కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/00 పేజీ 8
  • మీరు క్రమ రాజ్యప్రచారకులా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు క్రమ రాజ్యప్రచారకులా?
  • మన రాజ్య పరిచర్య—2000
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఖచ్చితమైన రిపోర్టు సేకరించబడేందుకు మీరు సహకరిస్తున్నారా?
    మన రాజ్య పరిచర్య—2002
  • ఆగస్ట్‌ పతాక నెల అవుతుందా?
    మన రాజ్య పరిచర్య—1998
  • ప్రాంతీయ సేవలో క్రమంగా పాల్గొనండి
    మన రాజ్య పరిచర్య—1993
  • 2000 ఏప్రిల్‌ను మన అపూర్వమైన నెలగా చేసుకోగలమా?
    మన రాజ్య పరిచర్య—2000
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2000
km 4/00 పేజీ 8

మీరు క్రమ రాజ్యప్రచారకులా?

1 ఆగస్టు 1999లో ఇండియా 21,212 మంది ప్రచారకుల సర్వకాల శిఖరాగ్ర సంఖ్యకు చేరుకోవటం చూసి మనమందరం సంతోషించాము. నిజంగా అది ఐక్యంగా, దృఢసంకల్పంతో చేసిన కృషి ! తర్వాతి నెలల్లో, ఈ ప్రచారకుల్లో కొందరికి క్రమ రాజ్యప్రచారకులుగా కొనసాగటం కష్టమైందని స్పష్టమౌతుంది, ఎందుకంటే అప్పటి నుండి సగటు నెల సంఖ్య దాదాపు 20,095గానే ఉంది. ఇది ప్రతి 19 మంది ప్రచారకులలో ఒకరు ప్రతి నెల పరిచర్యలో పాల్గొనే ఏర్పాటు చేసుకోలేదని సూచిస్తోంది. కిందనున్న ప్రోత్సాహం అలాంటి పరిస్థితిని సరిదిద్దేందుకు సహాయం చేయగలదని మేము నమ్ముతున్నాము.

2 ఆధిక్యతపట్ల మెప్పు కల్గివుండండి: రాజ్య సువార్తను ఇతరులతో పంచుకునేందుకు మనకున్న ఆధిక్యతపట్ల మనకు ప్రగాఢమైన మెప్పు ఉండాలి. ఈ కార్యకలాపం యెహోవా హృదయాన్ని సంతోషపర్చటమే గాక, యథార్థహృదయులైన వారు జీవ మార్గాన్ని గూర్చి తెలుసుకునేలా చేస్తుంది. (సామె. 27:11; 1 తిమో. 4:16) క్రమంగా సాక్ష్యమివ్వటమనేది పరిచర్యలో మన అనుభవాన్ని పెంచటమే గాక, ఆనందానుభూతినీ, సాధించామన్న సంతృప్తినీ ఇస్తుంది.

3 కార్యకలాపాన్ని రిపోర్టు చేయండి: క్షేత్ర సేవలో తాము చేసిన దాన్ని సమయానికి రిపోర్టు చేయకుండా కొందరు నిర్లక్ష్యం చేస్తారు. మన ప్రయత్నం రిపోర్టు చేసేంత యోగ్యమైనది కాదని మనమెప్పుడూ భావించకూడదు. (పోల్చండి మార్కు 12:41-44.) బదులుగా, మనం చేసిన దాన్ని మనం తప్పక రిపోర్టు చేయాలి! పరిచర్యలో వెచ్చించిన సమయాన్ని నమోదు చేసుకోవటానికి ఒక క్యాలెండరును ఉపయోగించటంలాంటి పద్ధతిని ఇంట్లో పెట్టుకుంటే ప్రతి నెలాఖరున ఖచ్చితమైన నివేదికను ఇవ్వడానికి అదే ఒక జ్ఞాపికగా ఉంటుంది.

4 అవసరమైన సహాయాన్ని అందించండి: పరిచర్యలో మంచి భాగాన్ని కల్గివుండేందుకు, సహాయం అవసరమైన వారికి సహాయపడేలా స్థానిక ఏర్పాట్లను సరిచేయాల్సి ఉండవచ్చు. అనుభవం గల ప్రచారకులు చేయూతనిచ్చేలా సంఘ కార్యదర్శి, సంఘ పుస్తక నిర్వాహకుడు ఏర్పాటు చేయాలి. మీకు గానీ బాప్తిస్మం పొందని పిల్లలు లేదా ఇతర బైబిలు విద్యార్థులు ఉన్నట్లైతే వారు ప్రతి నెలా తమ నివేదికను ఇచ్చేలా వారికి నేర్పించండి.

5 అక్టోబరు 1, 1997, కావలికోటలో వచ్చిన “యెహోవా సేవలో సుదీర్ఘమైన జీవితాన్ని కలిగి ఉన్నందుకు కృతజ్ఞురాలిని” అనే జీవిత కథను జ్ఞాపకం చేసుకోండి. నార్వేలోని సహోదరియైన ఓటీలి మిడ్‌లన్‌ 1921లో తను బాప్తిస్మం పొందినప్పటినుంచి సువార్త క్రమ ప్రచారకురాలిగా ఉంది. 76 ఏళ్ల తర్వాత తన 99వ ఏట ఆమె ఇలా అంది: “నేను ఇంకా క్రమ ప్రచారకురాలిగా ఉండగలుగుతున్నందుకు నేనెంతో ఆనందిస్తున్నాను.” అనుకరించటానికి యెహోవా సేవకులందరికీ ఎంత మహత్తరమైన మనోవైఖరో గదా!

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి