కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/99 పేజీ 1
  • రమ్ము అని వారిని ఆహ్వానిద్దాం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • రమ్ము అని వారిని ఆహ్వానిద్దాం
  • మన రాజ్య పరిచర్య—1999
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీటింగ్స్‌కు హాజరవడం వల్ల ఏ లక్షణాలు చూపిస్తాం?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • యెహోవాసాక్షుల మీటింగ్స్‌ మీకు ఎలా సహాయం చేస్తాయి?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • ‘యెహోవా మందిరమునకు వెళ్లుదము’
    మన రాజ్య పరిచర్య—1993
  • “ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1999
km 3/99 పేజీ 1

రమ్ము అని వారిని ఆహ్వానిద్దాం

1 “యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి, . . . ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము” అని శతాబ్దాల క్రిందట వెలువడిన ఆహ్వానం, ఇప్పుడు ప్రపంచమంతటా 233 దేశ ద్వీపాల్లో ప్రతిధ్వనిస్తోంది. (యెష. 2:3) యెహోవా సంస్థ వైపుకు ప్రజలను నడిపించడం, నిత్యజీవానికి నడిపించే ఆధ్యాత్మిక అభివృద్ధిని చేసుకునేలా మనం వారికి సహాయపడగల్గే శ్రేష్ఠమైన మార్గాల్లో ఒకటైవుంది.

2 ప్రజలు గృహ బైబిలు పఠనంలో చెప్పుకోదగినంత అభివృద్ధి సాధించనంత వరకూ వారిని రాజ్యమందిరానికి ఆహ్వానించడానికి కొంతమంది ప్రచారకులు వెనుకాడవచ్చు. అయినప్పటికీ, కొన్నిసార్లు ప్రజలు తమతో గృహ బైబిలు పఠనం ప్రారంభించబడక ముందే సంఘకూటాలకు రావడం మొదలుపెడతారు. ప్రజలను కూటాలకు రమ్మని హృదయపూర్వకంగా ఆహ్వానించి, ప్రోత్సహించడానికి మనం ఆలస్యం చేయకూడదు.

3 ఏమి చేయాలి: మన స్థానిక కూటాలను గురించి ప్రజలకు తెలియజేయడానికి హ్యాండ్‌ బిల్లులను బాగా ఉపయోగించండి. కూటాలకు ప్రవేశం ఉచితమనీ, చందాలు వసూలు చేయబడవనీ ప్రస్తావించండి. కూటాలు ఎలా నిర్వహించబడతాయో వివరించండి. అవి నిజమైన బైబిలు అధ్యయన కోర్సులనీ, కూటాలకు హాజరయ్యే వారందరూ కూటం జరుగుతుండగా చూసుకోవడానికి వీలుగా అధ్యయనం చేసే పుస్తకాలు లభ్యమౌతాయనీ సూచించండి. కూటాలకు హాజరైన వివిధ జీవిత నేపథ్యాలకూ, జీవన శైలులకూ చెందిన వ్యక్తులను పరిచయం చేయండి. హాజరైన వ్యక్తులు ఫలానా ప్రాంతం వారనీ, పిల్లలు ఏ వయస్సువారైనప్పటికీ హాజరవ్వడానికీ ఆహ్వానితులేననీ ప్రస్తావించండి. మనం ఎవరితోనైతే పఠనం చేస్తున్నామో వారిని ఆహ్వానించి, కూటానికి హాజరవ్వడానికి ఏ రీతిలోనైనా వారికి సహాయాన్ని అందించడానికి సంసిద్ధతను తెలియజేయాలి.

4 బైబిల్లో వ్రాయబడిన చివరి సంగతుల్లో ఒకటి, జీవం కోసం యెహోవా చేసిన ఏర్పాట్లలో పాల్గొనడానికి ఇవ్వబడిన హృదయపూర్వకమైన ఈ ఆహ్వానమైవుంది: “ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు; . . . దప్పిగొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయంచువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.” (ప్రక. 22:17) మన కూటాలకు హాజరవ్వమని ఇతరులను ఆహ్వానించడానికి ప్రత్యామ్నాయమంటూ ఏదీ లేదు.

5 దేవుని ప్రజల సంఘాల్లోకి ఇప్పుడు వస్తున్న లక్షలాదిమంది నూతన స్తుతికర్తలను, ‘మేఘమువలెను ఎగయు గువ్వలవలెను గూళ్లకు ఎగసి వస్తున్న’ గువ్వలుగా యెషయా 60:8 వచనం ప్రవచనాత్మకంగా వర్ణిస్తోంది. మనమంతా క్రొత్తవారిని మన కూటాలకు రమ్మని, ఆహ్వానించబడ్డామన్న అనుభూతిని వాళ్లు పొందేలా చేయగలం. ఆ విధంగా, యెహోవా సమకూర్చే పనిని వేగవంతం చేస్తుండగా, మనం ఆయనతో సహకరిస్తున్న వాళ్ళమౌతాం.—యెష. 60:22.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి