కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/95 పేజీ 4
  • విడుదలను తెచ్చే గురుతు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విడుదలను తెచ్చే గురుతు
  • మన రాజ్య పరిచర్య—1995
  • ఇలాంటి మరితర సమాచారం
  • కొందరిని రక్షించేందుకు పునర్దర్శించండి
    మన రాజ్య పరిచర్య—1996
  • ఇతరుల ప్రయోజనార్థమై ఆసక్తిగల వారినందరినీ మళ్ళీ సందర్శించండి
    మన రాజ్య పరిచర్య—1995
  • క్షేత్రసేవలో ఉపయోగించగల ప్రతిపాదనలు
    మన రాజ్య పరిచర్య—2005
  • ప్రతి లేఖనము ఉపదేశించుటకు ప్రయోజనకరమై ఉన్నది
    మన రాజ్య పరిచర్య—1995
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1995
km 5/95 పేజీ 4

విడుదలను తెచ్చే గురుతు

1 యెహోవా తన నీతియుక్తమైన తీర్పులను అమలుచేయక ముందు, ఎల్లప్పుడూ సాత్వికులను హెచ్చరిస్తూ, తప్పించుకోవడానికి మార్గాన్ని తెరుస్తాడు. యెహెజ్కేలు కాలములో జరిగిన హేయకృత్యములన్నిటిని గూర్చి మూల్గు లిడుచు ప్రలాపించేవారు ఉండేవారు. విడుదల కొరకు అలాంటి అర్హులైనవారు గురుతువేయబడేలా యెహోవా చేశాడు. (యెహె. 9:4-6) నేడు మన ప్రకటన పని అదే లక్ష్యాన్ని సాధిస్తుంది. మనం ప్రాముఖ్యమైన పాత్రను నిర్వహించగలము.

2 యథార్థవంతులైన ప్రజలను కనుగొనడం మొదటి మెట్టు మాత్రమే. మనం పునర్దర్శనానికి ఏర్పాటు చేస్తాము. అందించిన సాహిత్యాన్ని, చర్చించబడిన అంశాన్ని వ్రాసుకోవడం ద్వారా మొదటి దర్శనంలోనే పునర్దర్శనానికి సిద్ధపాటు జరుగుతుంది. పునర్దర్శనం చేయడంలో మన సఫలత అనేది మనం తిరిగి వెళ్ళినప్పుడు ఏమి చెప్పడానికి, ఏమి చేయడానికి సిద్ధపడ్డాము అనేదానిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.

3 “కావలికోట”ను అందించిన చోటకు వెళ్ళినప్పుడు దాని ముఖ్యాంశం పై మీ శ్రద్ధను నిలపగలరు:

◼ “కావలికోట కవరు పేజీలో ‘యెహోవా రాజ్యమును ప్రకటించుచున్నది’ అనే వాక్యం ఉంటుందని గమనించండి. లోక సమస్యలకు దేవుని రాజ్యమే ఏకైక పరిష్కారమని ఈ పత్రిక చెప్పడమే దీనిని అసమానమైనదిగా చేస్తుంది. దేవుని చిత్తం భూమిమీద నెరవేర్చబడినప్పుడు దేవుని రాజ్యం ఏమి సాధిస్తుందో ఇది వివరిస్తుంది. భూమియందంతటా ప్రకటించబడుతుందని యేసు చెప్పిన సువార్త ఇదే.” మత్తయి 24:14 చదివి, కావలికోటను క్రమంగా ఎలా పొందవచ్చో, వ్యక్తిగత బైబిలు పఠనానికి ఎలా ఉపయోగించవచ్చో వివరించండి.

4 బైబిలుపైనే శ్రద్ధనిలిపి, దానిని క్రమంగా చదవవలసిన అవసరతను నొక్కి చెప్పడానికి మీరు ఇష్టపడవచ్చు. మీరు ఈ విధంగా చెప్పవచ్చు:

◼ “అనుదిన జీవితంలోని సమస్యలను ఎలా ఎదుర్కోవచ్చు అనేదానిపై ఆచరణాత్మకమైన సలహాను మాకు తెలిసిన దాదాపు అందరూ ప్రశంసిస్తారని అనిపిస్తుంది. మనం నమ్మగల సలహా ఎక్కడ కనుగొనగలమని దొరుకుతుందని మీరనుకుంటున్నారు? [జవాబు చెప్పనివ్వండి.] స్నేహితుల సలహాలను నమ్మిన లేదా సలహాదారులకు డబ్బు చెల్లించిన అనేకులు ఎంతో నిరాశచెందారు. మరొకవైపు, లక్షలాదిమంది ప్రజలు తాము నిజంగా నమ్మగల ఏకైక మూలము బైబిలేనని కనుగొన్నారు. మనం ఎదుర్కొనే ఏ సమస్యనైనా ఎలా అధిగమించాలనేదానిపై బైబిలు మనకు ఉపదేశమిస్తుంది. [2 తిమోతి 3:16, 17 చదవండి.] బైబిలును అర్థం చేసుకోవడం కష్టమని మీరనుకున్నప్పటికీ, జ్ఞానయుక్తమైన ఉపదేశ బాండాగారాన్ని తెరవడానికి మీరు దానినెలా ఉపయోగించుకోవచ్చో నన్ను చూపించనివ్వండి.” నూతన లోక అనువాదం (ఆంగ్లం) వెనుకవైపు ఉన్న “బైబిలు పదాల అనుబంధం” అనే భాగం నుండి “ప్రేమ” అనివున్న చోటకు త్రిప్పి, ఇతరులతో ఉన్న భిన్నాభిప్రాయాలను పరిష్కరించుకోవడానికి అదెలా సహాయపడుతుందో చూపించండి.

5 ఒక బైబిలు పఠనాన్ని ఆరంభించాలనే లక్ష్యంతో, మీరు ఈ ఉపోద్ఘాతాన్ని ఉపయోగిస్తూ, “మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు” అనే పుస్తకాన్ని ఉపయోగించుకోవాలని తీర్మానించుకోవచ్చు:

◼ “మనం మన కుటుంబాలను ప్రేమిస్తాము, వారి శ్రేయస్సును కోరుకుంటాం. మీ కుటుంబం ఇలాంటి లోకంలో నివసించడం ద్వారా ఎలా ప్రయోజనం పొందగలదు?” 156-7 పేజీల్లోని చిత్రాలను చూపించండి. ఆ పేజీల్లో ఇవ్వబడిన ఒకటో రెండో లేఖనాలను చదివి, ఇవి అబద్ధమాడజాలని యెహోవా దేవుడు చేసిన వాగ్దానాలని వివరించండి. మరి 5-6 పేజీల్లోని అధ్యాయాల పట్టికను చూపించి, గృహస్థునికి ఎక్కువ ఆసక్తిగల విషయమేదో అడిగి, అతడు ఎంపిక చేసుకునే అధ్యాయాన్ని తీసి, ఒకటో రెండో పేరాలు చర్చించండి.

6 విడుదలకు గురుతు వేయబడడానికి మరొకవ్యక్తికి సహాయపడాలని మీరిష్టపడుతున్నారా? బాగా సిద్ధపడడం ద్వారా, ఆసక్తి చూపించినట్లు మీరు కనుగొన్నవారందరి దగ్గరకు వెంటనే తిరిగి వెళ్ళడంద్వారా, ‘మీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుటలోనే’ సఫలత ఉంది.—2 తిమో. 4:5.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి