జూన్‌లోని సేవా కూటాలు
జూన్ 1తో ప్రారంభమయ్యే వారం
పాట 223 (6)
8 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు.
15 నిమి: ‘ప్రతి సత్కార్యానికీ పూర్ణంగా సిద్ధపడి ఉండడం.’ ప్రశ్నాజవాబులు. కావలికోట (ఆంగ్లం) ఫిబ్రవరి 15, 1989, 22-4 పేజీలపై ఆధారపడిన క్లుప్తమైన వ్యాఖ్యానాల్ని చేయండి.
22 నిమి: “‘మనుష్యులందరికీ’ సాక్ష్యమివ్వడం.” ఇవ్వబడిన అందింపుల్ని పెద్ద, అనుభవం గల ప్రచారకుల గుంపు చర్చిస్తారు. స్థానికంగా తారసపడే మతపరమైన నమ్మకాల్ని గురించి పునఃసమీక్షించి, ప్రతీ సందర్భంలోనూ సంభాషణను ఆరంభించడానికి కొన్ని మాట్లాడే అంశాల్ని మనస్సులో మనమెందుకు ఉంచుకోవాలో వివరిస్తారు. ఒకటో, రెండో క్లుప్తమైన ప్రదర్శనల్ని ప్రదర్శించండి.
పాట 112 (16), ముగింపు ప్రార్థన.
జూన్ 8తో ప్రారంభమయ్యే వారం
పాట 209 (4)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు.
15 నిమి: “యజమాని ఆస్తుల్ని జాగ్రత్తగా చూసుకోవడం.” ఇన్‌సర్ట్‌లోని సమాచారాన్ని ఉపయోగిస్తూ పెద్ద ఇచ్చే ప్రసంగం.
20 నిమి: “సంఘానికి అప్పగించబడిన పనిని నెరవేర్చడానికి మనమంతా అవసరమే.” ప్రశ్నాజవాబులు. సంఘంలో అవసరమైన వాటిని చేయడానికి పెద్దలు, ఇష్టపూర్వకంగా పనిచేసే అనేకమంది స్వచ్ఛంద సేవకులపై ఎందుకు ఆధారపడి ఉన్నారో వివరించండి. రాజ్యమందిరాన్ని పరిశుభ్రపర్చి, మెయింటెయిన్ చేయడమూ, రోగగ్రస్థులకూ, వృద్ధులకూ సహాయం చేయడమూ, టెరిటరీని పూర్తిగా కవర్ చేయడమూ వంటి స్థానిక అవసరాల్ని పునఃసమీక్షించండి. అనేకమంది ప్రచారకులు ఇస్తున్న ఇష్టపూర్వకమైన మద్దతును పెద్దలెలా మెచ్చుకుంటున్నారు అనే విషయంపై వ్యాఖ్యానించమని వారిని ఆహ్వానించండి. అందరి ప్రయత్నమూ ఎంత అవసరమో నొక్కి చూపించండి.
పాట 153 (6), ముగింపు ప్రార్థన.
జూన్ 15తో ప్రారంభమయ్యే వారం
పాట 7 (17)
10 నిమి: స్థానిక ప్రకటనలు. “పబ్లిషర్ క్రెడిట్ పాలసీలో సవరణ”ను గురించి చర్చించండి.
20 నిమి: “మీ శక్తికొద్దీ మీరు ప్రయాసపడండి.” కావలికోట జనవరి (ఆంగ్లం) 15, 1986, 10-14 పేజీలపై ఆధారపడిన ప్రసంగం. క్రమ పయినీరు సేవా ప్రాముఖ్యతను గురించి చర్చించి, సెప్టెంబరు 1 నుండి పాల్గొనమని ప్రోత్సహించండి.
15 నిమి: “సత్ప్రవర్తన ద్వారా సాక్ష్యమివ్వడం.” ప్రశ్నాజవాబులు. మాదిరికరమైన కొంతమంది పిల్లల్ని ఇంటర్వ్యూ చేయండి. తమ క్రైస్తవ ప్రవర్తననుబట్టి ఇతరులు అనుకూలంగా ఎలా ముగ్దులయ్యారో అనే విషయాన్ని వాళ్లు చెబుతారు. కావలికోట జనవరి 1, 1995, 24-5 పేజీల్లో ఉన్న ఒకటో రెండో అనుభవాల్ని తెలియజేయండి.
పాట 170 (21), ముగింపు ప్రార్థన.
జూన్ 22తో ప్రారంభమయ్యే వారం
పాట 61 (16)
10 నిమి: స్థానిక ప్రకటనలు. సంఘ లెక్కల్ని ఆడిట్ చేయడం ఎప్పుడు పూర్తయిందో తెలియజేయండి.
