దీనులకు సువార్త
1 తీర్పు జరగనున్న సమయంలో మనం జీవిస్తున్నాము. (యెహె. 9:5, 6) అన్నిచోట్ల ఉన్న దీనులైన ప్రజలు రానున్న దాని కొరకు సిద్ధపడగలిగేలా వారికి అది తెలుపబడడం అత్యావశ్యకమై ఉన్నది. తన కృపాబాహుళ్యముతో “దీనులకు సువర్తమానము ప్రకటించుటకు” యెహోవా తన ప్రజలను నియమించాడు. (యెష. 61:1, 2) మనం ఈ సువార్తను అన్నిచోట్ల ప్రకటించుటకు మన పత్రికలు సహాయపడతాయి.
2 కావలికోట మరియు తేజరిల్లు! మనలను బలపరచే మరియు పురికొల్పే బలమైన ఆత్మీయాహారాన్ని ఇస్తాయి. త్వరలో దేవుని రాజ్యము భూమిని పరదైసుగా మార్చుతుందనే సువార్తతో కావలికోట సాత్వికులను ఓదార్చుతుంది. తేజరిల్లు! శాంతియుతమైన, భద్రతగల నూతన లోకాన్ని గూర్చిన సృష్టికర్త వాగ్దానమందు నమ్మకాన్ని బలపరుస్తుంది. ఈ పత్రికల విస్తృత్తమైన పంపకం దీనులకు సువార్తను అందించే సత్వర మార్గాల్లో ఒకటి. క్రొత్త పత్రికల్లో మనం ఏ సంభాషణ విషయాలను ఎత్తి చూపగలం?
3 ఉచితమైన చోట, “ప్రతిదినం బైబిలు చదవడం నుండి ప్రయోజనం పొందుట” అనే శీర్షికను చూపించి, ఈ ప్రశ్నను అడగడం ద్వారా మీరు మే 1 “కావలికోట”ను అందించవచ్చు:
◼ “మనం బైబిలు చదవడం ద్వారా ఏ ప్రయోజనాన్ని పొందవచ్చని మీరనుకుంటున్నారు? [జవాబు చెప్పనివ్వండి.] రోమీయులు 15:4 నందు బైబిలే ఆ ప్రశ్నను గూర్చి ఆలోచించడానికి సహాయపడుతుంది. [రోమీయులు 15:4 చదవండి.] అనేకమంది ప్రజల దగ్గర, ముఖ్యంగా చర్చి పూర్వోత్తరాలు గల వారి దగ్గర బైబిలు ఉంది, కాని కొందరు మాత్రమే బైబిలు చదవడానికి సమయాన్ని కనుగొంటారు. భవిష్యత్తు కొరకైన కచ్చితమైన నిరీక్షణ బైబిలులోనే ఉందని మేము నమ్ముతున్నాము. మనం దానిని చదివితే మనం ఆశీర్వదించబడతాము.” సరైన అదనపు వ్యాఖ్యానాలు చేసి, ఆ తర్వాత పత్రికలను అందించండి.
4 మే 15 “కావలికోట”యందు “మన పితరులకు ఒక నూతన జీవితం” అనే శీర్షిక ఉంది. మీరు ఈ ఉపోద్ఘాతం ద్వారా ఆసక్తిని రేకెత్తించవచ్చు:
◼ “తమ పితరులు ఎలా ఉండేవారని చాలామంది తరచూ ఆశ్చర్యపోయారు. వారు చనిపోయారు గనుక, అనేకమంది ప్రజలు మనమిక ఎన్నడూ తెలుసుకోలేమనే నిర్ధారణకు వస్తారు. మన పితరులను గూర్చి తెలుసుకునే అవకాశం ఏదైనా ఉందని మీరనుకంటున్నారా?” జవాబు చెప్పనివ్వండి. యోహాను 5:28, 29 చదివి, పరదైసు భూమిలో వారికి నూతన జీవితాన్ని ఇస్తానని దేవుడు ఎలా వాగ్దానం చేశాడో వివరించండి.
5 మీరు ఒక ప్రశ్నను అడుగుతూ మే 8 “తేజరిల్లు!” అందించవచ్చు:
◼ “జీవితాన్ని నిజంగా జీవించదగినదిగా చేసుకునేందుకు ఏమవసరమౌతుందని మీరనుకుంటున్నారు?” జవాబు చెప్పనివ్వండి. ఇరవై ఆరవ పేజీలో “జీవితార్థం ఏమిటి?” అనే శీర్షికను చూపి, ప్రసంగి 2:11లో సొలొమోను చెప్పినదానిని చదవండి. తర్వాత, 12వ అధ్యాయం, 13వ వచనంలోని అతని సలహాను చూపించండి. పత్రికను తీసుకోమని గృహస్థుని ఆహ్వానించండి.
6 మే 14కు ముందు మీరు పత్రికలతో పరిచర్య చేస్తున్నట్లయితే, రాజ్య వార్త సంఖ్య 34 యొక్క ప్రతులను తీసుకువెళ్ళాలని, ఇంతవరకూ దానిని పొందని వారికి దానిని అందించాలని నిశ్చయం చేసుకోండి. పత్రికలను మీ వెంట తీసుకువెళ్ళి, అన్ని సమయాల్లోను, అనియత సాక్ష్యమిస్తున్నప్పుడు కూడా వాటిని అందించడానికి సిద్ధంగా ఉండండి. కుటుంబంలోని మిగిలిన సభ్యులూ అలాగే వారిని సందర్శించే స్నేహితులు మన సాహిత్యాలను చదవవచ్చని గుర్తించి మనమెల్లప్పుడూ వాటిని అందించడానికి సిద్ధంగా ఉండాలి. (1 తిమో. 6:18) మనం దీనులకు అందించే సువార్త వారి జీవితాలను కాపాడవచ్చు.—1 తిమో. 4:16.