రాజ్య వార్తలో ఆసక్తి చూపించిన వాళ్ళదగ్గరికి తిరిగి వెళ్ళండి
1 గత కొన్ని వారాలు, “మానవులందరూ ఎప్పటికైనా ఒకరినొకరు ప్రేమిస్తారా?” అనే శీర్షిక ఉన్న రాజ్య వార్త నెం. 35ను పంచి పెట్టే ఆధిక్యతలో ఆనందించాం. ఈ రాజ్య వార్త సంచికతో సాధ్యమైనంత మంది అర్హులను చేరుకునేందుకు అన్నిచోట్లా ఉన్న ప్రచారకులు శ్రమిస్తున్నారు. (మత్త. 10:11) ఈ ప్రచార కార్యక్రమం ఆదివారం నవంబర్ 16న ముగిసేందుకు పట్టిక వేయబడినప్పటికీ, సంఘంలో రాజ్య వార్త నెం. 35 సరఫరా ఉన్నంత వరకూ వాటిని పంచిపెట్టడంలో కొనసాగాలని పెద్దలు మిమ్మల్ని కోరవచ్చు.
2 ఈ రాజ్య వార్త సంచిక చాలా మంది ప్రజల ఆసక్తిని రేకెత్తించింది. మొత్తం మీద మానవులందరూ సహజ అనురాగాన్ని కోల్పోయారని వాళ్ళు గ్రహిస్తారు, కనుక భవిష్యత్తులో ఏమి జరగనుంది అని వాళ్ళు ఆలోచిస్తారు. (2 తిమో. 3:3) ఆసక్తి కనిపించిన చోటకు తిరిగి వెళ్ళాలని మనం కోరుకుంటాం.
3 రాజ్య వార్త ఫలితాలను తెస్తుంది: 1995 రాజ్య వార్త ప్రచార కాలంలో, ఈ కరపత్ర ప్రతిని అందుకున్న ఒక స్త్రీ యెహోవాసాక్షులు ఏమి నమ్ముతున్నారో మరెక్కువగా తెలుసుకోవాలని కోరుకుని, రాజ్య మందిరంలో కూటాలకు వచ్చింది. ఆమె కూటానికి వచ్చిన ఆ మొదటిసారే బైబిలు పఠనాన్ని వెంటనే అంగీకరించింది. అప్పటి నుండి ఎప్పుడో తప్ప ప్రతివారం ఆమె కూటాలకు వచ్చేది. ఎంతో కాలం గడవక ముందే, తన చర్చి సభ్యత్వానికి రాజీనామా ఇస్తున్నట్లు తెలియజేస్తూ ఆమె చర్చికి ఉత్తరం వ్రాసింది!
4 ఇప్పటికెల్లా, పరిచర్య ప్రాంతంలోని వందలాది మంది ప్రజలు రాజ్య వార్త నెం. 35లోని సందేశాన్ని చదివేశారు. కానీ, వారి ప్రతిస్పందన ఏమిటి? తాము చదివిన విషయంలో వాళ్ళకు అనుకూలమైన అభిప్రాయమే కలిగినప్పటికీ, యెహోవాసాక్షుల్లో ఒకరు తమను మళ్ళీ సందర్శించే వరకూ వాళ్ళలో చాలా మంది ఏ చర్యనూ గైకొనరు. మీరు తిరిగి వెళ్ళేందుకు పథకం వేస్తున్నారా? మన తోటిమనుష్యుల ఎడల మనకున్న ప్రేమపూర్వకమైన శ్రద్ధ మనమలా చేయడానికి మనలను కదిలించాలి. రాజ్య వార్తలో ఆసక్తి చూపించిన వాళ్ళందరి దగ్గరకూ తిరిగి వెళ్ళాలి.
5 మీరు తిరిగి వెళ్ళినప్పుడు ఏమి చెబుతారు? రాజ్య వార్తలోని సందేశం ఎంత సమయోచితమైనదనే దాని గురించి మీరు కొన్ని వ్యాఖ్యానాలు చేయవచ్చు. ఆ తర్వాత ఆలోచనను రేకెత్తించే ప్రశ్నను అడగవచ్చు. గృహస్థుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు శ్రద్ధగా ఆలకించండి. అలా ఆయన మనస్సులో ఏముందో మీరు తెలుసుకోగలుగుతారు. తర్వాత రాజ్య వార్తలో విశేషంగా తెలుపబడిన సముచితమైన అంశాన్ని దేవుడు కోరుతున్నాడు బ్రోషూర్లో నుండి చూపిస్తూ అవధానాన్ని మళ్ళించండి. మీకు అనుకూలమైన ప్రతిస్పందన లభించినట్లయితే, అప్పుడే అక్కడే బైబిలు పఠనాన్ని నిర్వహించండి.
6 “రాజ్య వార్త” నెం. 35లో ఆసక్తిని చూపించినవాళ్ళ దగ్గరికి తిరిగి వెళ్ళేటప్పుడు మీరు ప్రయత్నించగల కొన్ని అందింపులు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:
◼ “ఈ మధ్యే నేను మీకిచ్చి వెళ్ళిన ముద్రిత సమాచారం మీకు జ్ఞాపకం వస్తుండవచ్చు. దానిలోని సందేశం—ఇతరుల ఎడల ప్రేమ లేకపోవడమే నేడు మానవుల మధ్య విభేదాలను కలిగిస్తుందన్న ముఖ్య వివాదాన్ని స్పృశిస్తుంది.” రాజ్య వార్త 2వ పేజీలో “పొరుగువారి ఎడల ప్రేమ చల్లారిపోయింది” అనే శీర్షిక క్రింద ఇవ్వబడిన రుజువుల వైపుకు అవధానాన్ని మళ్ళించండి. తర్వాత, “మానవులు ఈ విధంగా జీవించాలన్నదే దేవుని ఉద్దేశమని మీరనుకుంటారా?” అని అడగండి. ప్రతిస్పందించనివ్వండి. దేవుడు కోరుతున్నాడు బ్రోషూర్లోని 5వ పాఠాన్ని తీసి, బైబిలు పఠనాన్ని ఆరంభించేందుకు ప్రయత్నించండి.
◼ “మనం మొదటి సారి కలిసినప్పుడు, ‘మానవులందరూ ఎప్పటికైనా ఒకరినొకరు ప్రేమిస్తారా?’ అనే అంశంపై కొంత సమాచారాన్ని మీకిచ్చి వెళ్ళాను. అలాంటి లోకం సుసాధ్యమని మీరనుకుంటున్నారా?” ప్రతిస్పందించనివ్వండి. దేవుడు కోరుతున్నాడు బ్రోషూర్లోని 6వ పాఠాన్ని తీసి, 6వ పేరాను చదవండి. తర్వాత, మీకా 4:3, 4లో ఉన్న దేవుని వాగ్దానాన్ని చదవండి. గృహస్థుడికి ఆసక్తి ఉన్నట్లు కనబడితే, బ్రోషూర్నూ, పఠనాన్నీ ప్రతిపాదించండి.
◼ “నేను క్రితం మీ దగ్గరికి వచ్చినప్పుడు, ‘మానవులందరూ ఎప్పటికైనా ఒకరినొకరు ప్రేమిస్తారా?’ అనే శీర్షికపై కొంత సమాచారాన్ని ఇచ్చి వెళ్ళాను. అందులో ఉచిత గృహ బైబిలు పఠనం ప్రతిపాదించబడి ఉంది. మేము ఉపయోగించే పఠన సహాయకాన్ని మీకు చూపించడానికి మళ్ళీ వచ్చాను. [జ్ఞానము పుస్తకాన్ని చూపించండి.] ఈ పుస్తకం మానవులందరూ ఒకరినొకరు ఎప్పుడు ప్రేమిస్తారో స్పష్టంగా వివరిస్తుంది. మనమెందుకు వృద్ధులమై మరణిస్తున్నాం? దేవుడు కష్టాలను ఎందుకు అనుమతిస్తున్నాడు? మరణించిన మన ప్రియమైనవారికి ఏమి సంభవిస్తుంది? అని మీరు ఆలోచించగల ఇతర ప్రశ్నలకు జవాబిస్తుంది.” ఆ తర్వాత, “పఠన కోర్సు ఎలా జరుగుతుందో నేను చూపించవచ్చాండీ?” అని అడగండి. గృహస్థుడు మీ ప్రతిపాదనను నిరాకరిస్తే, పుస్తకాన్ని తనకు తానుగా చదవడానికి ఆయన ఇష్టపడతాడేమో అడగండి. ఆయనకు ఒక ప్రతిని ప్రతిపాదించండి. తిరిగి వెళ్ళేందుకు పథకం వేసుకోండి.
7 రాజ్య వార్త నెం. 35 సరఫరా అయిపోయిన తర్వాత, ఈ నెలలో మిగతా రోజుల్లో జ్ఞానము పుస్తకాన్ని ప్రతిపాదించవచ్చు. మన రాజ్య పరిచర్య 1996 మార్చి, జూన్, మరియు నవంబరు సంచికల్లోని మరియు 1997 జూన్ సంచికలోని వెనుక పేజీల్లో ఈ పుస్తకం కోసం ఇవ్వబడిన చక్కని అందింపుల సేకరణ కనిపిస్తుంది.
8 ఈ రాజ్య వార్త ప్రత్యేక పంపకం మనం ప్రకటనా పనిలో మన ప్రయత్నాలను అధికం చేసేందుకు మనందరినీ ప్రేరేపించాలి. మానవులు ఒకరినొకరు ప్రేమించాలన్న దేవుని ఉద్దేశాన్ని తెలుసుకునేలా ప్రజలకు సహాయపడేందుకు ఈ ప్రచార కార్యక్రమం నిశ్చయంగా సఫలమయ్యేందుకు యెహోవా సహాయం ఉంటుందని మనం నమ్మకం కలిగి ఉండవచ్చు. రాజ్య వార్తలో ఆసక్తి చూపించినవాళ్ళ దగ్గరకు మనం తిరిగి వెళ్తుండగా యెహోవా మన ప్రయత్నాలను ఆశీర్వదించడంలో కొనసాగును గాక.