట్లాడుతున్నప్పుడు, మీ వ్యక్తీకరణల్లో యథార్థత ఉండాలి. మీరు మీ హృదయంలో నుండి మాట్లాడండి. మనకు వారిపై నిజంగానే ఆసక్తి ఉందన్న నమ్మకం వాళ్ళకు కలిగినప్పుడు వాళ్ళు ప్రతిస్పందించే అవకాశం ఎక్కువగా ఉంది.—అపొ. 2:46, 47.

10 నేడు రాజ్యసువార్తను ప్రకటించే పని సవాలుతో కూడినది. కొంతమంది గృహస్థులు పరిచయంలేని వారిని అనుమానిస్తారు. ఇతరులు అనేక కార్యకలాపాలతో సతమతమైపోతూ ఉంటారు, వాళ్ళకు మనం చెబుతున్నది వినేందుకు సమయం ఉండదు. అయినా, మనం కనుగొనవలసిన అర్హులైన అనేకులు ఇంకా ఉన్నారనే నిశ్చయతను కలిగివుండగలము. (మత్త. 10:11) మన అందింపులు క్లుప్తంగానూ, “విషయానికి తీసుకువెళ్ళేవిగాను” ఉంటే, అలాంటివారిని వెదకడంలో మనం చేసే ప్రయత్నాలు మరింత విజయవంతమయ్యే అవకాశం ఉంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి