మీ సహోదరులను బాగా తెలుసుకోండి
1 మన తోటి క్రైస్తవులతో మనకు గల సంబంధంలో, రాజ్యమందిరంలో వారితో పాటు కూటాలకు హాజరు కావడం కన్నా ఎక్కువే యిమిడి ఉంది. మనం దేవుని చిత్తాన్ని చేసేవాళ్ళం, అది యేసుతో మనకు ఆత్మీయ సంబంధాన్ని కలిగిస్తుంది. (మార్కు 3:34, 35) అది చివరికి, క్రైస్తవ సంఘంలోని యితరులతో అంటే, మనం ప్రేమించాలని ఆజ్ఞాపించబడిన ఆత్మీయ సహోదర సహోదరీలతో ఆత్మీయ కుటుంబ బాంధవ్యంలోనికి నడిపిస్తుంది. (యోహాను 13:35) కాబట్టి, ‘దేవుని యింటివారితో’ సహవాసం చేసే వాళ్ళు ఒకరినొకరు బాగా తెలుసుకోడానికి గట్టి ప్రయత్నం చేయాలి.—ఎఫె. 2:19.
2 మీ సహోదరులను వారి పేర్లతో సహా తెలుసుకోండి: మీ సంఘ పుస్తక పఠన గుంపులోని సహోదర సహోదరీలందరి పేర్లు మీకు తెలుసా? హాజరయ్యే అందరి పేర్లు కాకపోయినా, చాలా మంది పేర్లను తెలుసుకోడాన్ని సులభతరం చేస్తూ, సామాన్యంగా గుంపు చిన్నదిగా ఉంటుంది. మీకు కనీసం వాళ్ళ పేర్లు కూడా తెలియకపోతే, వాళ్ళు మీకు బాగా తెలుసని చెప్పగలరా?
3 పిల్లలతో సహా రాజ్యమందిరంలో హాజరయ్యే యితరులను గూర్చి తెలుసుకొనే మాటేమిటి? కొంతమంది స్నేహితులతో మాత్రమే సహవసించడానికి మీరు మొగ్గు చూపుతుండవచ్చు. కొందరితో క్రమంగా సహవసించడంలో సంతోషించడం తప్పుకాకపోయినప్పటికీ, కొందరిని మాత్రమే ఆప్యాయంగా పలకరించాలని, వారితో మాత్రమే ప్రోత్సాహకరంగా మాట్లాడాలని మనం కోరుకోము. మన సహోదర సహోదరీలందరిని సన్నిహితంగా తెలుసుకోడానికి ప్రయత్నం చేస్తూ మనం మన హృదయాలను “విశాలపరచు”కోవాలి. (2 కొరిం. 6:11-13) స్పష్టంగా వాళ్ళను వాళ్ళ పేర్లతో సహా తెలుసుకోడం దానిలో యిమిడి ఉంది.
4 సంఘ కూటాలను నిర్వహించే సహోదరులు హాజరయ్యే ప్రతి ఒక్కరి పేరును తెలుసుకోడానికి ప్రయత్నం చేయాలి. వేదిక మీద నుండి ప్రతి ఒక్కరిని వారి పేరుతో పిలవడం వాళ్ళ వ్యాఖ్యానాలు ప్రశంసించబడుతున్నాయని వారు భావించడానికి అలాగే, యితరులు వాళ్ళ పేర్లను తెలుసుకోడానికి తోడ్పడుతుంది. నిజమే, ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఎవరో కొందరు కొత్తవారు లేదా సందర్శకులు ఉండవచ్చు. అందుమూలంగా ఎవరికైనా ప్రతి ఒక్కరి పేరును తెలుసుకోడం కష్టతరంగానే ఉంటుంది. అయినప్పటికీ, నిజమైన ప్రయత్నం చేయడంలో కొనసాగడం యితరులను ప్రోత్సహిస్తుంది, అది వారియెడల గల నిజమైన వ్యక్తిగత ఆసక్తిని ప్రతిబింబిస్తుంది.—రోమా. 1:11, 12.
5 బాగా పరిచయం చేసుకోడానికి చొరవ తీసుకోండి: సాధారణంగా ప్రయాణ కాపరులు అనేకమంది సహోదర సహోదరీలతో మంచి పరిచయం కలిగి ఉంటారు. వారు దానినెలా చేయగలరు? ప్రాముఖ్యమైన మూడు విధాలుగా చేస్తున్నారు: (1) వారు వాళ్ళతో క్రమంగా ప్రాంతీయ సేవలో కలిసి పనిచేస్తారు; (2) పరిస్థితులు అనుమతించేదాన్నిబట్టి, తమ యింటికి రమ్మన్న వాళ్ళ ఆహ్వానాన్ని అంగీకరిస్తారు; (3) కూటాల్లో పెద్దవాళ్ళను, పిల్లలను పలకరించడానికి వాళ్ళు చొరవ తీసుకుంటారు.
6 మీ సహవాసాన్ని విస్తృతం చేసుకోడానికి, మీ సహోదరులను బాగా తెలుసుకోడానికి మార్గాలను అన్వేషించగలరా? ప్రాంతీయ సేవలో మనతోపాటు రమ్మని మనం యితరులను ఆహ్వానించవచ్చు. వాళ్ళతో కలిసి ఇంటింటి సువార్తకు వెళ్ళడం, పునర్దర్శనాలు చేయడం, బైబిలు పఠనాలకు వెళ్ళడం, పత్రికలతో వీధి సాక్ష్యం చేయడం వాళ్ళతో బాగా పరిచయం ఏర్పరచుకోడానికి చక్కని మార్గాలు. మీ యింటికి రమ్మని యితరులను ఆహ్వానించి. వాళ్ళతో పాటు భోజనం చేయడం లేదా అప్పుడప్పుడు అల్పాహారం తీసుకోడం కూడా మంచిది. కొత్తవారిని లేదా సిగ్గుపడేవాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించడానికి చొరవ తీసుకోడం వారిని ఆత్మీయంగా మరి ఎక్కువగా పురికొల్పడమే కాక, మరిన్ని దీవెనలను కూడా తెస్తుంది.—అపొ. 20:35; 1 థెస్స. 5:11.
7 పౌలుకు తన సహోదరులు బాగా తెలుసు. తన పత్రికలో కొందరిని గూర్చి వ్యక్తిగతంగా చెబుతూ వాళ్ళ పేర్లను వ్రాయడం వాళ్ళపై తనకు గల నిస్వార్థమైన ప్రేమకు, వాళ్ళ యెడల తనకు గల నిజమైన ప్రేమకు నిదర్శనం. (1 థెస్స. 2:17; 2 తిమో. 4:19, 20) మన సహోదరులను బాగా తెలుసుకోడానికి ప్రయత్నం చేయడం మనందరికీ దీవెనలను తెస్తుంది.