15 నిమి: మ్యాగజైన్ రూట్‌ను ఎలా ప్రారంభించాలి. మ్యాగజైన్ రూట్‌ను ప్రారంభించడానికి అవసరమైన వాటిని సంక్షిప్తపర్చండి: పత్రికల్ని ఎవరెవరికి అందించారో రాసుకోండి, వారిని రెండు వారాల్లోపు తిరిగి కలవండి, ఆసక్తి తగ్గిపోకుండా ఉండేలా తాజా పత్రికల్లోనుండి క్రొత్త విషయాలను తెలియజేయండి. మ్యాగజైన్ రూట్‌లో పొరుగువారినీ, తోటి పనివారినీ, షాపుల్లో గుమస్తాల్నీ, పెట్రోలు బంకుల్లో పనిచేసే అటెండెంట్లనూ, మొదలైన వారందర్నీ చేర్చమని సూచించండి. ఆసక్తిని చూపే వారికి పత్రికల చందాల్ని ప్రతిపాదించండి. మ్యాగజైన్ రూట్‌ను గూర్చిన క్షేమాభివృద్ధికరమైన అనుభవాన్ని తెలియజేసేందుకు ఒకరిద్దరు ప్రచారకుల్ని ఆహ్వానించండి.
20 నిమి: పయినీర్లు ఇతరులకు సహాయపడతారు. పయినీర్లు వ్యక్తిగతంగా ఇతరులకు సహాయపడేందుకైన ఏర్పాటును పునఃసమీక్షిస్తూ, సేవా పైవిచారణకర్త ఇచ్చే ప్రసంగం. గతంలో సహాయ కార్యక్రమాలు ఎలా ప్రారంభించబడ్డాయో వివరించండి. (jv 100; km 8/79 1, 3) గత మూడేళ్లలో పది లక్షలకన్నా ఎక్కువమంది క్రొత్త వ్యక్తులు బాప్తిస్మం తీసుకొన్నారు, వారికి తర్ఫీదు అవసరం. పయినీరు సేవా పాఠశాలకు హాజరైన క్రమ, ప్రత్యేక పయినీర్లు పొందిన తర్ఫీదునీ, గడించిన అనుభవాన్నీ “పయినీర్లు ఇతరులకు సహాయపడతారు” అనే కార్యక్రమం ఉపయోగించుకొంటుంది. ప్రతి పయినీరు ఎదుటా ఉంచబడిన గమ్యమేమిటంటే సంవత్సరానికి ఇద్దరు ప్రచారకులకు పరిచర్యలో మరింత నిపుణతగలవారిగా తయారై, సేవలో అత్యధికంగా భాగంవహించేలా సహాయం చేయడమే. సహాయాన్ని పొందుతున్నవారు చింతించాల్సిన పనేమీ లేదు; ప్రేమపూర్వకంగానూ, దయాపూర్వకంగానూ ఇచ్చే ప్రోత్సాహానికే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఈ క్రొత్త కార్యక్రమం, లక్షలాదిమంది మరింత సమర్థులైన పరిచారకులుగా తయారయ్యేందుకు అనుకూలంగా ఉంటుంది.
పాట 207 (1), ముగింపు ప్రార్థన.
జూన్ 29తో ప్రారంభమయ్యే వారం
పాట 114 (23)
10 నిమి: స్థానిక ప్రకటనలు. జూన్ నెల ప్రాంతీయ సేవా రిపోర్టులను ఇవ్వమని అందరికీ గుర్తుచేయండి. జూలై నెలలో ప్రతిపాదించే సాహిత్యాల్ని గురించి చర్చించండి.
15 నిమి: స్థానిక అవసరతలు లేదా పరిచర్యయందలి నా ఆసక్తి సన్నగిల్లిందా? కావలికోట (ఆంగ్లం) డిసెంబరు 15, 1987, 18-19 పేజీల్లోని 14-16 పేరాల ఆధారంగా పెద్ద ఇచ్చే ప్రసంగం. తాము చేసే పవిత్ర సేవా నాణ్యత విషయంలోనూ, దాని పరిమాణం విషయంలోనూ ఆలోచించమని అనేక సంవత్సరాలుగా చురుకుగా ఉన్న వారిని ప్రోత్సహించండి.
20 నిమి: మనమంతా అనియతంగా సాక్ష్యమివ్వగలం. కావలికోట (ఆంగ్లం) అక్టోబరు 1987, పేజీలు 22-7 ఆధారంగా ఇచ్చే ప్రసంగమూ, ప్రేక్షకులతో చర్చ. ఉద్యోగ సంబంధమైన, కుటుంబపరమైన, వ్యక్తిగతమైన బాధ్యతలతో తలమునకలుగా ఉన్న వ్యక్తులు ఇతరులతో సువార్తను పంచుకోవడానికి అనేక అవకాశాల్ని ప్రతీరోజు ఎలా కనుగొనగలరో తెలియజేయండి. కొన్ని స్థానిక అనుభవాల్ని కూడా చేర్చండి.
పాట 76 (9), ముగింపు ప్రార్థన.