వెలుగు ప్రకాశకులుగా మన మాదిరికర్తను వెంబడించుట
1 యేసు తన గురించి తానే ఈ విధంగా ప్రకటించుకున్నాడు: ‘నేను లోకమునకు వెలుగైయున్నాను.’ ఆయన మాదిరిని అనుసరించడం ద్వారా యేసు శిష్యులు కూడా “లోకమునకు వెలుగైయున్నారు.” (మత్త. 5:14) తనను వెంబడించే వారందరూ “జీవపు వెలుగును” కలిగి ఉంటారని ‘లోకమునకు వెలుగుగా’ యేసు చెప్పగలిగాడు. (యోహాను 8:12) ఆ వెలుగును దాచి ఉంచడానికి లేక మెరుగు చేయడానికి దేనినీ అనుమతించకూడని ఆత్మీయ వెలుగు ప్రకాశకులుగా అది మనలను చేస్తుంది.
2 ప్రభావవంతులైన వెలుగు ప్రకాశకులుగా ఎలా ఉండాలో మనకు చూపేందుకు యెహోవా సంస్థ తర్ఫీదునిస్తుంది. మనం పొందే ఉపదేశాన్ని, నడిపింపును మనం సన్నిహితంగా అనుసరించినట్లయితే, అన్ని రకాల ప్రజలకు రాజ్య సత్యాన్ని గూర్చిన జ్ఞానాన్ని అధికం చేయగలుగుతాము. (1 తిమో. 4:6) వెలుగు ప్రకాశకులుగా సేవచేయడంలో, ప్రతి అవకాశంలోను సత్యాన్ని గూర్చి మాట్లాడడమే కాక, క్రైస్తవులముగా మంచి ప్రవర్తనను కలిగి ఉండడం కూడా ఇమిడి ఉంది. మన మాదిరికర్త ప్రవర్తన అనింద్యమైనది. ఆయన అనుచరులంగా, క్రైస్తవత్వం మన అనుదిన జీవన విధానమని మనం చూపించాలి. (ఎఫె. 5:9; తీతు 2:7, 8, 10) ఇతరులు చూసి, దేవున్ని మహిమపరచడానికి వారిని పురికొల్పేలా మనం సత్క్రియలను చెయ్యాలి.—మత్త. 5:16.
3 ఒక సాక్షి ఇంటింటికి వెళ్తున్నప్పుడు, ఒక అసాధారణమైన అభ్యర్థన చేయబడింది. ఆ ఇంటి యజమాని, అతని భార్య ఎంతో అనారోగ్యంతో ఉన్నారు, కాని వారు కొంత డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేయవలసి ఉంది. అది చేసి పెడతారా అని వారు సాక్షిని అడిగారు. ఆయన ఒప్పుకున్నాడు, బ్యాంకులో వేసేందుకు 2,000 డాలర్ల డబ్బు ఆయన చేతికివ్వబడింది! ఆయన తిరిగివెళ్ళినప్పుడు, ఆయనిలా అడిగాడు: “నేను మీకు తెలియకపోయినా నన్ను మీరెలా నమ్మగలిగారు?” జవాబు: “యెహోవాసాక్షులను మాత్రమే నమ్మవచ్చని మాకు తెలుసు, ప్రతి ఒక్కరికీ తెలుసు.” బైబిలు యొక్క నైతిక సూత్రాలను మనం సన్నిహితంగా అనుసరించడం దేవుని మహిమపరచే అలాంటి మంచి పేరును తెస్తున్నందుకు మనం ఎంతో కృతజ్ఞులమై ఉండాలిగదా!
4 ఒకటవ తరగతిలోని ఉపాధ్యాయురాలు సాక్షియైన ఆరేండ్ల విద్యార్థిని హాలోవిన్ పండుగకు సంబంధించిన చిత్రాలకు ఎందుకు రంగులు వేయడంలేదో తన తరగతిలో వివరించింది. తాను విశ్వసిస్తున్నదాని కారణంగా ఇతరులకు భిన్నంగా ఉండేందుకు ఆమెకు గల ధైర్యాన్ని బట్టి తాను ఎంతో గర్విస్తున్నానని ఆ ఉపాధ్యాయురాలు చెప్పింది. మనం దేనినైనా గట్టిగా నమ్ముతున్నట్లయితే దాని కొరకు స్థిరంగా నిలబడే ధైర్యం మనకుండాలని ఉపాధ్యాయురాలు వ్యాఖ్యానించింది. ఆ రాత్రి ఆ ఉపాధ్యాయురాలు తన స్వంత విశ్వాసాలను గూర్చి విశ్లేషించుకుని, తాను తన నమ్మకాల కొరకు అలాంటి ధైర్యాన్ని చూపలేదని ఒప్పుకోవలసి వచ్చింది. ఇక భవిష్యత్తు సెలవు దిన ఆచరణల్లో తన తరగతిని ఇమడ్చనని ఆమె మరుసటి రోజు ప్రకటించింది, వాటిలో కొన్నింటిని ఆమే నమ్మదు!
5 యెహోవా ప్రజలు ఎక్కడున్నప్పటికీ తమ వెలుగును ప్రకాశింపజేయాలనే ఆతురతను కలిగి ఉంటారు. పాఠశాలలో యావనస్థుల మాదిరికరమైన ప్రవర్తన తోటి విద్యార్థుల్లోను, ఉపాధ్యాయుల్లోను అనుకూల ప్రభావాన్ని కలిగించింది. రాజ్యవర్తమానాన్ని గూర్చి ఇతరులు మంచిగా మాట్లాడడానికి ఇరుగుపొరుగున మంచి నడవడిని కనబరచే పెద్దవారైన సాక్షులు కారణమౌతున్నారు. అనేక పరిస్థితుల్లో అనియత సాక్ష్యం మరింత తెలుసుకోవాలని ఆశించే యథార్థ హృదయులను ఆకర్షిస్తుంది. లౌకిక ఉద్యోగంలోని మన శ్రద్ధ మరియు నిజాయితీ కూడా సాక్ష్యమిస్తాయి. అవును మనం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా మనం సత్యంలో ఆసక్తిని రేకెత్తించగలము.
6 మన గొప్ప మాదిరికర్త యొక్క మచ్చలేని జీవిత విధానంపై మన దృష్టిని ఉంచడంద్వారా, ఆయన శిష్యులంగా మనం మన సామర్థ్యాలను పరిపూర్ణం చేసుకోవడంలో కొనసాగగలం. ఆయన మాదిరిని అనుకరించడం మన వెలుగు ‘అందరిపై ప్రకాశిస్తుంది’ అని నిశ్చయపరుస్తుంది.—మత్త. 5:15; 1 పేతు. 2:21.