సంఘానికి అప్పగించబడిన పనిని నెరవేర్చడానికి మనమంతా అవసరమే
1 రాజ్య ప్రకటనాపనికి మద్దతునిచ్చి, దానిలో భాగంవహించేందుకు తమ ప్రయత్నాలన్నీ అతి ప్రాముఖ్యం అని యేసుక్రీస్తు శిష్యులందరూ గుణగ్రహించాలి. తన శిష్యులు వేర్వేరు మోతాదుల్లో రాజ్య ఫలాల్ని ఉత్పన్నం చేస్తారనే విషయాన్ని యేసు గ్రహించాడు. (మత్త. 13:23) ప్రకటనాపనిలో ఎక్కువ భాగాన్ని కష్టించి పనిచేసే అనేకమంది పయినీర్లు చేపడుతున్నా, వీలైనన్ని ఎక్కువ ఫలాల్ని ఉత్పన్నం చేయడం మూలంగా దేవుడ్ని మహిమ పర్చడంలో ఆసక్తిగా కొనసాగుతున్న వారందరూ ప్రశంసించదగినవారే.—యోహా. 15:8.
2 సమష్టిగా చేసే ప్రయత్నాలు ఎంతో సాధిస్తాయి: తన శిష్యులందరి సమష్టి ప్రయత్నాలూ, తాను చేసిన క్రియలకన్నా మరిన్ని గొప్ప క్రియల్ని ఉత్పన్నం చేస్తాయని యేసు ప్రవచించాడు. (యోహా. 14:12) మన వ్యక్తిగత పరిస్థితులు మనం చేయగలిగే దాన్ని పరిమితం చేసినా లేక, రాజ్య ప్రకటనాపనికి ఎక్కువ సమయాన్ని కేటాయించేలా వీలు కల్పించినా, అవసరమైన పనిని నెరవేర్చడానికి మనమంతా కావాలి. అది పౌలు తెలియజేసినట్లుగానే ఉంది: “సర్వశరీరము చక్కగా అమర్చబడి, తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలువలన గలిగిన బలముచేత అతుకబడి, ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసికొనుచున్నది.”—ఎఫె. 4:16.
3 తాము పెద్దగా చేయలేకపోయామని కొంతమంది భావించవచ్చు. అయితే, మనం చేసే సేవ హృదయపూర్వకమైనదై ఉండాలి, అదే యెహోవా దృష్టికి ప్రాముఖ్యమైన విషయం. ఆయన కోసం మనం చేసే ప్రతీదీ విలువైనదే, మెచ్చుకోదగినదే.—పోల్చండి లూకా 21:1-4.
4 పనికి మద్దతునివ్వడంలో కొనసాగండి: ప్రపంచవ్యాప్తంగా చేసే పనికి వస్తుదాయక విరాళాల్ని ఇచ్చే ఆధిక్యత మనందరికీ ఉంది. రాజ్య పనికి మద్దతునిస్తూ ఉండడంలో కాయకష్టం ఇమిడివుంది, కొంతమంది ఆ విధంగా కూడా మద్దతును ఇవ్వగలరు. కూటాల్లో బాగా సిద్ధపడిన వ్యాఖ్యానాల్ని చేయడానికీ, దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో భాగంవహించడానికీ ప్రతి ఒక్కరూ కృషిచేయగలరు. ఇతరుల్ని ప్రోత్సహించడానికి అవకాశాల్ని కలుగజేసుకోవడం ద్వారా, సంఘ ఆధ్యాత్మికత విషయంలో మనం మరింతగా తోడ్పడినవారమౌతాం. ఇది, సంఘానికి అప్పగించబడిన పనిని నెరవేర్చేందుకైన దాని సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది.
5 అవును, సంఘానికి అప్పగించబడిన పనిని నెరవేర్చడానికి మనమంతా అవసరమే. తాను అవసరంలేనివాడనని ఎవ్వరూ భావించకూడదు. యెహోవా సేవ చెయ్యడంలో మనం చేసే సమష్టి ప్రయత్నాలు, అవి చిన్నవైనా పెద్దవైనా సరే, యెహోవా దేవుని సత్యారాధకులుగా మనల్ని భిన్నంగా ఉంచుతాయి. (మలా. 3:18) యెహోవాను ఘనపర్చడంలోనూ, ఇతరులు ఆయన్ని తెలుసుకొని, ఆయన సేవచేసేందుకు సహాయపడడంలోనూ ఓ అర్థవంతమైన భాగాన్ని మనలో ప్రతి ఒక్కరూ కల్గివుండవచ్చు.