ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక రాజ్య వార్త
1 అన్నిచోట్ల ఉన్న ఆలోచించే ప్రజల ఆసక్తిని రేకెత్తించిన ప్రత్యేక రాజ్య వార్తను మనం ఏప్రిల్ 24 నుండి అందరికీ పంచిపెట్టడం మొదలెట్టాం! దాని వర్తమానం సమయోచితమే కాక, అత్యావశ్యకం కూడా. అన్ని సంఘాల్లోని ప్రచారకులు ఈ వర్తమానాన్ని వేలాదిమంది ప్రజల చేతికి అందించాలని కోరుకుంటూ పూర్ణహృదయంతో మద్దతునిచ్చారు. మీరు పూర్తి భాగాన్ని వహిస్తున్నారా?
2 ఒక్కో ప్రచారకునికి దాదాపు 50 మరియు ఒక్కో పయినీరుకు 250 చొప్పున రాజ్య వార్త ప్రతులు ప్రతి సంఘానికి పంపించబడ్డాయి. మీరు ఎన్ని పంచిపెట్టగలిగారు? మీరు అపేక్షించినంతగా మీరు పంచిపెట్టలేకపోయినట్లయితే, మే 14న పంపకం అయిపోకముందే మరిన్ని పంచే మార్గాల కొరకు ఆలోచించారా? సహాయ పయినీరు జాబితాలో చేరడాన్ని గూర్చిన మాటేమిటి? సాయంకాల సాక్ష్యం వంటి, వారంలోని పరిచర్య కొరకైన అదనపు కూటాల నుండి ప్రయోజనాన్ని పొందగలరా?
3 ప్రాంతం ఎంతవరకు పూర్తయ్యిందని పెద్దలు జాగ్రత్తగా పునఃసమీక్షిస్తారు. తన ప్రాంతాన్నంతటినీ పూర్తి చేయడం సంఘానికి సాధ్యం కాకపోవచ్చు, కాబట్టి దగ్గరలో ఉన్న సంఘం కరపత్రాన్ని అందించడంలో తన ప్రాంతాన్ని పూర్తి చేసినట్లయితే, (కొన్నిసార్లు మాత్రమే అలా జరుగవచ్చు) సహాయాన్ని పొందేందుకు పెద్దలు ఆ సంఘాన్ని సంప్రదించాలి. సంఘాల మధ్య సహకారంతో పాటు పూర్ణహృదయంతోకూడిన మన ప్రయత్నాల ద్వారా మన పని పూర్తికావాలి.
4 క్రొత్త ప్రచారకులు, పిల్లలతో సహా చాలామంది పాల్గొనగలిగినందుకు మీరు ఈ పనిలో మరింత సంతోషాన్ని పొంది ఉండవచ్చు. అనుకూలంగా ప్రతిస్పందించినవారిని పునర్దర్శించాలని అందరినీ ప్రోత్సహిస్తూ, ఈ సంతోషభరితమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవచ్చని నిరీక్షించబడుతుంది. ఆసక్తిని కనబరచినవారిని గూర్చి వ్రాసిపెట్టుకుంటూ కచ్చితమైన ఇంటింటి రికార్డులను ఉంచుకోవాలని మనము కోరబడ్డాము. క్రొత్త పఠనాలను ఆరంభించాలనే లక్ష్యంతో పునర్దర్శనాలను చేయడంపై శ్రద్ధ నిలపడానికి మే నెలలోని తరువాతి భాగం చక్కని సమయమై ఉంటుంది.
5 మనం తిరిగి వెళ్ళినప్పుడు ఏమి చెప్పగలం? ఇలా చెప్పడం ఫలవంతంగా ఉంటుందని మీరు కనుగొనవచ్చు: “ఇటీవల నేను మీకిచ్చిన ముద్రిత సమాచారం మీకు గుర్తుండవచ్చు; దానిని చదివి, దానిని గూర్చి ఆలోచించే అవకాశం మీకు దొరికి ఉంటుందని నేను అనుకుంటున్నాను. మానవజాతియంతా ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలను గూర్చి ఈ వర్తమానం చర్చిస్తుంది గనుక, నిజంగా అది మన సమాజంలో విస్తృత చర్చలకు కారణమైంది.” రెండవ పేజీలోని ఆలోచనను రేకెత్తించే ఏవైనా కొన్ని వాక్యాలను సూచించి, ఇలా అడగండి: “భవిష్యత్తు మనకు తెచ్చే దానికొరకు మనం సిద్ధంగా ఉన్నామని నిశ్చయం చేసుకునేందుకు మనం ఏమి చేయవలసిన అవసరం ఉందని మీరనుకుంటున్నారు?” జవాబు చెప్పనివ్వండి. ఆసక్తి కనబరచబడినట్లయితే, రాజ్య వార్తయందలి 2-4 పేజీల్లోని మరితర అంశాలను చర్చించి, బైబిలు పఠనాన్ని లేదా, అది సాధ్యం కానట్లయితే, క్రొత్త పత్రికలను అందించండి.
6 మీరు మరొక సంఘ ప్రాంతంలో పరిచర్య చేయడానికి ఆహ్వానించబడినట్లయితే, ఆ సంఘంలోని ప్రచారకులు పునర్దర్శనాలు చేయగలిగేలా ఆసక్తి చూపించినవారి పేర్లను ఆ సంఘానికి ఇస్తారని నిశ్చయం చేసుకోండి. అలాగే మీరు కొన్ని స్థలాలకు తిరిగి వెళ్ళాలని కోరబడినట్లయితే, వెంటనే తిరిగి వెళ్ళండి.
7 ఈ రాజ్య వార్త యొక్క ప్రత్యేక పంపకం ఉత్తేజాన్ని కలిగించి, రాజ్యప్రకటనా పనిలో మన ప్రయత్నాలను అధికం చేయాలని మనల్నందరినీ పురికొల్పింది. యెహోవా యొక్క గొప్ప నామాన్ని, సంకల్పాన్ని గూర్చి అన్నిచోట్ల ఉన్న అందరి అవగాహనను అధికం చేస్తూ అది గొప్ప విజయాన్ని చేకూర్చుతుందని మనం నమ్మకం కలిగి ఉండవచ్చు. (యెష. 12:4, 5) మనం ఎంత అధికంగా చేయగలిగితే, మన సంతోషం అంత అధికమౌతుంది.—కీర్త. 126:3.