దైవపరిపాలనా వార్తలు
అంగోల: మహాగొప్ప అభివృద్ధి వరుసగా రిపోర్టుచేయబడుతుంది. జూలై మాసములో 18,911 మంది ప్రచారకుల నూతన శిఖరాగ్ర సంఖ్యను చేరుకుంది. 56,075 బైబిలు పఠనములు నిర్వహించబడినవి.
ఆస్ట్రేలియా: ఆగస్టు మాసములో ప్రచారకులలో ఒక క్రొత్త శిఖరాగ్రసంఖ్య 57,272కు చేరుకొన్నది. వారి ముందటి శిఖరాగ్ర సంఖ్యకంటే 1,541 మంది ఎక్కువ ప్రచారకులతో వారి సేవా సంవత్సరం ముగిసింది. అన్ని సమయాల్లోకి మిన్నగా 31,712 బైబిలు పఠనములు రిపోర్టు చేయబడినవి.
సైప్రస్: ఆగస్టు మాసములో వారు ఎనిమిదవసారి వారి శిఖరాగ్ర సంఖ్యకు చేరుకొనిరి. అందులో రిపోర్టుచేసినవారు 1,433. గత సంవత్సరపు సగటుకంటె ఇది 9 శాతము అభివృద్ధి.
డొమినికన్ రిపబ్లిక్: ఆగస్టులో 15,418 మంది రిపోర్టుచేయుటతో గతసంవత్సరం కంటె వారు 20 శాతము అభివృద్ధిపొందారు. దాదాపు 20 శాతముకంటె ఎక్కుమంది ప్రచారకులు పూర్తికాల సేవలో ఉన్నారు.
ఘానా: గత సంవత్సరం సగటుకంటె 18 శాతము అభివృద్ధి. ఆగస్టు మాసములో 37,676 మంది తమ ప్రాంతీయ సేవా రిపోర్టును అందించారు.
మయన్మార్: జూలై మాసముల ఒక క్రొత్త శిఖరాగ్ర సంఖ్యగా 1,958 ప్రచారకులు చేరుకొన్నారు.
ప్యూర్టొరికొ: ఆగస్టులో క్రొత్త శిఖరాగ్ర సంఖ్యగా 25,315 మంది రిపోర్టుచేశారు.