యెహోవా జ్ఞాపికలు మనల్ని ఆత్మీయంగా పురికొల్పుతున్నాయా?
1 “నీ శాసనములను [జ్ఞాపికలను NW] నేను ధ్యానించుచున్నాను” అని అంటూ కీర్తనల గ్రంథకర్త యెహోవాను స్తుతించాడు. (కీర్త. 119:99) “జ్ఞాపికలు” అనే పదానికున్న హెబ్రీ పదం యెహోవా తన శాస్త్రాల్లో, తన శాసనాల్లో, తన నియమాల్లో, తన ఆజ్ఞల్లో మరియు తన ప్రమాణాల్లో చెప్పబడిన వాటిని ఆయన మన మనస్సుకు మళ్లీ జ్ఞాపకం చేస్తాడన్న భావాన్నిస్తుంది. మనం వాటికి ప్రతిస్పందిస్తే, అవి మనల్ని ఆత్మీయంగా పురికొల్పుతాయి, మనకు ఆనందాన్నిస్తాయి.—కీర్త. 119:2.
2 యెహోవా ప్రజలుగా, మనం క్రమంగా ఉద్బోధలను, సలహాలను అందుకుంటాము. వాటిలో చాలా వాటిని మనం ముందు విన్నాము. ఈ ప్రోత్సాహాలను మనం గుణగ్రహించినా, మనం మర్చిపోతుంటాము. (యాకో. 1:25) యెహోవా ఓపికతో మనకు ప్రేమపూర్వక జ్ఞాపికలు ఇస్తుంటాడు. ‘ప్రభువు ఆజ్ఞలను మనం జ్ఞాపకం చేసుకోడానికి నిర్మలమైన మనస్సులను రేపేందుకు’ అపొస్తలుడైన పేతురు వీటిలో కొన్ని జ్ఞాపికలను వ్రాశాడు.—2 పేతు. 3:1, 2.
3 వ్యక్తిగత పఠనం, కూటాలకు హాజరుకావడం యొక్క ప్రాముఖ్యతను గురించి మనకు మళ్లీ మళ్లీ జ్ఞాపకం చేయబడుతుంది. మన ఆత్మీయ బాగోగుకు ఈ కార్యకలాపాలు ఎంతో అవసరం గనుక అలా చేయబడుతుంది.—1 తిమో. 4:15; హెబ్రీ. 10:24, 25.
4 ప్రకటించాల్సిన క్రైస్తవ బాధ్యతను నెరవేర్చడమే కొందరికి అతి గొప్ప సవాలు. దానికి ప్రయాస, నిశ్చయత మరియు పట్టుదల అవసరం. అలా చేయడానికి మనం కష్టించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, “సమాధానసువార్తవలననైన సిద్ధమనస్సను జోడు” తొడుగుకోవడం ద్వారా “నిలువబడుటకు” మనకు సహాయం లభిస్తుంది.—ఎఫె. 6:14, 15.
5 యెహోవా మననుండి కోరే వాటిని తెలుసుకొని ఉండటంకంటే ఎక్కువే మన సేవను పురికొల్పాలి. “రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోడానికి” మనకు కావలసిన ప్రేరణను హృదయం మనకు ఇస్తుందని అపొస్తలుడైన పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. (రోమా. 10:10) మనకు దృఢ విశ్వాసం ఉంటే మరి మన హృదయం యెహోవా జ్ఞాపికల వైపు మరలి ఉంటే, ఆయన నామాన్ని స్తుతించేందుకు మాట్లాడడానికి మనం ప్రోత్సహింపబడతాము.—కీర్త. 119:36; మత్త. 12:34.
6 మంచి పనులు చేయడానికి మనం కష్టించి పని చేస్తే, అది మనకు సంతోషాన్నిస్తుందని మనం సరిగ్గానే అపేక్షిస్తాము. (ప్రసం. 2:10) పౌలు సంతోషాన్ని యెహోవా అత్మ ఫలాల్లో ఒకటిగా సూచిస్తున్నాడు, మరి దాన్ని ప్రదర్శించడానికి మనం కృషి చేయాలి. (గల. 5:22) “పూర్ణజాగ్రత్త” కలిగి పని చేస్తే సంతోషాన్ని ఉత్పత్తి చేసే ప్రతిఫలదాయకమైన పరిచర్య మనకు బహుమానంగా లభిస్తుందని పేతురు చెప్పాడు.—2 పేతు. 1:5-8.
7 మనం సవాలును ఎదుర్కొన్నప్పుడు, “మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకయుండలేమని” అపొస్తలులు ఉద్ఘాటించినప్పుడు వారు కలిగున్న దృఢ నిశ్చయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. (అపొ. 4:20) మనం అలా ‘చేస్తే మనల్ని మన బోధవినువారిని రక్షించుకొందుమని’ మనం జ్ఞాపకముంచుకుంటే మనం కొనసాగడానికి బలపర్చబడతాము.—1 తిమో. 4:16.
8 ఎడతెగక జ్ఞాపికలను అందుకొంటున్నందుకు మనం విసుక్కోము లేక అన్యమనస్కంగా ఉండము. బదులుగా, వాటి అధిక విలువనుబట్టి మనం ప్రగాఢంగా మెచ్చుకుంటాము. (కీర్త. 119:129) ఈ అపాయకర కాలాల్లో, మనల్ని ఆత్మీయంగా పురికొల్పడానికి మరియు మంచి పనులు చేయడంలో ఉత్సాహాన్ని కలిగుండేందుకు ప్రేరేపించడానికి యెహోవా మనకు జ్ఞాపికలను అందజేస్తూనే ఉన్నందుకు మనం కృతజ్ఞులం కాదా!—2 పేతు. 1:12, 13.