మార్చిలోని సేవా కూటాలు
మార్చి 1న ప్రారంభమయ్యే వారం
పాట 33 (4)
8 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేసిన ప్రకటనలు.
17 నిమి: “ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు మరణాన్ని జ్ఞాపకార్థముగా ఆచరించడం.” ప్రశ్నా, జవాబులు. అలాగే కావలికోట ఫిబ్రవరి 1, 1997 11-12 పేజీలు, 10-14 పేరాలలోని వ్యాఖ్యానాల్ని చేర్చండి. మనకి విమోచనని అనుగ్రహించేలా యెహోవా దేవునికున్న గొప్ప ప్రేమ ఆయనను ఎలా కదిలించిందన్న దాన్ని నొక్కి చెప్పండి.
20 నిమి: ఏప్రిల్, మే నెలల్లో సహాయ పయినీరు సేవ చేయడానికి మనల్ని బలవంతపెట్టే కారణాలు. సహాయ పయినీరు సేవచేసే విషయాన్ని అందరూ గంభీరంగా తలంచాలని ఉద్బోధిస్తూ, సేవా పైవిచారణ కర్త ఇచ్చే ప్రసంగమూ, ప్రేక్షకులతో చేసే చర్చ. క్రమ, సహాయ పయినీర్లు వెచ్చించాల్సిన గంటల విషయంలో మన రాజ్య పరిచర్య జనవరి 1999, 3వ పేజీనందు ఇవ్వబడిన సవరింపులను సమీక్షించండి. ఈ సవరింపులు, ఇంకా అనేకమంది పూర్తికాల సేవాధిక్యతను ఆనందించగలిగేలా చేస్తుంది. ఇతరులకు ప్రకటించడంలో మనల్ని మనం ఉపయోగించుకునేలా, క్రీస్తు బలి అర్పణపట్ల మనకున్న అభినందన మనల్ని ఎలా బలవంతపెడుతుందో వివరించండి. (2 కొరిం. 5:14, 15) ఈ సంవత్సరం, జ్ఞాపకార్థదినం ఏప్రిల్ మొదటి తారీఖున వస్తుంది. విస్తృతపర్చబడిన సేవా కార్యక్రమం కోసం ఈ నెలంతా కేటాయించడానికి రాజ్యప్రచారకులందరికీ ఇది ఎంత చక్కని ఉత్ప్రేరకమో కదా! సహాయ పయినీరు సేవకి సంబంధించిన సమాచారమున్న మన రాజ్య పరిచర్య ఫిబ్రవరి 1997, మార్చి 1998 సంచికలలోని ఇన్‌సర్ట్‌లలో నుండి ఎంపిక చేయబడిన ఉన్నతాంశాలను సమీక్షించండి. వాటిలో ఉన్న నమూనా షెడ్యూళ్లను మీకు అనుకూలంగా మార్చుకోవచ్చేమో చూసుకోండి. ఇతరులతో కలిసి పరిచర్యలో పాల్గొనేందుకు ఎక్కువ అవకాశాల్ని కల్పించే స్థానిక సేవా ఏర్పాట్లను పునఃసమీక్షించండి. ఈ కూటం అయిపోయిన తర్వాత, సహాయ పయినీరు దరఖాస్తులను తీసుకొనమని ప్రచారకులను ప్రోత్సహించండి.
పాట 44 (6), ముగింపు ప్రార్థన.
మార్చి 8తో ప్రారంభమయ్యే వారం
పాట 52 (11)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్ రిపోర్టు.
20 నిమి: “రమ్ము అని వారిని ఆహ్వానిద్దాం.” ప్రశ్నా జవాబులు. కొత్తగా ఆసక్తి చూపేవారిని సంఘ కూటాలకు ఎల్లప్పుడూ ఆహ్వానించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పండి. జ్ఞానము పుస్తకం పేజి 159, పేరా 20లో, అలాగే 161-3 పేజీలు 5-8 పేరాల్లో ఉన్న సమాచారాన్ని ఉపయోగిస్తూ, ఆసక్తి గల వ్యక్తితో చేసే ఒక చర్చను ప్రదర్శించండి. ఏప్రిల్ 1న జరిగే జ్ఞాపకార్థదిన ఆచరణకు హాజరయ్యేలా బైబిలు విద్యార్థులకూ, ఆసక్తిగల ఇతరులకూ సహాయం చేసేందుకు ప్రత్యేక ప్రయత్నం చేయమని ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించండి. జ్ఞాపకార్థదిన ఆహ్వాన పత్రాన్ని చూపించి, దాన్ని ప్రభావవంతంగా ఎలా ఉపయోగించవచ్చో వివరించండి. అందరూ జ్ఞాపకార్థదిన ఆహ్వానపత్రాల్ని ఈ వారంలో పంచి పెట్టడం మొదలు పెట్టాలి.
15 నిమి: “సంఘకూటాల్లో—పూర్తి భాగం వహించేందుకు కుటుంబసభ్యులు ఎలా సహకరిస్తారంటే.” ఒక కుటుంబ చర్చ. వారు ఈ శీర్షికలోని ముఖ్యాంశాలపై వ్యాఖ్యానించి, కుటుంబ సమేతంగా కూటాలకు తాము ఎలా సిద్ధపడవచ్చో చర్చిస్తారు. కూటాల్లో భాగం వహించగల్గేలా తాము పరస్పరం ఎలా సహాయం చేసుకోగలరో, కుటుంబ సమేతంగా కూటాలకు సమయానికి హాజరవ్వాలంటే ఏమి చేయాల్సి ఉంటుందో వాళ్లు చర్చించుకుంటారు.
పాట 62 (23), ముగింపు ప్రార్థన.
మార్చి 15తో ప్రారంభమయ్యే వారం
పాట 56 (4)
10 నిమి: స్థానిక ప్రకటనలు.
15 నిమి: “పరిచర్య సేవకులు విలువైన సేవ చేస్తున్నారు.” సామర్థ్యంగల పరిచర్య సేవకుడు ఇచ్చే ప్రసంగం. మన పరిచర్య పుస్తకం 57-9 పేజీలలో ఉన్న ముఖ్యమైన విషయాలను సమీక్షించండి. స్థానికంగా ఉన్న సంఘంలో పరిచర్య సేవకులు ఎలా ఉపయోగించబడుతున్నారో వివరించండి.
20 నిమి: 1999 వార్షిక పుస్తకాన్ని (ఆంగ్లం) ఆస్వాదించడం. భార్యాభర్తల మధ్య చర్చ. వార్షిక పుస్తకము 1927లో మొట్ట మొదటిసారిగా పుస్తక రూపంలో ప్రచురించబడిందనీ, 70కన్నా ఎక్కువ సంవత్సరాల నుండి యెహోవాసాక్షుల ప్రపంచవ్యాప్త నివేదిక అందులో చేర్చబడుతూ ఉందనీ భర్త వివరిస్తాడు. 31వ పేజీలో ఉన్న “1998 వెరసి మొత్తాలు”లోవున్న ఉన్నతాంశాలను పునఃసమీక్షిస్తారు. ఆ తర్వాత 3-5 పేజీలలో ఉన్న “పరిపాలకసభ శ్రీముఖము”ను చర్చించి, అందులో ఇవ్వబడిన ప్రోత్సాహానికి తాము ఎలా ప్రతిస్పందిస్తారో వ్యాఖ్యానిస్తారు.
పాట 68 (13), ముగింపు ప్రార్థన.
మార్చి 22తో ప్రారంభమయ్యే వారం
పాట 162 (18)
10 నిమి: స్థానిక ప్రకటనలు. ఏప్రిల్ నెలలో సహాయ పయినీరు సేవ చేసే వారి పేర్లను ప్రకటించండి. దరఖాస్తులను ఇవ్వడానికి ఇంకా సమయముందని చెప్పండి. ఏప్రిల్ నెల కోసం ఏర్పాటు చేసిన క్షేత్ర సేవా కూటముల సమగ్ర షెడ్యూల్ని క్లుప్తంగా చెప్పండి. మార్చి 27—ఏప్రిల్ 1 కోసం ప్రతిదినము లేఖనములను పరిశీలించుట—1999లోనూ, అలాగే 1999 క్యాలెండరులోనూ ఇవ్వబడిన జ్ఞాపకార్థ బైబిలు పఠన షెడ్యూలు ప్రకారం పఠించమని అందరినీ ప్రోత్సహించండి.
