కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/99 పేజీ 2
  • ఫిబ్రవరిలోని సేవా కూటాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఫిబ్రవరిలోని సేవా కూటాలు
  • మన రాజ్య పరిచర్య—1999
  • ఉపశీర్షికలు
  • ఫిబ్రవరి 1తో ప్రారంభమయ్యేవారం
  • ఫిబ్రవరి 8తో ప్రారంభమయ్యే వారం
  • ఫిబ్రవరి 15తో ప్రారంభమయ్యే వారం
  • ఫిబ్రవరి 22తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—1999
km 2/99 పేజీ 2

ఫిబ్రవరిలోని సేవా కూటాలు

ఫిబ్రవరి 1తో ప్రారంభమయ్యేవారం

పాట 154 (1)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. జనవరి నెల సేవా రిపోర్టును ఇవ్వమని అందరికీ గుర్తు చేయండి.

17 నిమి: “కుటుంబ సంతోషం పుస్తకాన్ని అన్ని వయస్కుల వారికీ ప్రతిపాదించండి.” ఈ శీర్షికను సమర్థులైన ఇద్దరు ముగ్గురు ప్రచారకులతో ఒక పెద్ద చర్చిస్తారు. కుటుంబ సంతోషం బైబిలు ఉపదేశాలను అనుసరించడంలోనే ఉంటుందని గుర్తించేందుకు ఇతరులకు సహాయంచేయాలనే గమ్యంపై దృష్టి కేంద్రీకరించండి. (కుటుంబ సంతోషం, 9-12 పేజీలు చూడండి.) సూచించబడిన అందింపులను ప్రదర్శించండి. పునర్దర్శనం కొరకు జాగ్రత్తగా ఎలా పథకం వేయాలో చూపించండి.

18 నిమి: “నూతన వ్యక్తిత్వాన్ని ధరించుకోండి.” ఎఫెసీయులు 4:20-24 వచనాలను విశ్లేషిస్తూ ఒక ప్రసంగం. (కావలికోట పఠనశీర్షికల బ్రోషూర్‌ 7-10 పేజీలను చూడండి.) పాత వ్యక్తిత్వాన్ని విడిచి నూతన వ్యక్తిత్వాన్ని ఎలా ధరించాలో వివరించండి.

పాట 4 (2) ముగింపు ప్రార్థన.

ఫిబ్రవరి 8తో ప్రారంభమయ్యే వారం

పాట 12 (9)

10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్‌ రిపోర్టు.

15 నిమి: స్థానిక అవసరతలు.

20 నిమి: “మన గొప్ప సృష్టికర్త మన గురించి శ్రద్ధ వహిస్తున్నాడు!” ప్రశ్నా జవాబులు. దేవుని ఉనికిని సందేహించేవారికి లేదా ఆయన లేడనుకొనే వారికి సహాయపడేందుకు సృష్టికర్త (ఆంగ్లం) పుస్తకం ఎలా ఉపయోగించవచ్చో వివరించండి. ఈ పుస్తకం బైబిలు పఠనాలు నిర్వహించేందుకు కానప్పటికీ, అది బైబిలు చెప్తున్నదాన్నంతటిని పరిశీలించేందుకు ప్రజలను కదిలించుటలో ఒక ఉపయుక్తమైన ఉపకరణముగా పని చేయగలదు. (సృష్టికర్త పుస్తకంలో 189-91 పేజీలు చూడండి.) ఆ ప్రచురణ విషయమై వారి వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోమని అలాగే ఇతరులకు అందించడంలో వారికి కలిగిన అనుభవాలను తెలియజేయమని ప్రచారకులను ఆహ్వానించండి.

పాట 173 (23) ముగింపు ప్రార్థన.

ఫిబ్రవరి 15తో ప్రారంభమయ్యే వారం

పాట 40 (5)

10 నిమి: స్థానిక ప్రకటనలు. దైవ పరిపాలనా వార్తలు.

18 నిమి: దైవ పరిపాలనా పరిచర్య పాఠశాలలో పేరు నమోదు చేయించుకోవడం ద్వారా మనమెలా ప్రయోజనం పొందుతాం? పాఠశాల పైవిచారణకర్త ప్రేక్షకులతో చర్చిస్తాడు. బహిరంగంగా మాట్లాడ్డంలో శిక్షణ పొందడమనేదే పాఠశాల యొక్క ముఖ్య ఉద్దేశము కాదు. మనం ఇతర విధాల్లో కూడా దీని నుండి ప్రత్యక్షంగా ప్రయోజనాన్ని పొందుతాము. (పాఠశాల నిర్దేశక పుస్తకము (ఆంగ్లం) 12-13 పేజీలు.) అవి ఏమిటంటే, ఇతర ప్రజలతో ఎలా సరిగా సంభాషించాలో మనం నేర్చుకుంటాము. స్పష్టంగానూ, సమతూకంగానూ, ఆత్మ విశ్వాసంతో మాట్లాడగలిగేలా మనకు నేర్పించబడుతుంది. మన నమ్మకాలను గురించిన ప్రశ్నలకు సమాధానమివ్వడంలోనూ, బైబిలు ఆధారంగా మనం తీసుకున్న నిర్ణయాలను వివరించడంలోనూ నైపుణ్యం గలవారిగానూ అవుతాము. మన బైబిలును గూర్చిన జ్ఞానం అధికమౌతుంది, ఇతరులకు మరింత సమర్థవంతంగా సాక్ష్యమిచ్చేందుకు అది మనకు సహాయపడుతుంది. మన లోపాలను గుర్తించి, ఉపదేశాన్ని స్వీకరించేలా నేర్చుకుంటున్నాము, ఇతరులతో మరింత స్నేహపూర్వకంగా వ్యవహరించగలుగుతున్నాము. పాఠశాల మనకిచ్చే శిక్షణ అంతా కూడా దేవుని సేవకులుగా మనం “కావల్సినంత యోగ్యత గలవారము”గా కొనసాగేందుకు సహాయం చేస్తుంది.—2 కొరిం. 3:5, 6, NW.

17 నిమి: “బైబిలు పఠనంలో—పూర్తి భాగం వహించేందుకు కుటుంబసభ్యులు ఎలా సహకరిస్తారంటే.” కుటుంబ సభ్యుల మధ్య చర్చ. మే 15, 1996 కావలికోట 14-15 పేజీల్లోనూ, జనవరి 15 1993 కావలికోట 16-17 పేజీల్లోనూ ఇవ్వబడిన సమాచారంలో కుటుంబమంతా కలసి బైబిలు చదవడాన్ని, పఠించడాన్ని గూర్చి ఇవ్వబడిన సలహాలను వారెలా అన్వయించుకుంటున్నారో వారు విశ్లేషిస్తారు.

పాట 57 (9), ముగింపు ప్రార్థన.

ఫిబ్రవరి 22తో ప్రారంభమయ్యే వారం

పాట 170 (21)

10 నిమి: స్థానిక ప్రకటనలు.

15 నిమి: అపార్ట్‌మెంట్లలో సాక్ష్యమివ్వడం. (మీ ప్రాంతంలో కేవలం కొన్ని అపార్ట్‌మెంట్లు మాత్రమే ఉంటే మే 1995 మన రాజ్య పరిచర్యలో “ఇండ్లవద్ద లేనివారి రికార్డు ఎందుకుంచుకోవాలి?” అనే శీర్షికను పరిశీలించండి.) ఇద్దరు ముగ్గురు ప్రచారకులతో చర్చ. కొన్ని పట్టణాల్లో అపార్ట్‌మెంటులోనికి ప్రవేశించాలంటే తగిన అనుమతి లేనిదే లోనికి అనుమతించకూడదనే ఖచ్చితమైన నిబంధనలను సెక్యూరిటీ వాచ్‌మెన్‌లకు ఇవ్వబడినట్లైతే అలాంటి అపార్ట్‌మెంటుల్లోని ప్రజలను ఎలా సమీపించాలో మార్గాలను పరిశీలించండి. సంఘాలు ఆ అపార్ట్‌మెంటు ప్రెసిడెంట్‌ నుండి గానీ లేక సెక్రటరీ నుండి గానీ ఆధికారిక అనుమతిని సంపాదించవచ్చు. అనుమతి లభించినట్లయతే బహుశా కొంతమంది ప్రచారకులు ఒక పద్ధతి ప్రకారంగా అపార్ట్‌మెంట్లలో సాక్ష్యమివ్వగలరు. ఒకవేళ అనుమతి ఇచ్చేందుకు నిరాకరించినట్లయితే ప్రతి ఒక్క లెటర్‌ బాక్సులో కరపత్రాలను వేసేందుకు సెక్యూరిటీ వాచ్‌మెన్‌లు ఒకవేళ అనుమతించవచ్చు. అక్కడ అద్దెకుండే వాళ్ళ పేర్లను సంపాదించినట్లయితే టెలిఫోన్‌ సాక్ష్యమిచ్చేందుకు అది సహాయపడవచ్చు. వారిని సంప్రదించే పరిస్థితి లేకపోయినట్లయితే వారికి ఉత్తరాలు వ్రాయవచ్చు లేక ఆ అపార్ట్‌మెంటు దగ్గర వీధిలో నిలబడి వారు వెళ్తున్నప్పుడూ వస్తున్నప్పుడూ వారికి సాక్ష్యమివ్వవచ్చు. అపార్ట్‌మెంటు నివాసులకు సాక్ష్యమివ్వడంలో మంచి ఫలితాలు సాధించేందుకు ఉపయోగించబడిన ఒక పద్ధతిని ప్రదర్శించండి.

20 నిమి: శిష్యులను చేసే పనిలో సంతోషాన్ని కనుగొనడమెలా. ఫిబ్రవరి 15, 1996 కావలికోట 19-22 పేజీల పై ఆధారపడిన ఒక ప్రసంగం.

పాట 91 (22), ముగింపు ప్రార్థన.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి