జూలైలోని సేవా కూటాలు
జూలై 3తో ప్రారంభమయ్యే వారం
పాట 194 (105)
10 నిమి: స్థానిక ప్రకటనలు మరియు మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు.
17 నిమి: “మెలకువగా ఉండుడి.” ప్రశ్నా-జవాబులు.
18 నిమి: “విభిన్న బ్రోషూర్‌లను మీ పరిచర్యలో ఉపయోగించండి.” సూచించబడిన సలహాలను గురించి ప్రేక్షకులతో చర్చించండి. బ్రోషూర్‌లలోని ఆసక్తికరమైన విషయాలను గురించి క్లుప్తమైన వ్యాఖ్యానాలు చేయండి. వాటినెలా అందించవచ్చో చూపడానికి రెండు లేక మూడు ప్రదర్శనలను ఏర్పాటు చేయండి.
పాట 213 (36) మరియు ముగింపు ప్రార్థన.
జూలై 10తో ప్రారంభమయ్యే వారం
పాట 110 (56)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు.
20 నిమి: “యెహోవా జ్ఞాపికలు మనల్ని ఆత్మీయంగా పురికొల్పుతున్నాయా?” ప్రశ్నా-జవాబులు.
15 నిమి: గృహ బైబిలు పఠనాన్ని నిర్వహించడం. పురోభివృద్ధిచెందే బైబిలు పఠనాలను నిర్వహించే పెద్ద ఇచ్చే ప్రసంగం. బైబిలు పఠనాలను ప్రారంభించడానికి గొప్ప కృషి చేయాలని ప్రోత్సహించండి. మన పరిచర్యను నెరవేర్చుటకు సంస్థీకరింపబడియున్నాము అనే పుస్తకం 89-91 పేజీల్లో ఇవ్వబడిన సలహాలను పునఃపరిశీలించండి. క్లుప్త ప్రాంతీయ అనుభవాలను పొందుపర్చవచ్చు.
పాట 154 (72) మరియు ముగింపు ప్రార్థన.
జూలై 17తో ప్రారంభమయ్యే వారం
పాట 192 (103)
10 నిమి: స్థానిక ప్రకటనలు.
20 నిమి: “బ్రోషూర్ తీసుకున్న వాళ్లందరినీ పునర్దర్శించండి.” ఈ భాగం నియమించబడిన సహోదరుడు, ఆసక్తిగల వారినందరినీ మరియు ప్రచురణలను తీసుకున్న వారినందరినీ మళ్లీ దర్శించడం ఎందుకు ప్రాముఖ్యమో ముగ్గురు ఇతర ప్రచారకులతో చర్చిస్తాడు. సలహా ఇవ్వబడిన ప్రచురణలను వారు పునఃపరిశీలించి, వాటినెలా ఉపయోగించాలో వారిలో ఒకరికొకరు చూపుకుంటారు.
15 నిమి: “1995 ‘ఆనందమయ స్తుతికర్తలు’ అనే యెహోవాసాక్షుల జిల్లా సమావేశం.” ఇన్‌సర్ట్. 1-9 పేరాల వరకు ప్రసంగాన్ని సంఘాధ్యక్షుడు ఇవ్వాలి. ఆహార సేవలను సరళం చేయడానికి సర్దుకుపోవడంలోని అనుకూల ప్రయోజనాలపై అవధానం నిలపండి.
పాట 164 (73) మరియు ముగింపు ప్రార్థన.
జూలై 24తో ప్రారంభమయ్యే వారం
పాట 126 (10)
15 నిమి: స్థానిక ప్రకటనలు.
20 నిమి: “1995 ‘ఆనందమయ స్తుతికర్తలు’ అనే యెహోవాసాక్షుల జిల్లా సమావేశం.” ఇన్‌సర్ట్. 10-21 పేరాల్లో ప్రశ్నా-జవాబులు, సంఘ సెక్రెటరీ నిర్వహించాలి. చివర్లో ఉన్న జ్ఞాపికల బాక్సు వైపుకు అవధానాన్ని మళ్లించండి. అవసరమైన ఆహార మరియు ఇతర వస్తువులను మాత్రమే సమావేశానికి తీసుకొచ్చేందుకు వివేకాన్ని ఉపయోగించమని నొక్కిచెప్పండి.
20 నిమి: పొరుగువారేమి భావిస్తారు? ఏప్రిల్ 1, 1974 కావలికోట (ఆంగ్లం) 201-3 పేజీలపై ఆధారితం చేసిన ప్రసంగం మరియు ప్రదర్శన. మన లోకసంబంధమైన పొరుగువారి చేత మనం తరచూ ఎందుకు ఒత్తిడి చేయబడతామనే విషయాన్ని గురించి ప్రసంగం ఇవ్వండి. (201 పేజీ మరియు 202 పేజీలోని మొదటి పేరాను పరిశీలించండి.) యెహోవాసాక్షులతో బైబిలు పఠించడాన్ని వ్యతిరేకించే తమ లోకసంబంధమైన పొరుగువారి చేత భయపెట్టబడుతున్న, క్రొత్తగా ఆసక్తి చూపుతున్న ఒక కుటుంబంతో, అనుభవమున్న దంపతులు ఒకరు పఠనం చేస్తున్నట్లు చూపే ప్రదర్శనను అందించండి. (శీర్షిక జ్ఞాపికలో ఉన్న ముఖ్యాంశాలను పునఃసమీక్షించండి.) క్రొత్తగా ఆసక్తి చూపుతున్న కుటుంబం ఎందుకు నిరుత్సాహపడకూడదు లేక మానేయకూడదు అనే దానికిగల కారణాలను నొక్కి చెప్పండి.
పాట 169 (81) మరియు ముగింపు ప్రార్థన.
జూలై 31తో ప్రారంభమయ్యే వారం
పాట 136 (28)
10 నిమి: స్థానిక ప్రకటనలు. దైవపరిపాలనా వార్తలు.
15 నిమి: “క్షేమాభివృద్ధి కలుగజేయండి.” చర్చ మరియు ప్రసంగాన్ని పెద్ద ఇవ్వాలి.
20 నిమి: ఆగష్టు నెలలో అందించవలసిన సాహిత్యాన్ని పునఃసమీక్షించండి. ఉపయోగించగల 32 పేజీల బ్రోషూర్‌లను గురించి చెప్పండి. జూలైలో బ్రోషూర్‌లను అందించడంలోని ఆసక్తికరమైన అనుభవాలు ఏమైనా ఉంటే చెప్పమని ప్రచారకులను ఆహ్వానించండి. దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా? అనే బ్రోషూర్‌తో బైబిలు పఠనాన్ని ఎలా ప్రారంభించాలో ప్రదర్శించండి. భాగం 1లో ఉన్న పేరా 1లో అడుగబడిన ప్రశ్నను రేకెత్తించండి. రెండు నుండి నాలుగు పేజీల్లో వ్యక్తపర్చబడిన భావాలపై ఇంటివారి ప్రతిస్పందనను అడగండి. దేవుడు నిజంగా మనపట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడని మరి ఆయన రాబోవు నూతన లోకంలో కష్టాలు లేని జీవితాన్ని అనుభవించ వచ్చని ఈ బ్రోషూర్ చూపుతుందని వివరించండి. ఇంకా చర్చించడానికి మళ్లీ వస్తానని చెప్పండి.
పాట 179 (29) మరియు ముగింపు ప్రార్థన.