15 నిమి: జ్ఞాపకార్థదినం కోసం సిద్ధపడండి. ప్రసంగం. జ్ఞాపకార్థదినానికి హాజరయ్యేలా బైబిలు విద్యార్థులకూ, ఆసక్తిగల ఇతరులకూ సహాయం చేయడానికి అందరూ పథకాలు వేసుకోవాలి. చిహ్నాలలో ఎవరు భాగంవహించవచ్చో, లేక ఆ ఆచరణ ప్రాముఖ్యత ఏమిటో కొత్తగా హాజరయ్యేవారు అర్థంచేసుకోలేక పోవచ్చు. కావలికోట ఏప్రిల్ 1, 1996, 6-8 పేజీలలో చెప్పబడిన దాన్ని పునఃసమీక్షించి, ఆ ఆచరణ భావాన్ని, సంకల్పాన్ని క్రొత్తగా ఆసక్తి చూపిస్తున్న వ్యక్తి గ్రహించేలా మనం ఎలా సహాయపడవచ్చో చూపించండి. చివరిగా, “జ్ఞాపకార్థదిన జ్ఞాపికలు” సమీక్షించి, స్థానికంగా చేసిన జ్ఞాపకార్థదిన ఏర్పాట్లను క్లుప్తంగా వివరించండి.
20 నిమి: మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది? (ఆంగ్లం). ఒక పెద్ద ఇద్దరు ముగ్గురు సామర్థ్యంగల ప్రచారకులతో ఆ బ్రోషూరు విలువనూ, దాని ఉపయోగాన్నీ చర్చిస్తాడు. మనం దాన్ని క్షేత్ర సేవలో ప్రభావవంతంగా ఉపయోగిస్తున్నామా? వారు ఈ క్రింది వాటిని చర్చిస్తారు: అనేకమంది ప్రజలు ఈ అంశంపై ఆసక్తి ఎందుకు చూపిస్తారు? అబద్ధమత బోధలకు భిన్నంగా ఈ బ్రోషూరు ఏ నిరీక్షణని ఉన్నతపరుస్తుంది? ఆసక్తిని రేకెత్తించడానికి వెనుక పేజీలో ఉన్న ప్రశ్నలను మనం ఎలా ఉపయోగించవచ్చు? ఈ బ్రోషూరుని అందించడానికి ఎలాంటి అవకాశాలున్నాయి? 27వ పేజీ, 14వ పేరాలో ఉన్న లేఖనాలను ఉపయోగిస్తూ ఒక అందింపుని ప్రదర్శించండి. ఈ బ్రోషూరుని చక్కగా ఉపయోగించడానికి సంసిద్ధంగా ఉండమని అందర్నీ ప్రోత్సహించండి.
పాట 92 (22), ముగింపు ప్రార్థన.
మార్చి 29తో ప్రారంభమయ్యే వారం
పాట 111 (8)
12 నిమి: స్థానిక ప్రకటనలు. మార్చి నెల క్షేత్ర సేవా రిపోర్టులను ఇవ్వమని అందరికీ జ్ఞాపకం చేయండి. ఏప్రిల్ నెలలో మనం కావలికోట, తేజరిల్లు! లను ప్రతిపాదిస్తాము. తాజా పత్రికలను చూపించండి. వాటిలో నుండి కొన్ని శీర్షికలను ఉన్నతపర్చి, మాట్లాడగల కొన్ని అంశాలను ప్రస్తావించండి. అందరూ దేవుడు కోరుతున్నాడు బ్రోషూర్లను తమతోపాటుగా తీసుకెళ్లి, వాటిని ఆసక్తిగల వారితో బైబిలు పఠనాలను ప్రారంభించడానికి ఉపయోగించాలి.
15 నిమి: స్థానిక అవసరాలు.
18 నిమి: సలహాకు మనమెలా ప్రతిస్పందిస్తాం? పెద్ద ఇచ్చే ప్రసంగం. మన దృక్పథం, ప్రవర్తన, సహవాసాలు, లేక సంఘ కార్యకలాపాలలో భాగంవహించడం వంటి వాటికి సంబంధించి ఇచ్చే సలహాకు మనమంతా లోబడాలి. కొన్నిసార్లు, మనమందరమూ సలహాను తృణీకరించేందుకు మొగ్గుచూపిస్తాము లేదా మొహం ముడుచుకుంటాం. సలహాను స్వీకరించి, అన్వయించుకునేందుకు సుముఖుత చూపించడం మన ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధికి ప్రాముఖ్యమైనవై ఉండవచ్చు. మనం సలహాను అంగీకరించి, దాన్ని ప్రశంసించడానికి గల కారణాలను నొక్కిచెప్పే ఆవశ్యక కారకాలను సమీక్షించండి.—కావలికోట (ఆంగ్లం) ఏప్రిల్ 1, 1987, 27-30 పేజీలను చూడండి.
పాట 118 (20), ముగింపు ప్రార్థన.